Brahmamudi June 1st episode: మాయను ఘోరంగా అవమానించిన రాజ్ కుటుంబం.. వదినని వెనకేసుకొస్తున్న కళ్యాణ్!
విడాకులు ఇవ్వనని గట్టిగా చెప్తుంది కావ్య. కావ్య కి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ అపర్ణకి వార్నింగ్ ఇస్తుంది ఇందిరా దేవి. రాజ్ తో మాయ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదని రాసిస్తుంది కావ్య. కావ్య చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ ఆమెను మందలిస్తారు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 1వ తేదీ ఎపిసోడ్ 425 లో ఏం జరిగిందంటే..
మందు తాగడం, సిగరెట్లు కాల్చడం మాత్రమే చెడు వ్యసనం కాదు అతిగా నమ్మడం కూడా చెడు వ్యసనమే. నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్న నువ్వు ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతావో తెలియడం లేదు అంటుంది చిట్టి. అసలు మాయని ఎప్పుడు బయటపడతానో తెలియదు అందుకే నేను మీకు ఇంట్లో ఉంటాను అని నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాను అనుకుంటుంది కావ్య. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు ఏమి మాట్లాడటం లేదంటే ఏమిటి నీ ఉద్దేశం, నాకు కాఫీ ఏమీ అక్కర్లేదు తీసుకొని వెళ్ళిపో అని కావ్యని కసరుకుంటుంది చిట్టి.

కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత నీకు సాయం చేద్దామంటే నువ్వే అడ్డుకుంటున్నావు అని కావ్య పై జాలి పడుతుంది చిట్టి. మరోవైపు మాయ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన అప్పు ఒక ఇంటి తలుపు తడుతుంది. మాయ ఉందా అని అడుగుతుంది. మీరెవరు అంటుంది ఆ ఇంటావిడ.
నేను తన ఫ్రెండ్ ని అంటుంది అప్పు. ఆమె మీద నమ్మకం కుదరని ఇంటావిడ మాయ రేపు వస్తుంది అని మాత్రమే చెప్తుంది మిగిలిన వివరాలు చెప్పడానికి ఇష్టపడదు. అప్పుడు మాయ తన ఫోన్ నెంబర్ ఇచ్చి తన చిన్నప్పటి ఫ్రెండ్ ని అని చెప్పండి, ఫోన్ చేయమని చెప్పండి అంటుంది. మరోవైపు దిగులుగా ఉన్న కావ్య దగ్గరికి రుద్రాణి, మాయ వస్తారు.
చాలెంజ్ చేసి ఓడిపోయినందుకు కావ్యని దెప్పి పొడుస్తూ ఉంటారు. ఇంతలో అప్పు కావ్య కి ఫోన్ చేసి మాయ ఇల్లు దొరికింది తను రేపు వస్తుందట అని చెప్తుంది. సరే అని ఫోన్ పెట్టేసిన కావ్య మాయ, రుద్రాణి వాళ్ళకి ఒక పిట్ట కథ చెప్పి ఓవరాక్షన్ తగ్గించండి అని హెచ్చరించి వెళ్ళిపోతుంది. ఇది ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడటానికి కారణం ఏమిటో అనుకుంటుంది రుద్రాణి. ఆ తర్వాత లగేజ్ తీసుకొని హాల్లోకి వస్తుంది మాయ.
ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా అని వెటకారంగా అడుగుతుంది స్వప్న. నేను బాబు లేకుండా ఉండలేకపోతున్నాను, బాబు రాజ్ కి బాగా అలవాటు పడ్డాడు అంటుంది మాయ. అంటే ఏంటి ఇప్పుడు రాజ్ గదిలోకి వెళ్తానంటావా అంటుంది స్వప్న.మీరందరూ అర్థం చేసుకొని ఇంట్లో నా స్థానం ఏమిటో తెలియజేస్తారు అనుకుంటున్నాను అంటుంది మాయ. మాయ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది రుద్రాణి. రుద్రాణిని ఎక్కువ మాట్లాడొద్దని ఆమె నోరు మూయిస్తుంది స్వప్న.
ఇన్ని రోజులు బిడ్డ మీద ప్రేమ ఏమయింది,అక్రమంగా బిడ్డని కన్న నువ్వు హక్కుల గురించి మాట్లాడకు, నీకు ఆ గదిలోకి వెళ్లే అర్హత లేదు అంటుంది ఇందిరా దేవి. ఇంకా పెళ్లి అవ్వలేదు కదా అయిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్తుంది అపర్ణ. అపర్ణని అత్తయ్య గారు అని పిలుస్తుంది మాయ. ఇంటి గుట్టు బయట పడకూడదని పెళ్లికి ముందే బిడ్డని కన్నా ఇంట్లోకి రానిచ్చాను అంతేగానీ నీ మీద ప్రేమతో కాదు నువ్వు ఎప్పటికీ నన్ను అత్తయ్య అని పిలవద్దు అని ఆమెని అవమానించి గదిలోకి వెళ్ళిపోతుంది అపర్ణ.
ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా పద నా గదిలో ఉందువు గానివి అంటుంది రుద్రాణి. ఒక జాతి పక్షులు ఒక గూటికి చేరుకుంటున్నాయి అని వెటకారంగా మాట్లాడుతుంది స్వప్న. అక్కడే ఉన్నా కావ్యతో నీ గదికి వెళ్ళు ఏ అర్ధరాత్రి అయినా ఆ మాయ నీ గదిలో దూరినా దూరిపోతుంది అని చెల్లెల్ని హెచ్చరిస్తుంది స్వప్న.
మరోవైపు మీ అన్నయ్య చేసిన తప్పుకి మాయాది అవమానించడం కరెక్టా అని భర్తని అడుగుతుంది అనామిక. మా వదిన సంగతేమిటి అంటాడు కళ్యాణ్. ఇంకా ఆవిడని వదిన అని ఎలా అనగలుగుతున్నావు, డబ్బు కోసం మోసం చేసి మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంది. డబ్బు కోసమే ఆమె భర్తకి మరొక భార్య ఉందని తెలిసినా కూడా ఇదే ఇంట్లో ఉంటుంది అంటుంది అనామిక. మన పెళ్ళికి సపోర్ట్ చేసింది ఆవిడే, మర్చిపోయావా అంటూ భార్యని మందలిస్తాడు కళ్యాణ్.
తరువాయి భాగంలో పెళ్లికి ముహూర్తాలు పెట్టమంటుంది అపర్ణ. రెండు రోజుల్లో ఒక ముహూర్తం ఉంది అని చెప్తారు పూజారి గారు. తర్వాత అప్పు కావ్య కి ఫోన్ చేసి బయలుదేరావా అని అడుగుతుంది. నువ్వు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే తీసుకున్నావా, నిజమైన మాయ ఈరోజు వస్తుందా అని అడుగుతుంది కావ్య. ఆ మాటలు రుద్రాణి వింటుంది.


Click it and Unblock the Notifications











