Brahmamudi June 3rd episode: మాయ కి సపోర్ట్ చేస్తున్న అపర్ణ.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి ఏం చేయబోతుంది?

కావ్య కి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ అపర్ణకి వార్నింగ్ ఇస్తుంది ఇందిరా దేవి. రాజ్ తో మాయ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదని రాసిస్తుంది కావ్య. కావ్య చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ ఆమెను మందలిస్తారు. రాజ్ గదిలోకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తుంది మాయ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 3వ తేదీ ఎపిసోడ్ 426 లో ఏం జరిగిందంటే..

కావ్య ని తప్పు పడుతున్న అనామికతో తనే మన పెళ్లికి సపోర్ట్ చేసింది మర్చిపోయావా అంటాడు కళ్యాణ్. తను చెప్పినట్టు వింటానని నాకు సపోర్ట్ చేసింది ఎప్పుడైతే తనకి అడ్డం తిరిగానో అప్పుడు అప్పు ని మన ఇద్దరి మధ్యలోకి పంపించి గొడవలు సృష్టించింది, తన సంగతి నాకు తెలియదా.. నేనే గాని కావ్య ప్లేస్ లో ఉండి ఉంటే ఎప్పుడో ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయి ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి లాగేదాన్ని అంటుంది. నీకు అంతే తెలుసు, ఒక బంధాన్ని విడగొట్టుకోవటం చాలా తేలిక కానీ అదే బంధాన్ని నిలుపుకోవటం చాలా కష్టం.

Brahmamudi serial 2nd June 2024

చిన్న చిన్న విషయాలకే గొడవలు చేసి విడాకుల వరకు వెళ్లిపోతున్న ఈ రోజుల్లో మా వదిన లాంటి కోడలు ఈ ఇంటికి రావడం అదృష్టం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు రాజ్ గదిలోకి వెళ్ళిపోవాలనుకున్న మాయకి ఆశా భంగం కలగడంతో చిరాకు పడిపోతూ ఉంటుంది. పెళ్లి చేసుకున్న భార్య కి రాజ్ గదిలోకి వెళ్ళటానికి ఆరు నెలలు పట్టింది, నీకు ఇంకా నయమే వచ్చిన రెండో రోజే నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు, పెళ్లి జరిగే వరకు ఓపిక పట్టు అంటుంది రుద్రాణి.

అప్పుడే అక్కడికి బాబును తీసుకొని వచ్చిన కావ్య పెళ్లి జరుగుతుందని చాలా ఆనంద పడుతున్నట్లు ఉన్నారు కానీ నేను జరగనివ్వను అని రుద్రాణి తో సవాలు చేస్తుంది. బాబుని మాయకి ఇవ్వబోతుంటే రాత్రంతా నన్ను పడుకొనివ్వలేదు నాకు వద్దు అని చిరాకు పడుతుంది మాయ. భార్యగా హక్కులు కోరుకుంటున్నావు కానీ బిడ్డ బాధ్యతలు అక్కర్లేదా అంటూ బిడ్డని ఆమె చేతిలో పెట్టి తల్లిగా నటించడం కాదు ముందు తల్లిగా మారు అని మందలించి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi serial 2nd June 2024 Episode of 426 Here is full story

ఆ తర్వాత అపర్ణ రాజ్ మాయల పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. అతను రెండు రోజుల్లో ముహూర్తం ఉంది అని చెప్తాడు. అదంతా చూసిన సుభాష్ నిజం చెప్పేస్తాను అంటాడు. పెళ్లి ముహూర్తం వరకే వచ్చింది ఇంకా పెళ్లి జరగలేదు కదా మీరు నిజం చెప్పొద్దు అని రాజ్, కావ్య ఇద్దరూ సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపుతారు. ఆ తర్వాత రాజ్ తన గదిలో కావ్య పై కోప్పడతాడు.

మాయ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఇప్పుడు దానితో నాకు పెళ్లి అంటున్నారు అంటూ ఫ్రెస్టేట్ అవుతాడు. మీరే నోరు మూసుకొని ఊరుకోమన్నారు కదా అందుకే నేను ఏ ప్రయత్నం చేయకుండా ఉన్నాను అంటుంది కావ్య. అంటే ఈ పెళ్లి జరిగినా కూడా చూస్తూ ఊరుకుంటావా అంటాడు రాజ్. పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తానని కానీ చెయ్యను అని కానీ చెప్పకుండా వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi serial 2nd June 2024 Episode of 426 Here is full story

ఇప్పుడు ఇది నాకు హెల్ప్ చేస్తానందా, చేయనందా అని కన్ఫ్యూజ్ అవుతాడు రాజ్. మరోవైపు అప్పు కావ్య కి ఫోన్ చేసి బయలుదేరావా అని అడుగుతుంది. నువ్వు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే గ్యాదర్ చేసావా, నిజంగా ఆ మాయ ఈరోజు వస్తుందా అని అడుగుతుంది కావ్య. ముందే భయపడటం ఎందుకు నేను పక్కాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నువ్వు రా అంటుంది అప్పు.

సరే అని బయలుదేరుతుంది కావ్య. ఈ మాటలు అన్నీ రుద్రాణి వింటుంది. నువ్వు అసలైన మాయని వెతకడానికి వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ కావ్యని ఫాలో అవుతుంది రుద్రాణి. మరోవైపు బాబుని ఆడించలేక సతమతమవుతుంది మాయ. అసలు నువ్వు తల్లివేనా బాబుని సముదాయించలేకపోతున్నావు అంటారు చిట్టి, ధాన్యలక్ష్మి, అపర్ణ. రాజ్ బిడ్డను తెచ్చి కావ్య చేతిలో పెట్టాడు.

Brahmamudi serial 2nd June 2024 Episode of 426 Here is full story

ఇప్పుడు వాడు నా స్పర్శని కూడా మర్చిపోయాడు వాడిని సముదాయించడానికి కావ్య కూడా ఇప్పుడు లేదు అంటుంది మాయ. ఆ బిడ్డకి కావ్యని ఆయా ని చేయకు, వెళ్లి వాడికి స్నానం చేయించి పాలు పట్టి పడుకోబెట్టు అని చెప్తుంది చిట్టి. మాయా బాబుని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత తను చెప్పింది కరెక్టే కదా అత్తయ్య రాజ్ చేసిన పని వల్ల బిడ్డ తల్లి స్పర్శని మరిచిపోయాడు త్వరలోనే తల్లికి చేరువవుతాడు అంటూ మాయని వెనకేసుకొస్తుంది అపర్ణ.

తరువాయి భాగంలో మాయ ఇంటికి వెళతారు అప్పు, కావ్య. అప్పుడే క్యాంప్ నుంచి వచ్చిన మాయ కావ్య వాళ్ళని చూసి కంగారు పడి వాళ్లకి దొరకకుండా పరిగెడుతుంది. రుద్రాణి అదే అదను గా భావించి కారుతో మాయని గుద్దేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X