Brahmamudi 26th June episode: పూల పక్కా.. నేను నీ పక్కన.. రాజ్‌తో కావ్య రొమాన్స్!

కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చి అప్పుని లాక్కుపోతుంది కనకం. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది, మమ్మల్ని కావాలనే ఎవరో ఇరికించారు ఆ నిజమేమిటో తెలుస్తాను అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత కావ్య దంపతులు అసలు మాయని తీసుకువచ్చి ఇంట్లో నిజం చెప్పిస్తారు. మరోవైపు అపర్ణ భర్తతో మాట్లాడుతూ జీవితంలో మిమ్మల్ని క్షమించలేను గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం అంటుంది. మరోవైపు రాజ్ తన మనసులో మాటని భార్య ముందు చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 26వ తేదీ ఎపిసోడ్ 446 లో ఏం జరిగిందంటే..

రాజ్ దంపతుల శోభనం ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇందిరాదేవి వాళ్ళు. ప్రకాష్ కి ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్తుంది ఇందిరా దేవి. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య ఏంటి అందరూ రెడీ అంటున్నారు, ఫ్రూట్స్ ఎందుకు తీసుకు రమ్మంటున్నారు అని అడుగుతుంది. అందరూ ఒకసారి గా తడబడతారు. వెంటనే అపర్ణ తేరుకొని నేను పేషెంట్ ని కదా నాకోసమే ఫ్రూట్స్ తీసుకు రమ్మన్నాను అయినా నీకు వేరే పని లేదా, అన్ని విషయాలు నీకే కావాలా అని కావ్య ని కసిరి పంపించేస్తుంది. అక్కడున్న ఉన్నవాళ్లు నవ్వుతూ ఉంటే వాళ్ల ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది కావ్య.

Brahmamudi serial 26th June 2026 Episode of 446 Here is full story

మరోవైపు ఆ కావ్య వాళ్ళని విడదీసేస్తాను, అది చేసేస్తాను ఇది చేసేస్తాను అన్నావు ఇప్పుడు సంవత్సరం తర్వాత అందరూ కలిసి వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత వాళ్లు ఒక వారసుడిని దించుతారు వాళ్ళకి కూడా మనం సేవలు చేస్తూ కూర్చుందాం అని తల్లితో చెప్తూ ప్రస్టేట్ అవుతాడు రాహుల్. నేనుండగా అలా ఎలా జరగనిస్తాను, వాళ్లని సజావుగా కాపురం ఎలా చేసుకోస్తాను అంటుంది రుద్రాణి. ఏం చేస్తావ్ మమ్మీ, ఇప్పుడు మన జుట్టు ఆ కావ్య చేతిలో ఉంది.

Brahmamudi serial 26th June 2026 Episode of 446 Here is full story

ఏం చేసినా మన ఆధారాలు బయట పెట్టేస్తానంటుంది ఎలా అంటాడు రాహుల్. మనం నేరుగా చేస్తే దొరికిపోతాం అందుకే వేరే వాళ్ళ ద్వారా చేయిద్దాం అంటుంది రుద్రాణి. ఎవరితో అంటాడు రాహుల్. ఇంకెవరు కళ్యాణ్, ఉన్నాడు కదా అమాయకుడు వాడితోనే చేయిద్దాం అంటుంది రుద్రాణి. మరోవైపు స్వప్న ప్రకాష్ తీసుకురావాల్సిన వస్తువుల లిస్ట్ చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ ఇప్పుడు ఎందుకు అన్ని ఫ్రూట్స్, స్వీట్స్ తెప్పిస్తున్నారు ఏమిటి విశేషం అని అడుగుతాడు.

నేను మర్చిపోయాను అని చెప్పి తప్పించుకుంటాడు ప్రకాష్. స్వప్న కూడా ప్రకాష్ అంకుల్తో మాట్లాడి, మాట్లాడి నేను కూడా మర్చిపోయాను అని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ ప్రకాశం నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా పూజకి టైం అవుతుంది వెళ్లి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుని రా అని చెప్పి స్వప్నని పని ఉంది నాతోరా అని చెప్పి తనతో తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్యపోతాడు రాజ్. మరోవైపు భర్తకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది అనామిక.

మీ అన్నయ్య వదిన కూడా ఒకటి అయిపోతున్నారు, మనం కూడా కలిసి ఉందాము అంటుంది. నువ్వు నా మనసు ముక్కలు చేసేసావు, లేనిపోని అపార్థాలతో నన్ను అందరి ముందు చేతకాని వాడిగా నిరూపించావు. మా వదిన గురించి మాట్లాడుతున్నావు సంవత్సరం తర్వాత వాళ్లు ఈరోజు ఒకటవుతున్నారు అంటే అందుకోసం మా వదిన ఎంత త్యాగం చేసిందో నీకు తెలుసు కదా, ఆమెను చూసి అసూయ పడకుండా ఆమెలా ఆలోచించు చాలు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Brahmamudi serial 26th June 2026 Episode of 446 Here is full story

అప్పుడే ఒక రిపోర్టర్ ఫోన్ చేసి మీరు హోటల్లో మీడియాకి దొరకటానికి కారణం ఎవరో ఆధారాలతో సహా చెప్తాను , నన్ను కలవండి అంటుంది. ఎక్కడికి రావాలి అని కళ్యాణ్ అంటే లొకేషన్ షేర్ చేశాను అక్కడికి వచ్చేయండి అని చెప్తుంది. మరోవైపు రాజ్ చార్జర్ మర్చిపోయానని సీతారామయ్య గదిలోకి వెళ్ళబోతాడు. అక్కడే ఉన్న తండ్రి యేవో కారణాలు చెప్పి అక్కడినుంచి పంపించేస్తాడు.

కావ్య కూడా డైపర్స్ కోసం గదిలోకి వెళ్ళబోతే ఇందిరా దేవి అడ్డుకొని యేవో కారణాలు చెప్పి అక్కడ నుంచి తరిమేస్తుంది. ఏం జరుగుతుందో తెలియక అయోమయం పడతారు రాజ్ దంపతులు. తర్వాత తన గదిలోకి వెళ్లిన రాజ్ కి అక్కడ ఇందిరా దేవి దంపతులు కనిపించడంతో నేను పొరపాటున మీ గదిలోకి వచ్చేసానా అంటాడు. లేదు మేమే నీ గదిలో ఉన్నాము మా గదిలో ఏసీ పనిచేయడం లేదు అందుకే ఈరోజు ఇక్కడ పడుకుంటాం అంటుంది ఇందిరా దేవి. నేనెక్కడ పడుకోవాలి అంటాడు రాజ్. వెళ్లి మా గది లో పడుకోండి అంటారు సీతారామయ్య దంపతులు.

Brahmamudi serial 26th June 2026 Episode of 446 Here is full story

తరువాయి భాగంలో డెకరేషన్ చేసి ఉన్న రూమ్ ని చూసి షాక్ అవుతారు రాజ్ దంపతులు. ఏర్పాట్లు బాగానే చేయించారు, ఇప్పుడు మీకు ఏం కావాలి అనిభర్తని అడుగుతుంది కావ్య. నువ్వే కావాలి అంటూ ఆమెకి దగ్గరగా వస్తాడు రాజ్ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X