Brahmamudi july 1st episode: అనామిక పెద్ద ప్లానే వేసిందిగా.. రాజ్ తీసుకున్న నిర్ణయం ఏమిటి?
ఇందిరాదేవి కుటుంబ సభ్యుల సహకారంతో రాజ్ దంపతులకు తెలియకుండా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ వేడుక జరగకూడదని రుద్రాణి కుట్ర పన్నుతుంది. హోటల్లో జరిగిందానికి కారణం అనామిక అని ఇంట్లో నిరూపించి ఆమెకి విడాకులు ఇస్తానంటాడు కళ్యాణ్. వాళ్లని కలిపే ప్రయత్నం చేస్తారు రాజ్ దంపతులు. అయితే అనామిక తల్లిదండ్రులని ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టడంతో తల్లిదండ్రులతో సహా ఆమెని బయటికి పొమ్మంటాడు కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 1వ తేదీ ఎపిసోడ్ 450 లో ఏం జరిగిందంటే..
తనకి అన్యాయం జరిగిందంటూ టీవీలో రచ్చబండ పెడుతుంది అనామిక. దుగ్గిరాల కుటుంబం ఆడవాళ్ళకి విలువ ఇవ్వదని, తన భర్త తాగి వచ్చే తనని బాగా టార్చర్ చేస్తున్నాడని, వేరే అమ్మాయితో తిరుగుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని అయినా నాదే తప్పు అంటున్నారు అని కంప్లైంట్ చేస్తుంది. ఇదే విషయం గా రిపోర్టర్ మహిళా మండలి ప్రతినిధిని తన అభిప్రాయం చెప్పమంటుంది. ముందు ఆమె అనామికని పెద్దగా సమర్ధించదు కానీ అప్పు కళ్యాణ్ లో లైవ్ లో దొరికిన వీడియో చూపించడంతో ఇప్పటివరకు చిన్న చిన్న మనస్పర్ధలు వల్ల భార్యాభర్తలు విడిపోకూడదని అనామికని సమర్థించలేదు.

కానీ భార్యని పక్కన పెట్టుకొని మరొక ఆమెతో ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్నాడు అంటే ఆలోచించవలసిన విషయమే, ఈ విషయంలో ఆమెకి మా పూర్తి మద్దతు ఉంటుంది ఆమె తరుపున మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తుంది. టీవీలో ఈ పంచాయతీ చూసిన రాజ్ కుటుంబ సభ్యులు, అప్పు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడతారు. నెక్స్ట్ సీన్లో అనామికని మందలిస్తారు ఆమె తల్లిదండ్రులు నువ్వు తప్పు చేస్తున్నావ్ బేబీ, ఇలా చేస్తే నీ భర్తకి కోపం కోపం రాక ఏమవుతుంది అంటారు.
నేను తప్పు చేయడం లేదు నాన్న ఇంకా చెప్పాలంటే ఇప్పుడే కరెక్ట్ గా చేస్తున్నాను ఈ దెబ్బకి కళ్యాణ్ నాతో కాళ్ళ బేరానికి రావాలి అంటుంది అనామిక. అసలు మేమే తప్పు చేసాము నిన్ను భర్తని గుప్పెట్లో పెట్టుకోమని చెప్పాము గాని ఇలా బానిసని చేసుకోమని చెప్పలేదు అంటాడు అనామిక తండ్రి. నువ్వు ఇలా ఇంటి పరువుని బజారున పడేస్తే ఏ భర్త అయినా ఎందుకు చెప్పిన మాట వింటాడు అంటుంది అనామిక తల్లి. కానీ నా భర్త వినాలి నేను చెప్పినట్లే చేయాలి అందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను అంటుంది అనామిక.

మరోవైపు కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉండగా అక్కడికి వచ్చిన రాజ్ ఇన్ని రోజులు కళ్యాణ్ అని చెప్తుంటే అతనిని సమర్థించలేదు కానీ వాడు ఎందుకు విడాకుల గురించి మాట్లాడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది అందుకేకళ్యాణ్ కోరుకున్నట్లు అతనికి విడాకులు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నాను అంటాడు. అలా చేయకండి అనామిక ఏదో ఆవేశంలో చేసింది అందుకని మనం కూడా ఆవేశపడితే ఎలా అంటుంది కావ్య.
తనేమీ ఆవేశంలో చేయలేదు అంతా ప్లాన్ ప్రకారమే చేసింది అంటాడు సుభాష్. కళ్యాణ్ విడాకులు ఇవ్వటానికి పిన్ని, బాబాయ్ కూడా ఒప్పుకోవాలి అంటాడు రాజ్. ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి ఇంకా అనామికని కోడలు గానే చూస్తున్నావా పిన్ని అని అడుగుతాడు. నా కొడుకుని బజారుకీడ్చిన దాన్ని ఎలా కోడలిగా అంగీకరిస్తాను అంటుంది ధాన్యలక్ష్మి. ప్రకాష్ కూడా అలాంటి ఆడది ఈ ఇంటికి కోడలుగా పనికిరాదు అంటాడు.

వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే పోలీసులు వచ్చి కళ్యాణ్ మీద అనామిక కేసు పెట్టింది అరెస్ట్ చేస్తాం అంటారు. ఇంట్లో అందరూ కంగారు పడతారు ధాన్యలక్ష్మి అనామికతో మాట్లాడుతాను ఇంట్లోనే తేల్చుకుందాము అంటుంది. కానీ రాజ్ అందుకు ఒప్పుకోడు, అనామిక ప్లాన్ అదే, మనం భయంతో తన కాళ్లు పట్టుకుంటామని కోడలుగా తిరిగి ఇంటికి వస్తామని అనుకుంటుంది, కళ్యాణ్ ని క్షమాపణ చెప్పమని అడుగుతుంది అంటాడు రాజ్. నేను చచ్చినా క్షమాపణ చెప్పను అంటాడు కళ్యాణ్.
తరువాయి భాగంలో పోలీస్ స్టేషన్ ముందు మహిళా సంఘం సభ్యులు కళ్యాణ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన రాజ్ వాళ్లని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తారు మీడియా రిపోర్టర్లు. ఇదంతా మీకు తప్పుగా అనిపించడం లేదా అని నిలదీస్తారు.


Click it and Unblock the Notifications











