Brahmamudi June 20th episode: ఇంట్లో పంచాయతీ పెట్టిన అనామిక.. కళ్యాణ్ మొహం మీద తలుపేస్తానంటున్న కనకం!

తన ఆరోగ్యం కోసం భర్త పూజ చేయాలనుకుంటే అందుకు అంగీకరించదు అపర్ణ. మరోవైపు అసలు మాయ ని రుద్రాణి వాళ్ళు కిడ్నాప్ చేయించడంతో ఆమెని వెతికే పనిలో పడతారు కావ్య బృందం. ఆ ప్రయత్నంలో కళ్యాణ్,అప్పు ఒక గదిలో మాయని వెతుకుతూ ఉండగా రాహుల్ మనుషులు వాళ్ళని బంధిస్తారు. మీడియా ముందు కుటుంబ సభ్యుల ముందు దోషులుగా నిలబడతారు అప్పు, కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 20వ తేదీ ఎపిసోడ్ 441 లో ఏం జరిగిందంటే..

ఇంట్లో అందరి ముందు పంచాయతీ పెడుతుంది అనామిక. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ భాగోతం, దీన్ని స్నేహం అంటారా, ప్రేమ అంటారా. మీరే చూశారు కదా ఇప్పుడు ఏమంటారు, ఇది నేనేమీ భ్రమపడి చెప్తున్నది కాదు మీడియా వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దానికి సాక్ష్యం మా అత్తగారు కూడా అంటుంది అనామిక. మా చెల్లెలు అలాంటిది కాదు స్నేహం కోసం ప్రాణం ఇస్తుంది,అని చెల్లెల్ని వెనకేసుకొస్తుంది స్వప్న. వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నోరు మూసుకొని ఉన్నావేంటి అని అప్పుని అడుగుతుంది.

Brahmamudi serial 20th June 2024 Episode of 441 Here is full story

నేనూ మాట్లాడగలను కానీ, ఇంట్లో నా ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండాలి. అందుకే నేనేమీ నోరు విప్పటం లేదు అయినా నేనేంటో నాకు తెలుసు అంటుంది అప్పు. ధాన్యలక్ష్మి కూడా కొడుకుని ఇలాంటి పనులు చేస్తున్నావేంటి, ఇలా దిగజారిపోయావ్ ఏంటి అని మందలిస్తుంది. తొందరపడి కొడుకు మీద నిందలు వేయకు తర్వాత పశ్చాతాప పడవలసి వస్తుంది నాలాగా అంటుంది అపర్ణ. కళ్యాణ్ కూడా నా మీద పడిన నిందని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కనకం అనామిక మీద కోప్పడుతుంది.

Brahmamudi serial 20th June 2024 Episode of 441 Here is full story

నా కూతురు మీద పదేపదే నిందలు వేస్తుంటే ఎలా భరిస్తాను, దానికి పెళ్లి ఎలా అవుతుంది అంటూ కేకలు వేస్తుంది. వాళ్ళిద్దరూ ఒక గదిలో ఉండడం అందరూ చూశారు దాని గురించి ఏం మాట్లాడతారు అంటుంది అనామిక. ఎందుకు మాట్లాడాలి, మాట్లాడవలసిన అవసరం ఏముంది ఎందుకంటే నా కూతురు ఎలాంటిదో నీ భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. భూలోకంలో నీ మొగుడు తప్పితే మరో మగాడు లేడా, నా కూతురు గురించి నోరు జారొద్దు అని హెచ్చరిస్తుంది.

అప్పుడు రాజ్ మాట్లాడుతూ ఎవరు ఎలాంటి వాళ్ళో నాక్కూడా తెలుసు కానీ నిందలు పడుతున్న వాళ్ళు ఎందుకు నోరు మూసుకొని ఊరుకుంటున్నారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని కళ్యాణ్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడరు కానీ కావ్య మాట్లాడుతూ జరిగిందంతా చెప్తుంది. అడ్డంగా దొరికిపోయేసరికి అడ్డమైన కథలు చెబుతున్నారు అంటుంది అనామిక. అదంతా నాకు అనవసరం ఇకమీదట అప్పు కలవడానికి వీల్లేదు అని కేకలు వేస్తుంది.

Brahmamudi serial 20th June 2024 Episode of 441 Here is full story

నువ్వు చెప్పేది ఏంటి, నేనే చెప్తున్నాను ఇకమీదట ఫ్రెండ్షిప్, మట్టి, మసానం అనుకొని మా ఇంటికి రా వద్దని చెప్పండి వస్తే మొహం మీదే తలుపేసేస్తాను అని చెప్పి కూతుర్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కనకం. అడ్డంగా దొరికిపోయేసరికి అడ్డమైన కథలు చెప్పి కూతురిని తీసుకొని చల్లగా జారుకుంది ఇక నేను మిగిలిపోయాను, అయినా కళ్యాణ్.. నీకు ఒక భార్య ఉండగా మరొక ఆడదాని వెనక పడటానికి మనసు ఎలా వచ్చింది? ఎవరి బుద్ధులు వచ్చాయో ఏంటో అంటూ సుభాష్ వైపు చూస్తుంది.

Brahmamudi serial 20th June 2024 Episode of 441 Here is full story

ఆ మాటలకి ఇందిరా దేవి కోప్పడుతుంది. నువ్వెంత నీ బ్రతుకెంత, నువ్వు మాటలు అనేదానివా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నాకు కనిపించకు అని అనామికాని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత కోడలిని కొంచెం అదుపులో పెట్టుకో అని ధాన్యలక్ష్మిని మందలిస్తుంది ఇందిరా దేవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X