Brahmamudi June 21st episode: భర్తకి అసలు విషయం చెప్పిన కావ్య.. నిజం బయటపెట్టి తీరతానంటున్న కళ్యాణ్!

అసలు మాయ ని రుద్రాణి వాళ్ళు కిడ్నాప్ చేయించడంతో ఆమెని వెతికే పనిలో పడతారు కావ్య బృందం. ఆ ప్రయత్నంలో కళ్యాణ్,అప్పు ఒక గదిలో మాయని వెతుకుతూ ఉండగా రాహుల్ మనుషులు వాళ్ళని బంధిస్తారు. మీడియా ముందు కుటుంబ సభ్యుల ముందు దోషులుగా నిలబడతారు అప్పు, కళ్యాణ్. తనకి అన్యాయం జరిగిందని ఇంట్లో పంచాయతీ పెడుతుంది అనామిక. కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చి అప్పుని లాక్కుపోతుంది కనకం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 21వ తేదీ ఎపిసోడ్ 442 లో ఏం జరిగిందంటే..

దిగులుగా కూర్చున్న భార్య దగ్గరికి వచ్చి అనామిక చిన్నపిల్ల తన మాటలు పట్టించుకోవద్దు అంటాడు సుభాష్. పట్టించుకోకుండా ఎలా ఉండమంటారు, ఒకప్పుడు ఈ ఇంట్లో నా మాటే వేదంలా ఉండేది, అలాంటిది ఇప్పుడు నన్ను మాట్లాడలేని పరిస్థితిలోకి నెట్టేశారు అని బాధపడుతుంది అపర్ణ. తప్పు చేసింది నేను నువ్వు ఎందుకు బాధ పడాలి అంటాడు సుభాష్. సమాజం అందుకు ఒప్పుకోదు భర్తగా మీరు తప్పు చేసినా భార్యగా అందులో నేను కూడా సగం శిక్ష అనుభవించాల్సిందే.

Brahmamudi serial 21st June 2124 Episode of 442 Here is full story

ఈరోజు అందరూ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే వాడు అలాంటివాడు కాదు అని చెప్పాలనుకున్నాను కానీ నేను మాట్లాడితే ముందు నీ మొగుడు సంగతి చూసుకో అంటారు అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను, ఇన్నాళ్లు మీతో కాపురం చేసినందుకు మంచి బహుమతి ఇచ్చారు అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.

మరోవైపు రాజ్ నిన్ను ఆ మాయ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా నీ వల్లే నాన్న గురించి నిజం తెలిసింది, అమ్మ హాస్పిటల్ పాలయింది, ఇప్పుడు ఇంట్లో ఈ రచ్చ. ఇదంతా నీ వల్లే అని కావ్య ని మందలిస్తాడు. మాయ నిజం చెబుతూ నాకు ఒక వీడియో పంపించింది అని జరిగిందంతా చెబుతుంది కావ్య. ఆ విషయం కిందన ఎందుకు చెప్పలేదు అంటాడు రాజ్.

Brahmamudi serial 21st June 2124 Episode of 442 Here is full story

ఆధారాలు లేకుండా మాట్లాడితే అత్తయ్యని మామయ్యని కలపటానికి నేనే కట్టు కథ చెప్పాను అనుకుంటారు అంటుంది కావ్య. ఎలాగైనా ఆ మాయని పట్టుకొని నిజం చెప్పించాలి ఇప్పటికైనా నన్ను నమ్మి ఈ ఆపరేషన్ లో మీరు కూడా నాతో కలిసి నడవండి అంటుంది కావ్య. అందుకు సరే అంటాడు రాజ్. మరోవైపు జరిగిందానికి అనామిక ని మెచ్చుకుంటుంది రుద్రాణి. ఇదంతా మీవల్లే చేయగలిగాను అంటుంది అనామిక.

ఎవరితో గొడవపడినా పర్వాలేదు కానీ కళ్యాణ్ తో గొడవ పడకు, మెల్లగా మాట్లాడి నీ దారికి తెచ్చుకో అంటుంది రుద్రాణి. ఈ మగవాళ్ళు మెల్లగా చెప్తే వింటారా ఆంటీ, ఎలాగూ ఇంట్లో వాళ్ళు అప్పుని కళ్యాణ్ ని కలవనివ్వరు ఇక కళ్యాణ్ నేను చెప్పినట్లు వినాల్సిందే, అతడిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను చూస్తూ ఉండండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనామిక. నువ్వేంటమ్మ ఇంత లా మారిపోయావు అంటాడు రాహుల్. ఆ టింగరిది మనం ఏది చెప్తే దానికి రివర్స్లో చేస్తుంది.

Brahmamudi serial 21st June 2124 Episode of 442 Here is full story

రేపటి రోజున అది దొరికిపోయినా మనం దొరికిపోకూడదు కదా అంటుంది రుద్రాణి. మరోవైపు అప్పుని ఇంటికి తీసుకువచ్చిన కనకం ఆమెపై కోప్పడుతుంది. కనకాన్నే మందలిస్తాడు కృష్ణమూర్తి. అసలు ఇదంతా మీ వల్లే జరిగింది ఏ తప్పు చేయలేనప్పుడు ఇంట్లో కూర్చోవాల్సిన పనిలేదు అని దాన్ని ఎంకరేజ్ చేశారు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో రేపు దీనికి పెళ్లి ఎలా అవుతుంది అంటూ అప్పు భవిష్యత్తు గురించి బాధపడుతుంది.

అసలు నేను పెళ్లి చేసుకోను మీకు తోడుగా ఉండిపోతాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు. అప్పు భవిష్యత్తుకు ఏమి భయం లేదు దాని జీవితం బాగుండేలాగా నేను చూస్తాను అని భార్యకి హామీ ఇస్తాడు కృష్ణమూర్తి. మరోవైపు కళ్యాణ్ తో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది అనామిక. జరిగిందంతా మరచిపో ఇకమీదట అప్పు జోలికి వెళ్లవద్దు అంటుంది. నేను అంత త్వరగా మరిచిపోను, మేమిద్దరం అక్కడికి వెళుతున్నట్లు మాకు తప్ప ఎవరికీ తెలియదు.

అలాంటిది మేము రూమ్ లోకి వెళ్ళాక బయట ఎవరు గడియ పెట్టారు, మీడియా వచ్చే సమయానికి ఎవరు గడియ తీసారు ఇవన్నీ చూస్తుంటే మమ్మల్ని ఇరికించటానికి ఎవరో కావాలనే ప్లాన్ చేశారు. ఇలా చేసింది ఎవరు, ఎందుకు చేశారు అనే విషయాలని బయట పెడతాను నిజం నిరూపిస్తాను అంటాడు కళ్యాణ్. మరోవైపు మాయని వెతికే పనిలో పడతారు రాజ్ దంపతులు. దారిలో కార్ ఆగిపోతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X