Brahmamudi June 25th Episode: కావ్య నడుమును చూస్తూ రాజ్ రొమాన్స్..శోభనం ఏర్పాట్లు చేస్తున్న ఇందిర!

తనకి అన్యాయం జరిగిందని ఇంట్లో పంచాయతీ పెడుతుంది అనామిక. కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చి అప్పుని లాక్కుపోతుంది కనకం. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది, మమ్మల్ని కావాలనే ఎవరో ఇరికించారు ఆ నిజమేమిటో తెలుస్తాను అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత కావ్య దంపతులు అసలు మాయని తీసుకువచ్చి ఇంట్లో నిజం చెప్పిస్తారు. మరోవైపు అపర్ణ భర్తతో మాట్లాడుతూ జీవితంలో మిమ్మల్ని క్షమించలేను గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం అంటుంది.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 25వ తేదీ ఎపిసోడ్ 445 లో ఏం జరిగిందంటే..

గార్డెనింగ్ చేస్తున్న కావ్యని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రాజ్. తననే చూస్తున్నాడు అని కావ్య గ్రహిస్తుంది కానీ ఏం చేస్తున్నారు అంటూ భర్తని ఆట పట్టిస్తుంది. ప్రకృతిని చూస్తున్నాను అంటాడు రాజ్. కాదు నేను మీరు నా నడుముని చూస్తున్నారు అంటూ భర్తతో గొడవ పడుతున్నట్లుగా నటించి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య.దీనికి నేను సైట్ కొడుతున్నట్లు తెలియజేయాలి ఎలాగా అనుకుంటాడు రాజ్.

Brahmamudi serial 25th June 2025 Episode of 445 Here is full story

మరోవైపు బయటకి వెళ్తున్న అప్పుని నీ గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు బయటికి వెళ్లొద్దు అంటుంది కనకం. ఎవరో ఏదో అనుకుంటున్నారని అన్ని మానేసి మూలన కూర్చోమంటావా అంటుంది అప్పు. నా బాధ అర్థం చేసుకో, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, నువ్వు ఏమైనా చేయాలనుకుంటే అక్కడికి వెళ్లి చెయ్యు అంటుంది కనకం.

ఇక్కడ తల్లిదండ్రులే నా పని నన్ను చేసుకోనివ్వడం లేదు ఇంక అక్కడ వాడు నన్ను చేసుకోనిస్తాడా అంటుంది అప్పు. అది అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేం అని భర్తతో చెప్తుంది కనకం. నీ మాటల్లో అర్థం ఉంది, దాని మాటల్లో న్యాయం ఉంది నేను ఏం మాట్లాడాలి అంటాడు కృష్ణమూర్తి. అమ్మ.. నేను ఎగ్జామ్ కి వెళ్ళాలి నా మనసు పాడు చేయొద్దు అని చెప్పి బంటిని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు.

Brahmamudi serial 25th June 2025 Episode of 445 Here is full story

మరోవైపు ఇంట్లోకి వస్తున్న రాజ్ తో ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది ఇందిరా దేవి. నేనేం చేశాను అని అమాయకంగా అడుగుతాడు రాజ్.నువ్వు గార్డెన్లో వేసిన వేదవ వేషాలు అన్నీ చూసాను అంటుంది ఇందిరా దేవి. అప్పుడు భార్యకి తన మీద ఉన్న ప్రేమని, ఈ ఇంటి కోసం చేసిన త్యాగాన్ని ఇందిరా దేవితో చెప్తాడు రాజ్. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఊరికే ఉంటావేం, నీ మనసులో మాట తనకి చెప్పు అంటుంది ఇందిరా దేవి.

అదేమైనా నువ్వు ఇంట్లో ఆర్డర్స్ పాస్ చేయడం అనుకుంటున్నావా, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటానికి కావ్య మనసు ప్రశాంతంగా ఉండాలి, చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలించాలి అలాంటి సమయం రాగానే చెప్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ . అలాంటి సందర్భం నేను క్రియేట్ చేస్తాను అనుకుంటుంది ఇందిరాదేవి. మరోవైపు ఆటోలో వెళ్తున్న అప్పు కి ఎదురుగా తెచ్చి కారు ఆపుతుంది అనామిక.

Brahmamudi serial 25th June 2025 Episode of 445 Here is full story

ఆటో దిగిన అప్పుతో మీరు హోటల్ కి వేరే పని మీద వెళ్తే మిమ్మల్ని గదిలో బంధించి మీడియా ముందు సీన్ క్రియేట్ చేసింది ఎవరో ఇప్పటికైనా తెలిసిందా ఇకమీదటైనా నువ్వు నా భర్త జోలికి రాకుండా ఉండు అని హెచ్చరిస్తుంది అనామిక. నువ్వే నీ భర్తని నా దగ్గరికి రాకుండా చూసుకో, ఇన్ని ముదనష్టపు పనులు చేసిన నిన్ను నేను ఏమైనా చేయగలను కానీ నా ఫ్రెండ్ జీవితం పాడైపోతుందని ఊరుకుంటున్నాను. ఎప్పటికైనా నువ్వు మారతావని వాడి జీవితం ప్రశాంతంగా ఉంటుందని ఆశపడుతున్నాను అంతేగాని చేతకాక కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు.

ఇప్పుడు అప్పుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను కాబట్టి ఇది కళ్యాణ్ జోలికి రాదు,ఇక కళ్యాణ్ ని దారిలోకి తెచ్చుకొని ఆస్తిని రాబట్టు కావడం పెద్ద పని కాదు అనుకుంటుంది అనామిక. మరోవైపు ఇందిరా దేవి రాజ్ కావ్య లకి తెలియకుండా వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అదేదో వాళ్ళకి చెప్పే చేయొచ్చు కదా అంటుంది అపర్ణ. తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు అని కావ్య, మరేదో కారణం చెప్పి రాజ్ తప్పించుకుంటారు అంటుంది. శోభనానికి ఏర్పాట్లు చేయడంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క బాధ్యత తీసుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X