Brahmamudi 22nd June episode: నోరు విప్పిన మాయ.. గట్టు రట్టు కావడంతో కావ్య షాక్ ఫ్యామిలీ
ఆ ప్రయత్నంలో కళ్యాణ్,అప్పు ఒక గదిలో మాయని వెతుకుతూ ఉండగా రాహుల్ మనుషులు వాళ్ళని బంధిస్తారు. మీడియా ముందు కుటుంబ సభ్యుల ముందు దోషులుగా నిలబడతారు అప్పు, కళ్యాణ్. తనకి అన్యాయం జరిగిందని ఇంట్లో పంచాయతీ పెడుతుంది అనామిక. కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చి అప్పుని లాక్కుపోతుంది కనకం. ఇదంతా ఫ్రీ ప్లాన్డ్ గా జరిగింది మమ్మల్ని కావాలనే ఎవరో ఇరికించారు ఆ నిజమేమిటో తెలుస్తాను అంటాడు కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 22వ తేదీ ఎపిసోడ్ 443 లో ఏం జరిగిందంటే..
కారులో వెళ్తున్న కావ్య రాజ్ ల కారు సడన్ గా ఆగిపోతుంది. రాజ్ కారు రిపేర్ చేస్తాడు తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే దుండగులు నుంచి తప్పించుకొని పరిగెడుతున్న మాయ కావ్య కంట పడుతుంది. మాయ విషయం రాజ్ తో చెప్పి కారు ఆపమంటుంది కావ్య.కార్ దిగి మాయ దగ్గరికి వస్తారు రాజ్ దంపతులు. వాళ్లను చూసి రౌడీలు పారిపోతారు. మాయని తీసుకొని ఇంటికి వస్తారు రాజ్ దంపతులు. కావ్య అందరికీ ఈమె అసలైన మాయ అని పరిచయం చేస్తుంది.

అప్పుడు రుద్రాణి మాట్లాడుతూ మరో కొత్త నాటకం మొదలు పెట్టావా ఆరోజు ఎవరినో తీసుకొచ్చి మాయ అని చెప్పావు, ఇప్పుడు ఈమెను తీసుకొచ్చి మాయా అని చెప్తున్నావు ఈమె అసలైన మాయ అనటానికి సాక్ష్యం ఏమిటి అంటుంది రుద్రాణి. నేనే సాక్ష్యం ఆమె అసలైన మాయ అంటాడు సుభాష్. నేను ఒప్పుకోను వదిన అన్నయ్యతో మాట్లాడటం లేదని రాజ్, కావ్య, అన్నయ్య ఒకటైపోయి ఈ నాటకం ఆడుతున్నట్లు ఉన్నారు అంటుంది రుద్రాణి.
ఇలాంటి చెత్త ఆలోచనలు ఎలా వస్తాయి అని కళ్యాణ్, ఇంట్లో అందరూ కలిసి పోయే సమయం వచ్చేసరికి కడుపు మండుతుందా అని స్వప్న, అసలు తను ఏం మాట్లాడుతుందో వినకుండా తన మాయ కాదు అని నువ్వు ఎలా చెప్తున్నావు అంటూ ధాన్యలక్ష్మి అందరూ రుద్రాణిని కోప్పడతారు. అప్పుడు రాజ్ మాట్లాడుతూ మాయ విషయంలో డాడీ మోసపోయారు అనే విషయాన్ని మొదట గమనించింది కావ్య.

అసలు మాయని పట్టుకునే ప్రయత్నంలో పెద్ద ప్రమాదానికి గురైంది అప్పుడు నేనే రక్షించాను అంటూ జరిగిందంతా చెప్తాడు రాజ్. అప్పుడు ఇందిరాదేవి మాట్లాడుతూ అసలు నిజం ఏమిటో చెప్పమ్మా అని అడుగుతుంది. అప్పుడు మాయ మాట్లాడుతూ నేనే మాయని, అనుకోకుండా సుభాష్ గారు జీవితంలో అడుగుపెట్టవలసి వచ్చింది కానీ మా బిడ్డకి తండ్రి ఆయన కాదు తల్లి నేను కాదు.
ఎవరో తెలియదు కానీ మా ఫిజికల్ రిలేషన్ గురించి తెలుసుకుని నాకు మెయిల్ చేసి ఈ నాటకం ఆడేలాగా చేశారు అందుకే నేను మీ అందరినీ ఇబ్బంది పెట్టవలసి వచ్చింది దయచేసి నన్ను క్షమించండి అంటూ అపర్ణ ని క్షమాపణ వేడుకుంటుంది. ఇలాంటి మనిషిని ఏం చేయాలి అంటుంది ధాన్యలక్ష్మి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు ప్రకాష్. వద్దు ఇందులో ఆమె తప్పేమీ లేదు ఆమెని ఇలా నాటకం ఆడించిన వాళ్ళని శిక్షించాలి అంటుంది ఇందిరా దేవి.

మరెప్పుడు మాకు కనిపించవద్దు అని ఇందిరాదేవి చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాయ. ఈ బిడ్డ సంగతి ఏమిటి వీడిని తీసుకెళ్లి ఏదైనా అనాధాశ్రమంలో జాయిన్ చేసేయండి అంటుంది రుద్రాణి. కానీ అందుకు రాజ్ దంపతులు ఒప్పుకోరు వాడితో మాకు బంధం ఏర్పడిపోయింది వాడిని మేమే పెంచుకుంటాం అంటారు. వారి ఉదార స్వభావానికి గర్వపడుతున్నాను అని మెచ్చుకుంటుంది ఇందిరా దేవి.
తరువాయి భాగంలో రాజ్ భార్య దగ్గరికి వస్తాడు, రండి మీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టండి అంటుంది కావ్య. మరో రకంగా అర్థం చేసుకున్న రాజ్ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు అంటూ సిగ్గుపడతాడు.


Click it and Unblock the Notifications










