Brahmamudi 29th June episode: పరాయి మగాడితో బలాదూర్‌గా.. కావ్యను నిలదీసిన అనామిక
మరోవైపు రాజ్ తన మనసులో మాటని భార్య ముందు చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. అది గ్రహించిన ఇందిరాదేవి కుటుంబ సభ్యుల సహకారంతో రాజ్ దంపతులకు తెలియకుండా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ వేడుక జరగకూడదని రుద్రాణి కుట్ర పన్నుతుంది. హోటల్లో జరిగిందానికి కారణం అనామిక అని ఇంట్లో నిరూపించి ఆమెకి విడాకులు ఇస్తానంటాడు కళ్యాణ్. వాళ్లని కలిపే ప్రయత్నం చేస్తారు రాజ్ దంపతులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 29వ తేదీ ఎపిసోడ్ 449 లో ఏం జరిగిందంటే..
ఈ గొడవల వల్ల మీ ఆరోగ్యం ఏమయిపోతుందో పెద్దమ్మ ఇంట్లో ఇకమీదట గొడవలు జరగకూడదంటే అంటూ కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ ఉండగానే అనామిక మాట్లాడుతూ నాకు విడాకులు ఇచ్చేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అదే కదా నువ్వు ఆనాలనుకున్నది అంటుంది. కోపం తో ఆమెపై చెయ్యెత్తుతాడు కళ్యాణ్. అదే నా చెల్లెలు అయ్యుంటే మొహం పగలగొట్టే దాన్ని అని అనామిక ని అంటుంది కావ్య.

అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక తల్లిదండ్రులు కొట్టు బాబు ఆపేసావేమి అంటారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఇదీ ఈ ఇంట్లో మీ కూతురు వెలగబెడుతున్న కాపురం అని బాధగా చెబుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాం కానీ ఇలా పిల్లని కొట్టి చంపేస్తారు అనుకోలేదు అంటాడు అనామిక తండ్రి. ఇక్కడ నీ కూతురు ఎంత రుద్రతాండవం చేస్తుందో తెలుసా, అసలు దుగ్గిరాల ఇంటిపేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అంటాడు రాజ్.

ఎంతైనా వాళ్ళు ఇంటికి పిల్లనిచ్చిన వాళ్ళు వాళ్లతో అలా మాట్లాడకూడదు అంటాడు సీతారామయ్య. పిల్లనిచ్చిన వాళ్ళు పిలిస్తే రావాలి కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు, అయినా అనామిక యే వాళ్ళని పిలిచి ఉంటుంది అంటుంది స్వప్న. అవును నేనే పిలిచాను కళ్యాణ్ విడాకులు ఇస్తాను అంటున్నాడు కదా అందుకే నేనే పిలిచాను అంటుంది అనామిక. ఎందుకు ఇస్తానన్నాడో నీకు తెలియదా అంటాడు ప్రకాష్. మీకు మతిమరుపు అని అందరూ మీలాగే బుర్ర తక్కువ వాళ్ళు ఉంటారా అంటుంది అనామిక.

ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరికీ కోపం వస్తుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకో అంటుంది ధాన్యలక్ష్మి. అందరూ మా పిల్లదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి? కళ్యాణ్ అప్పు తో తిరిగినప్పుడు మీరందరూ ఏమయ్యారు అంటాడు అనామిక తండ్రి. కళ్యాణ్ కోప్పడుతూ ఇప్పుడు అర్థమైంది మీ అమ్మాయి ఎందుకు ఇలా తయారయ్యిందో, మీకే సంస్కారం లేదు ఇంకా తను ఎలా సంస్కారవంతంగా ఉంటుంది అంటాడు. రాజ్ కూడా అనామిక ని మందలిస్తాడు.
మీకేమీ, కంపెనీకి ఎండిగా ఉండి పెత్తనం వెలగబడుతున్నారు, ఏ పనీ చేయని మా ఆయనతో నేను సర్దుకుపోవాలా,అసలు మీరే మా ఆయనని చేతకాని వాడిలాగా చేసేసారు అంటుంది అనామిక. నా భర్తని అంటే బాగోదు అని కేకలు వేస్తుంది కావ్య. ఇంత దిగజారి మాట్లాడటం అవసరమా అంటుంది అపర్ణ. ఆమెను కూడా అవమానించేలాగా మాట్లాడుకుంది అనామిక. కోపంతో రగిలిపోయిన కళ్యాణ్ అనామికని తీసుకొని ఆమె తల్లిదండ్రులను ఇంట్లోంచి బయటికి పొమ్మంటాడు.

వెళ్తాను, కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు, నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్లు పట్టుకొనేలాగ చేస్తాను అని చెప్పి తల్లిదండ్రులతోపాటు వెళ్ళిపోతుంది అనామిక. మరోవైపు దిగులుగా కూర్చున్న ధాన్యలక్ష్మి ని ఓదార్చాలి అనుకుంటుంది కావ్య. అసలు ఇదంతా నీ వల్ల, నీ చెల్లెలు వల్లే జరిగింది అని కావ్య మీద కోప్పడుతుంది ధాన్యలక్ష్మి. నీ కోడలు పెద్ద, చిన్న తెలియకుండా మాట్లాడి వెళ్ళిపోతే అందుకు నా కోడలు కారణమా..
నిజంగా నీ కోడలికి కాపురం చేయాలని ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా తను నా కోడలిలాగా ఈ ఇంట్లోనే ఉండేది అంటూ కావ్యని వెనకేసుకొస్తుంది అపర్ణ. నా కోడలి గురించి మరొకసారి ఇలా మాట్లాడొద్దు అని ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత పెద్ద వాళ్ళకి మర్యాద ఇవ్వడం మంచిదే కానీ అందుకోసం నీ ఆత్మ అభిమానం చంపుకో అక్కర్లేదు అని కోడల్ని కూడా మందలిస్తుంది అపర్ణ. మరోవైపు తన భర్త అప్పుతో కలిసి తిరుగుతూ తనకి అన్యాయం చేస్తున్నాడని టీవీ లో రచ్చబండ పెడుతుంది అనామిక.
తరువాయ భాగంలో కళ్యాణ్ కి అనామిక తో విడాకులు ఇప్పించడమే మంచిదని నిర్ణయించుకున్నాను అంటాడు రాజ్. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి కళ్యాణ్ ని అరెస్టు చేస్తున్నాము అని చెప్తారు. ఎందుకు అని అడుగుతాడు రాజ్, విడాకులు ఇస్తానని కళ్యాణ్ బెదిరిస్తున్నాడంట ఆమె కేసు పెట్టింది అంటాడు పోలీస్.


Click it and Unblock the Notifications











