Brahmamudi June 19th episode: నిజం కావ్యకి తెలిసేలా చేసిన మాయ.. రుద్రాణి వాళ్లకు కుట్రకు బలైన అప్పు, కళ్యాణ్!
కోడలు చేస్తున్న సేవలకి, ఆమె పట్ల తను తప్పుగా ప్రవర్తించినందుకు అపరాధంతో కుమిలిపోతూ ఉంటుంది అపర్ణ. తన ఆరోగ్యం కోసం భర్త పూజ చేయాలనుకుంటే అందుకు అంగీకరించదు అపర్ణ. మరోవైపు అసలు మాయ ని రుద్రాణి వాళ్ళు కిడ్నాప్ చేయించడంతో ఆమెని వెతికే పనిలో పడతారు కావ్య బృందం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 19వ తేదీ ఎపిసోడ్ 440 లో ఏం జరిగిందంటే..
నా భర్త నాకు నమ్మకద్రోహం చేశాడు అంటే నేను భరించలేక పోతున్నాను అంటుంది అపర్ణ. నేను తప్పు చేశాను అని తెలిసినప్పుడు కొన్ని శిక్షలు వేసినా చివరికి క్షమించావు కదా అంటాడు రాజ్. ఒక ఆడది కొడుకు చేసిన తప్పులని కడుపులో పెట్టుకోగలుగుతుంది కానీ భర్త చేసిన మోసాన్ని భరించలేదు ఇక నా జీవితంలో భర్త అనే అధ్యాయం ముగిసినట్లే అంటుంది అపర్ణ.

మరోవైపు మాయని తీసుకెళ్తున్న కార్లు రెండూ చెరొక వైపుకి డివైడ్ అవుతాయి.ఒక కార్ ని కావ్య ఫాలో అవుతుంది, మరొక కారుని అప్పు వాళ్ళు ఫాలో అవుతారు. అప్పుడే కావ్య ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అదేమిటంటే మాయ బెడ్ మీద ఉన్నప్పుడు నేను నిన్ను కలుస్తానో లేదో తెలియదు అందుకే నీకు నిజం తెలియాలని ఈ వీడియో పంపిస్తున్నాను. నిజానికి ఆ బిడ్డకి మీ మామయ్యకి ఏ సంబంధం లేదు, అ బిడ్డ నాక్కూడా పుట్టలేదు.
ఒకరోజు రాత్రి అనుకోకుండా మేమిద్దరం కమిట్ అయిన మాట నిజమే కానీ దానివల్ల నేను ప్రెగ్నెంట్ అవలేదు కానీ విషయం తెలుసుకున్న నా వెనుక ఉన్నవాళ్లు నాతో ఈ నాటకం ఆడించారు అనేది వీడియో సారాంశం. ఆ వీడియో చూసిన కావ్య నా అంచనాయే నిజమైంది, మావయ్య గారికి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఆ మాయని ఎలాగైనా కాపాడాలి అనుకుంటూ రౌడీల కార్ కి అడ్డుగా వెళ్లి వాళ్ల కార్ ఆపుతుంది.

కార్ దగ్గరికి వచ్చి కార్లో చూస్తే అక్కడ మాయ ఉండదు. రౌడీలు కావ్యని బెదిరించి ఆమె దగ్గర ఉన్న ఫోన్ లాక్కుంటారు. అప్పుడు కావ్య డ్రైవర్ యాదగిరి ఫోన్ తీసుకొని అప్పుకి ఫోన్ చేసి మీరు ఫాలో అవుతున్న కారులోనే మాయ ఉంది నాకు లైవ్ లొకేషన్ పంపించు నేను అక్కడికి వస్తాను అంటుంది. అప్పు అలాగే చేస్తుంది. మరోవైపు తల్లి దగ్గరికి వచ్చిన రాహుల్ నువ్వు చెప్పినట్లే హోటల్లో అంతా సెట్ చేశాను అంటాడు.
అయితే పదా ఇక్కడ చేయవలసిన పని చేద్దాం అంటూ కొడుకుని తీసుకొని అనామిక గదికి వెళుతుంది. అక్కడ అనామిక తో మాట్లాడుతూ నీ భర్త, అప్పు ఫలానా హోటల్లో ఉన్నారు మీ అత్తగారిని తీసుకుని వెళ్తే వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అంటుంది. ఆవేశంతో రెచ్చిపోయిన అనామిక అత్తగారిని తీసుకొని హోటల్ కి బయలుదేరుతుంది. అదే సమయంలో మాయని వెతుకుతున్న కళ్యాణ్ వాళ్ళని ఒక రూమ్ లో బంధించేస్తారు రాహుల్ మనుషులు.

మీడియా రావడం గమనించి బయట నుంచి డోర్ ఓపెన్ చేస్తారు. అప్పుడే గది నుంచి బయటకు వచ్చిన కళ్యాణ్ వాళ్ళని మీడియా వాళ్ళు లేనిపోని ప్రశ్నలు వేస్తారు. అప్పుడే కావ్య అక్కడికి చేరుకుంటుంది. మాకు సవా లక్ష పనులు ఉంటాయి ఒక ఆడ మగ కలిసి తిరిగితే అదే పనా.. వేరొక పని ఉండదా మీకు ఎలాంటి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటూ అప్పు వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది అప్పుడే అనామిక, ధాన్యలక్ష్మి అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి కావ్య వాళ్లు షాక్ అవుతారు.
అప్పుడు మీడియా వాళ్ళు పెళ్లయినప్పటికీ అప్పు అనే యువతి తో తిరుగుతున్న దుగ్గిరాల వారసుడు అని న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. అది చూసి కృష్ణమూర్తి కుదేలైపోతాడు. మన ఇంటి పరువు పోయింది అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. ఆ ఇంటి రాజకీయాలకి మన ఆడపిల్ల బలైపోతుంటే చూస్తూ ఊరుకుంటామా పదండి వెళ్లి తేల్చుకుందాం అంటూ కనకం ఆవేశంగా కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. కృష్ణమూర్తి ఆమెని ఫాలో అవుతాడు.

తరువాయి భాగంలో కళ్యాణ్ వాళ్ళని ఇంట్లో అందరి ముందు నిలదీస్తూ ఉంటుంది అప్పు. ఏ సంబంధం లేకుండానే హోటల్ గదికి వెళ్లారా అని నిలదీస్తుంది.ఏ సంబంధము లేకుండా ఎందుకు ఉంటుంది, నువ్వు అనుకుంటున్న సంబంధమే ఉంది అంటుంది కనకం. అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆర్గ్యు చేస్తున్న వాళ్లని మందలిస్తాడు రాజ్.


Click it and Unblock the Notifications










