Brahmamudi 4th June episode: కారుతో మాయను గుద్దేసిన రుద్రాణి.. బ్రహ్మముడి సీరియల్‌లో ఊహించని ట్విస్ట్!
రాజ్ తో మాయ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదని రాసిస్తుంది కావ్య. కావ్య చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ ఆమెను మందలిస్తారు. రాజ్ గదిలోకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తుంది మాయ. తర్వాత అప్పు, కావ్య ఒరిజినల్ మాయ గురించి మాట్లాడుకోవడం విని కావ్య ని ఫాలో అవుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 4వ తేదీ ఎపిసోడ్ 427 లో ఏం జరిగిందంటే..
సీతారామయ్య దంపతుల దగ్గరికి వచ్చిన స్వప్న లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతుంది. పరాయి దానిలా అలా పర్మిషన్ అడుగుతావేంటి అంటుంది చిట్టి. లోపలికి వచ్చిన స్వప్న కావ్య గురించి మాట్లాడుతుంది. మీరు ఇంటి పెద్దలు అలాంటిది ఈ ఇంటి కోడలికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారేంటి అంటుంది. ఈ ప్రశ్న నువ్వు అపర్ణని అడిగితే సరియైన సమాధానం దొరుకుతుంది అంటుంది చిట్టి. ఆమె నాకు చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు ఆమెతో నేను ముక్కుసూటిగా మాట్లాడలేను.

అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అంటుంది స్వప్న. కావ్యకి అన్యాయం చేయాలని కాదు గాని ఆ బిడ్డకి న్యాయం చేయాలి కదా, ఇప్పుడు ఆ పెళ్లి జరగకపోతే బిడ్డ అనాధ అయిపోతాడు అంటాడు సీతారామయ్య. అంటే కావ్యకి అన్యాయం జరిగినా పర్వాలేదా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. మరోవైపు అప్పు దగ్గరికి వచ్చిన కావ్య పదా కార్లో వెళ్దాం అంటుంది. వద్దు కారు చూసిందంటే ఆ మాయ ఎలర్ట్ అయిపోతుంది నడుచుకునే వెళ్దాం అంటుంది అప్పు.
అప్పుడు కావ్య డ్రైవర్ దగ్గరికి వెళ్లి నీడ చూసుకొని కార్ పార్కింగ్ చెయ్యు అని చెప్తుంది. అప్పుడే రాజ్ తనని ఫాలో అవడం గమనిస్తుంది. వెంటనే అప్పు దగ్గరికి వచ్చి మీ బావ మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్తుంది. అదేమిటి అంటుంది అప్పు. మాయ ని తీసుకు వస్తాను అని చెప్పి ఆయనకు ఒక భార్యని తీసుకువచ్చాను కదా అందుకే మనల్ని ఫాలో అవుతున్నట్లు ఉన్నారు, అందుకే మనం నేరుగా మాయ దగ్గరికి వెళ్లొద్దు అంటూ ముందుకి నడుస్తూ ఉంటారు కావ్య వాళ్ళు.

రాజ్ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు.అటు తిరిగి ఇటు తిరిగి, తిరిగిన దగ్గరే తిరుగుతూ రాజ్ ని ముప్పతిప్పలు పెడతారు కావ్య, అప్పు. వాళ్లు ఎందుకు అలా తిరుగుతున్నారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాడు రాజ్. అయినా వాళ్లనే ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు సీతారామయ్య గది నుంచి బయటికి వస్తున్న స్వప్నకి అనామిక గదిలోంచి ఫోన్ రింగ్టోన్ వినిపిస్తుంది.
అప్పుడే అనామిక మాట్లాడటం కూడా వినిపించి ఆ మాటలు వింటుంది స్వప్న. అనామిక తల్లి అర్జెంటుగా 10 లక్షలు కావాలని లేదంటే తండ్రి సూసైడ్ చేసుకుంటానంటున్నాడని ఫోన్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకు వస్తాను కళ్యాణ్, మా అత్తయ్య నాతో మాట్లాడటం లేదు అని కోప్పడుతుంది అనామిక. ఏదో ఒకటి చెయ్యు, లేదంటే మీ నాన్నని పోలీసులు పట్టుకెళ్ళిపోతారు అంటుంది తల్లి.

సరే ఒక గంటలో అరేంజ్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక.ఆ మాటలు విన్న స్వప్న దీనికి గంటలో 10 లక్షలు ఎలా వస్తాయి అనుకుంటుంది. కళ్యాణ్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ చెక్ మీద సైన్ పెట్టి ఉంచాను మా అమ్మకి చెప్తాను నేను లేకపోయినా ఆ చెక్ తీసుకోండి అన్న మాటలు గుర్తు వస్తాయి అనామికకి. ఆ చెక్ తీసి 10 లక్షలు నెంబర్ వేసి తల్లికి ఫోన్ చేసిన అనామిక 10 లక్షలు రెడీగా ఉన్నాయి, నాన్న తో డ్రైవర్ని పంపించమని చెప్పు అంటుంది.
ఇదంతా చూస్తున్న స్వప్న దీనికి ఈ దొంగ బుద్ధి కూడా ఉందా అనుకుంటుంది. అనామిక కి కనిపించకుండా పక్కన దాక్కుంటుంది. చెక్ తీసుకొని బయటికి వస్తున్న అనామిక కంగారులో చూసుకోకుండా కళ్యాణ్ కి డాష్ ఇస్తుంది. ఎందుకంత కంగారు అంటాడు కళ్యాణ్. ఏమీ లేదు అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది అనామిక. నీ సంగతి చెప్తాను అనుకుంటుంది స్వప్న. మరోవైపు కావ్య, అప్పుని ఫాలో అవుతూనే ఉంటాడు రాజ్.

తరువాయి భాగంలో మాయ ఇంటికి చేరుకున్న కావ్య, అప్పు ఆ ఇంటావిడ తో మాట్లాడుతుండగానే అక్కడికి మాయ వస్తుంది. ఆమె ని నిజాలు చెప్పమని అడుగుతుంది కావ్య. వాళ్లకి దొరక్కుండా పరిగెడుతుంది మాయ. ఆమెని వెంబడిస్తారు కావ్య, అప్పు. పరిగెడుతున్న మాయని వెనకనుంచి కారుతో గుద్దేసి వెళ్ళిపోతుంది రుద్రాణి.


Click it and Unblock the Notifications











