Brahmamudi 27th June episode: నాన్నమ్మకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికి రాజ్.. క్యావ గురించి క్లాస్ పీకుతూ!

మమ్మల్ని కావాలనే ఎవరో ఈ ట్రాప్ లో ఇరికించారు, ఆ నిజమేమిటో తేలుస్తాను అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత కావ్య దంపతులు అసలు మాయని తీసుకువచ్చి ఇంట్లో నిజం చెప్పిస్తారు. మరోవైపు అపర్ణ భర్తతో మాట్లాడుతూ జీవితంలో మిమ్మల్ని క్షమించలేను గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం అంటుంది. మరోవైపు రాజ్ తన మనసులో మాటని భార్య ముందు చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. అది గ్రహించిన ఇందిరాదేవి కుటుంబ సభ్యుల సహకారంతో రాజ్ దంపతులకు తెలియకుండా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 27వ తేదీ ఎపిసోడ్ 447 లో ఏం జరిగిందంటే..

ఇక మీ ఇద్దరూ ఇక్కడినుంచి వెళ్తే మీ తాతయ్య పడుకుంటారు అని ఇందిరా దేవి అనటంతో గదిలో నుంచి బయటికి వచ్చేస్తారు రాజ్ దంపతులు.బయటికి వచ్చిన తర్వాత రాజ్ పొద్దున్నుంచి ఇంట్లో వాళ్ళు తేడాగా ప్రవర్తిస్తున్నారు అంటాడు. మీక్కూడా అలా అనిపించిందా నాకు కూడా అలాగే అనిపించింది అంటుంది కావ్య. వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్లడం చూసి కుటుంబ సభ్యులందరూ ఆనందపడితే రుద్రాణి మాత్రం నేను వెలిగించిన అగ్గిపుల్ల ఇంకా రాజుకోలేదేంటా అని ఆలోచనలో పడుతుంది.

Brahmamudi serial 27th June 2024 Episode of 447 Here is full story

కావ్య వాళ్ళు సీతారామయ్య గదిలోకి ప్రవేశించే సరికి గదంతా చీకటిగా ఉంటుంది, లైట్ వేసి చూసేసరికి రూమ్ అంతా డెకరేషన్ చేసి ఉండడం చూసి సర్ప్రైస్ అవుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తనకి కారణం ఇదా అని అనుకుంటారు. ఇదంతా మీరే చేయించారు అని కావ్య అంటుంది, ఇదంతా ఇంట్లో వాళ్ళతో కలిసి నువ్వే చేయించావు అని రాజ్ అంటాడు.

ఇద్దరూ గొడవపడుతుండడం చూసి రాజ్ అంతరాత్మ ఎవరు చేస్తే ఏంటి నీకు కావాల్సింది దొరుకుతుంది కదా, ఈరోజు ఎలా అయినా తనతో మాట్లాడతాను అన్నావు కదా అని రాజ్ ని ఎంకరేజ్ చేస్తాడు. కావ్య కూడా అప్పుడే కాంప్రమైజ్ అయ్యి రాజ్ దగ్గరికి వచ్చి ఏం కావాలి అది అడుగుతుంది నువ్వే కావాలి, నీతో మాట్లాడాలి అంటాడు రాజ్. వాళ్ళిద్దరూ అలా క్లోజ్ గా ఉండడాన్ని చూసి రాజ్ అంతరాత్మ ఆనందపడుతుంది. ఇంతలోనే బయట ఏదో శబ్దం రావటంతో బయటికి వెళ్ళిపోతారు రాజ్ దంపతులు. అరేంజ్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయని బాధపడుతుంది రాజ్ అంతరాత్మ. అయితే బయట కళ్యాణ్ అనామికని అరుస్తూ పిలుస్తాడు. ఏం జరిగిందని అందరూ వస్తారు. అక్కడికి వచ్చిన అనామిక ఏం జరిగింది అని అడుగుతుంది.

ఆమె ముఖం మీద పేపర్స్ విసురుతాడు కళ్యాణ్. ఏంటవి అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. డైవర్స్ పేపర్స్, భార్య అనే ఈ రాక్షసి నుంచి నేను విడాకులు కోరుకుంటున్నాను అంటాడు కళ్యాణ్.మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలు వస్తే చక్కదిద్దడానికి మేము ఉన్నాం కదా అంటాడు ప్రకాష్. లేదు నాన్న ఇది ఏం చేసిందో తెలుసా అంటూ హోటల్ గదిలో జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్. ఇదంతా నేను చేయలేదు అని బుకాయిస్తుంది అనామిక.

హోటల్ లో సీసీ ఫుటేజ్ ని అందరికీ చూపిస్తాడు కళ్యాణ్. దానికి నాకు ఏమి సంబంధం లేదు అంటుంది అనామిక. అప్పుడు సీసీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి అతని చేతే సాక్ష్యం చెప్పిస్తాడు. రేపు కోర్టులో కూడా నువ్వు ఇదే విషయం చెప్పాలి అంటాడు కళ్యాణ్. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే నిజం చెప్తాను అంటాడు ఆ వ్యక్తి. అతడిని పంపించేసిన తర్వాత ఇప్పుడేమంటావు అని అనామికని అడుగుతాడు కళ్యాణ్.

అవును ఇదంతా నేనే చేశాను అయితే ఇప్పుడేంటి, నేను నీకు భార్యగా పనికిరానా, నా మొహం చూడటానికి కూడా నువ్వు ఇష్టపడవా, ఇప్పుడు మీ ఇద్దరు ఎలా రోడ్డుమీద తిరుగుతారో నేను చూస్తాను అంటుంది అనామిక. ఆమె చంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి నా కొడుకుని కూడా కాదని నిన్ను సపోర్ట్ చేశాను, నా కొడుకుతో నువ్వు రోజూ గొడవ పడుతూ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా సర్దుకుంటారు అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావ్ అనుకోలేదు అంటూ అనామిక కి చివాట్లు పెడుతుంది

తరువాయి భాగంలో ఈ ఇంట్లో గొడవలు వల్ల మీ ఆరోగ్యం ఏమైపోతుందో అని భయంగా ఉంది అందుకే ఈరోజు నుంచి అంటూ అపర్ణతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్. అంతలోనే అనామిక మాట్లాడుతూ మీరు ఆ అప్పు తో కలిసి తిరుగుతాను అంటారు అంతేనా అంటుంది. కోపంతో ఆమెపై చెయ్యతాడు కళ్యాణ్. నీ స్థానంలో నా చెల్లెలు ఉంటే చెంప పగలగొట్టే దాన్ని అంటుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X