Brahmamudi June 24th episode: రుద్రాణికి కావ్య లాస్ట్ వార్నింగ్ .. కళ్యాణ్ ముఖం మీదే తలుపేసిన కనకం!
రుద్రాణి కుట్రకు బలైన అప్పు, కళ్యాణ్ మీడియా ముందు, కుటుంబ సభ్యుల ముందు దోషులుగా నిలబడతారు. తనకి అన్యాయం జరిగిందని ఇంట్లో పంచాయతీ పెడుతుంది అనామిక. కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చి అప్పుని లాక్కుపోతుంది కనకం. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది మమ్మల్ని కావాలనే ఎవరో ఇరికించారు ఆ నిజమేమిటో తెలుస్తాను అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత కావ్య దంపతులు అసలు మాయని తీసుకువచ్చి ఇంట్లో నిజం చెప్పిస్తారు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 24వ తేదీ ఎపిసోడ్ 444 లో ఏం జరిగిందంటే..
గార్డెన్ లో తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయింది, ఆ మాయ వచ్చి నిజం చెప్పింది కానీ ఆమె వెనుక ఉన్నది మనమే అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అంటాడురాహుల్. ఆ విషయం ఇక్కడే మాట్లాడాలా ఎవరైనా వింటారు అని మందలిస్తుంది రుద్రాణి. లేదు మమ్మీ ఇప్పుడు అందరూ కలిసి పోతారు మళ్ళీ ఆ రాజ్ ఆఫీస్ కి వస్తాడు అనే కంగారుపడుతూ చెప్తాడు రాహుల్.

ముమ్మాటికి అలా జరిగి తీరుతుంది, ఎప్పటికీ ఆయన స్థానం ఆయనదే ఎవరు ఆ స్థానాన్ని లాక్కోలేరు అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య. మేమేమీ నీ భర్త స్థానాన్ని లాక్కోవాలని అనుకోవడం లేదు అంటుంది రుద్రాణి. ఎవరు అనుకుంటున్నారో ఎవరు అనుకోవడం లేదో నాకు బాగా తెలుసు ఆ మాయ వెనుక ఉన్న మాఫియా మీరే అని నాకు బాగా తెలుసు అంటూ తన దగ్గర ఉన్న ఫోన్ చూపిస్తుంది కావ్య.
ఏంటి ఇప్పుడు ఇంట్లో అందరి దగ్గర నిజాలు నిరూపిస్తావా అయినా ఫోన్ చూపిస్తే బెదిరిపోతాను అనుకున్నావా అంటుంది రుద్రాణి. ఇది నా ఫోన్ కాదు ఆ రౌడీల ఫోన్. మాయని పట్టుకునే ప్రయత్నంలో ఆ రౌడీల దగ్గర దొరికింది. ఇందులో మీ మాటలు అన్ని రికార్డు అయి ఉన్నాయి, ఈ నిమిషమే నిజాలు బయటపెట్టి మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటివేయగలను కానీ మీతో పాటు మా అక్క కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అందుకే ఊరుకుంటున్నాను.

కానీ ప్రతిసారి ఊరుకోను ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు అపర్ణ దగ్గరికి వచ్చిన సుభాష్ నేను చేసిన తప్పుకి పరిష్కారం ఎప్పటికీ దొరకదు అనుకున్నాను కానీ మన పిల్లలు జరిగిన మోసాన్ని బయటపెట్టారు, నాకు చాలా హాయిగా ఉంది ఇకమీదట నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేనేమో అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఆ గిల్టీనెస్ తగ్గింది, ఇకమీదట మనం హాయిగా ఉందాం అంటూ అపర్ణ మీద చేయి వేస్తాడు.
అపర్ణ కోపంగా ఆ చేతిని నెట్టివేస్తుంది ఆ బిడ్డ మీకు పుట్టకపోవచ్చు కానీ ఆ మాయతో మీరు.... చెప్పడానికే అసహ్యంగా ఉంది, పరాయి ఆడదానిమీద చెయ్యి వేసిన మిమ్మల్ని నన్ను ముట్టుకోనిస్తానని ఎలా అనుకున్నారు, పిల్లల కోసమే నేను మీతో నవ్వుతూ మాట్లాడాను అంతేగాని జీవితంలో నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి థాంక్స్ చెప్పాలి అనుకుంటాడు కానీ కావ్య అందుకు ఛాన్స్ ఇవ్వదు, మీరు నన్ను తిట్టడానికి వచ్చారని నాకు తెలుసు లోకంలో ఉండే తిట్లు అన్నీ తిట్టండి మరెందుకు ఆలస్యం అంటూ రాజ్ ని ఇరిటేట్ చేస్తుంది. నేను చెప్పేది వింటావా అంటాడు రాజ్. అయినా వినకుండా మీతో తిట్లు తినే ఓపిక నాకు లేదు అందుకోసం ఎవరినైనా మనిషిని పెట్టుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ బయటకు వెళ్లి భర్త అవస్థ చూసి నవ్వుకుంటుంది.
రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి భార్యకి థాంక్స్ చెప్పడం కూడా రాదు అని చివాట్లు పెడుతుంది. నువ్వు ముందు లోపలికి రా నా భార్యకి ఎలా ప్రపోజ్ చేయాలో,ఎలా థాంక్స్ చెప్పాలో నాకు బాగా తెలుసు అంటాడు రాజ్. మరోవైపు కనకం ఇంటికి అమ్మలక్కలు వచ్చి అప్పు గురించి తప్పుగా మాట్లాడుతారు. నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అంటూ వాళ్లని చీపురు కట్ట తిరగేసి కొడుతుంది కనకం. వాళ్ళు పరిగెట్టి వాకిట్లోకి వస్తారు అప్పుడే కళ్యాణ్ కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు.
కళ్యాణ్ ని చూసిన ఆడవాళ్లు మరింత రెచ్చిపోయి హోటల్స్ లో అయితే దొరికిపోతారని డైరెక్ట్ గా ఇంటికే తీసుకువచ్చేసారు అంటూ నీచంగా మాట్లాడుతారు. కళ్యాణ్ ని చూసిన కనకం ఫ్యామిలీ షాక్ అవుతారు, కళ్యాణ్ మొహం మీదే కనకం తలుపేసి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పు తలుపు తీయు మనం తప్పు చేయలేనప్పుడు తలవంచుకోవలసిన పనిలేదు అంటాడు కళ్యాణ్. అయినా తలుపు తీయకపోవడంతో వెనక్కి వెళ్ళిపోతాడు.

తరువాయి భాగంలో తోట పని చేసుకుంటున్న కావ్యని చూస్తూ ఉంటాడు రాజ్. ఏమి చేస్తున్నారు అంటుంది కావ్య. ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాను అంటాడు రాజ్.
.


Click it and Unblock the Notifications











