Brahmamudi 28th June episode: అనామికను కొట్టబోయిన కల్యాణ్.. చెంప పగలకొడుతానన్న కావ్య

కావ్య దంపతులు అసలు మాయని తీసుకువచ్చి ఇంట్లో నిజం చెప్పిస్తారు. మరోవైపు అపర్ణ భర్తతో మాట్లాడుతూ జీవితంలో మిమ్మల్ని క్షమించలేను గది బయట మాత్రమే మనం భార్యాభర్తలం అంటుంది. మరోవైపు రాజ్ తన మనసులో మాటని భార్య ముందు చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. అది గ్రహించిన ఇందిరాదేవి కుటుంబ సభ్యుల సహకారంతో రాజ్ దంపతులకు తెలియకుండా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ వేడుక జరగకూడదని రుద్రాణి కుట్ర పన్నుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 28వ తేదీ ఎపిసోడ్ 448 లో ఏం జరిగిందంటే..

ఈ ఇంట్లో నువ్వు తక్కువ కాకూడదని నువ్వు ఎన్ని తప్పులు చేసినా సపోర్ట్ చేస్తూ వచ్చాను, అలాంటిది ఈరోజు నువ్వు నా కొడుకుని అందరి ముందు దోషిని చేసి నిలబెట్టావు, మరో భర్త అయితే నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి తరిమేసేవాడు కానీ నా కొడుకు దుగ్గిరాల వారసుడు అందుకే నిన్ను శిక్షించకుండా వదిలేశాడు. కానీ నేను మాత్రం నిన్ను జీవితంలో క్షమించను అంటుంది ధాన్యలక్ష్మి.

Brahmamudi serial 28th June 2024 Episode of 448 Here is full story

మీరు ఏమీ అనకండి నాకు, కావ్యకు ఈ అనామికను అప్పగించండి నా చెల్లెల్ని ఇంత అవమానానికి గురి చేసినందుకు కొట్టిన చోటు కొట్టకుండా కొడతాం అంటూ అనామిక పై చెయ్యి ఎత్తుతుంది స్వప్న. అప్పుడు కావ్య స్వప్న ని వారించి అప్పు కి అన్యాయం జరిగింది నిజమే కానీ ఇప్పుడు మనం ఏమైనా అంటే కవి గారి కాపురం పాడవుతుంది అని నచ్చ చెప్తుంది కావ్య. అందరం ఆవేశం మీద ఉన్నాము, ఇంక నువ్వు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా నీ గదికి వెళ్ళిపో అంటాడు సుభాష్.

ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయిన తరువాత ఇంతమంది మంచి మనుషుల మధ్య అలాంటి ఆడది ఉండకూడదు అందుకే నేను తనకి విడాకులు ఇస్తాను అంటాడు కళ్యాణ్. నెక్స్ట్ సీన్ లో రాజ్ దంపతులు మాట్లాడుకుంటూ కళ్యాణ్ దంపతులను ఎలాగైనా కలపాలి అనుకుంటారు. మరుసటి రోజు ప్రొద్దున్న ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న అనామికని రెచ్చగొట్టాలని చూస్తుంది రుద్రాణి. అంతలోనే అక్కడికి రాజ్ వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ పోతూ ఉంటాయి.

Brahmamudi serial 28th June 2024 Episode of 448 Here is full story

అవి సూర్యాస్తమయం లాగా అంతరించిపోవాలి కానీ సూర్యోదయం లాగా మళ్లీ చిగురించకూడదు. మీరిద్దరూ కలిసి ఉంటేనే ఇంట్లో వాళ్ళందరికీ ఆనందం, నీ భర్త పరాయి ఆడదానితో మాట్లాడితే నీకు పొసెసివ్నెస్ ఉంటుంది కాదనను కానీ అది మాట్లాడుకుంటే పోయే సమస్య,దానిని ఇంత పెద్దది చేయక్కర్లేదు అందుకే నా మాట విని ఒక్కసారి కళ్యాణ్ తో మనసు విప్పి మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్లిపోవడం చూసిన రుద్రాణి అనామిక దగ్గరికి వస్తుంది. అప్పుడు అనామిక రుద్రాణితో మాట్లాడుతూ ఇప్పుడు నేను కళ్యాణ్ తో మాట్లాడినా అతను వింటాడనే నమ్మకం లేదు అంటుంది. అందుకే మీ అమ్మగారు వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టు.

అప్పుడు పెద్ద వాళ్ళు అందరూ ఆలోచించుకొని మిమ్మల్ని కలుపుతారు అంటుంది రుద్రాణి. ఇప్పుడే అమ్మ వాళ్ళని పిలుస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఇంత చదువుకున్నావు, అయినా ఎలా నా మాటలకి మళ్లీ మళ్లీ మోసపోతావు అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు కళ్యాణ్ తన గదిలో చీకట్లో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి ధైర్యం చెబుతుంది కావ్య. మీరు ఎందుకు అనామికకి నచ్చినట్లుగా ఉండాలనుకోవడం లేదు అంటుంది. ప్రయత్నించాను వదిన కానీ నన్ను నా ప్రేమని చులకన చేసింది. తను డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది.

ఎప్పుడైతే ఆఫీసు వ్యవహారాలు చూసుకోను అని చెప్పానో అప్పుడు ఇలా నన్ను అందరిలోనూ చులకన చేయడానికి ప్రయత్నించింది దానివలన నా ఫ్రెండ్ జీవితం మీద మచ్చ పడింది అంటాడు కళ్యాణ్. అలా అని బంధాలని వదిలేసుకుంటారా ఒక అడుగు కిందికి దిగి వెలుగు వైపు అడుగు వేయండి, అనామిక తో మాట్లాడండి అని చెప్పి బలవంతంగా తనతో పాటు కళ్యాణ్ ని కిందికి తీసుకువస్తుంది కావ్య.

Brahmamudi serial 28th June 2024 Episode of 448 Here is full story

హాల్లో అందరూ ఉంటారు. కిందికి వచ్చిన కళ్యాణ్ ఈ గొడవల వల్ల మీ ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందో అని భయంగా ఉంది పెద్దమ్మ అని అపర్ణతో అంటాడు. ఈ గొడవలు జరగకుండా ఉండాలి అంటే అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా నాకు విడాకులు ఇవ్వాలి అంతే కదా అంటుంది అనామిక. కోపంగా ఆమెపై చెయ్యెత్తుతాడు కళ్యాణ్.

మరోవైపు తనకి సర్ది చెప్పాలని చూసిన మామగారిని చులకనగా మాట్లాడుతుంది అనామిక. ఆ మాటలకి ప్రకాష్ బాధపడతాడు. తప్పంతా నువ్వే చేసి అందరి మీద ఎందుకు కేకలు వేస్తావు నీ భర్తని, నీ మామని, కావ్యని అందరినీ బాధ పెట్టావు ఇంత దిగజారుడుతనం అవసరమా అంటుంది అపర్ణ. దిగజారుడుతనం గురించి మీరే మాట్లాడాలి అని చులకనగా అంటుంది అనామిక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X