Brahmamudi June 5th episode: అనామికని దోషిగా నిలబెట్టిన స్వప్న.. మాయని చంపేసిన రుద్రాణి?
కావ్య చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ ఆమెను మందలిస్తారు. రాజ్ గదిలోకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తుంది మాయ. తర్వాత అప్పు, కావ్య ఒరిజినల్ మాయ గురించి మాట్లాడుకోవడం విని కావ్య ని ఫాలో అవుతుంది రుద్రాణి. అనామిక ఇంట్లో చెక్ దొంగతనం చేయడం గమనిస్తుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 5వ తేదీ ఎపిసోడ్ 428 లో ఏం జరిగిందంటే..
తమనే ఫాలో అవుతున్న భర్త అవస్థలు చూడలేక పోతుంది కావ్య. అదే విషయం అప్పుకి చెప్పి నువ్వు మాయ ఇంటికి వెళ్ళు నేను కార్లో వచ్చేస్తాను అని చెప్పి అప్పుని పంపించేస్తుంది, తర్వాత భర్త దగ్గరికి వెళ్లి కూరగాయలు కొనడానికి వచ్చాను అని అబద్ధం చెప్తుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమైంది పెళ్లి ఆపేస్తాను అని చెప్పావు కదా ఏం ఊడబొడుస్తావో అని నిన్ను ఫాలో అవుతూ వచ్చాను అంటాడు రాజ్.

ఏం చేయాలో తెలియకే రోడ్ల మీద పడి తిరుగుతున్నాను అంటుంది కావ్య. ఆమె మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు చెక్ పట్టుకొని ఇంటి బయట నిలుచున్న అనామిక దగ్గరికి వచ్చిన స్వప్న ఏదో దాస్తున్నట్లుగా ఉన్నావు ఏంటది అంటూ ఆమె దగ్గర చెక్ లాక్కుంటుంది. ఏమిటిది కళ్యాణ్తో చెప్పే తీసుకున్నావా అని అడుగుతుంది స్వప్న.
అనామిక ఏమి సమాధానం చెప్పకపోవడంతో మా అమ్మని, అప్పుని కావ్యని ఎన్ని మాటలు అన్నావు, ఈరోజు నిన్ను వదిలి పెట్టేది లేదు అంటూ చెక్ చేత్తో పట్టుకొని అనామికని బలవంతంగా ఇంట్లోకి లాక్కు వచ్చి జరిగిందంతా చిట్టికి సుమిత్ర కి చెప్తుంది. ఏమిటమ్మా ఇది మీ ఇంట్లో వాళ్లకి అవసరం అని ఒక మాట చెప్తే ఇచ్చేవాళ్ళం కదా అంటుంది చిట్టి. మా కావ్య డబ్బు పుట్టింటికి చేరవేసిందని నిందలు వేశారు కదా మరి ఇప్పుడు ఈ అనామిక ని ఏం చేస్తారు అని సుమిత్రని నిలదీస్తుంది స్వప్న. ఈ విషయం కళ్యాణ్ తేల్చాల్సిందే అంటుంది సుమిత్ర.

అప్పుడు స్వప్న కళ్యాణ్ ని పిలిచి జరిగినది అంతా చెప్తుంది. నిన్ను మనిషిగా చూడటం లేదని నేను కూడా మనిషిని కాదనుకున్నావా, నీ పుట్టింటికి డబ్బులు అవసరం అయితే నేను ఇవ్వననుకున్నావా ఏంటి పని అని మందలిస్తాడు కళ్యాణ్. అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి ఈ ఇంటి కోడల్ని దొంగని చేసి మాట్లాడటానికి నీకేం హక్కు ఉంది, నువ్వు ఈ ఇంటి కోడలి వా అని స్వప్నని మందలిస్తుంది.
సరే ఈ ఇంటి పెద్ద ఇక్కడే ఉన్నారు కదా ఆవిడకైనా సమాధానం చెప్పాలి కదా నీ కోడలు చేసిన పనికి ఏమని సమాధానం చెప్తావు అని అంటుంది అపర్ణ. చెక్కు తను తీయలేదు, తన అవసరం గురించి చెప్తే నేనే ఆ చెక్ ఇచ్చాను అంటుంది ధాన్యలక్ష్మి. మరి ఆ విషయం నాకు చెప్పకుండా నన్ను చూసి ఎందుకు కంగారు పడిందో నీకు నీ కోడలికే తెలియాలి అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.

కోడల్ని బాగానే వెనకేసుకొచ్చారు గాని రేపు మీ నగలని కూడా పుట్టింటికి చేరవేస్తుంది జాగ్రత్త అని వెటకారంగా మాట్లాడుతూ స్వప్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోడలు చేసిన తప్పుడు పనికి ఆమె వైపు కోపంగా చూస్తుంది ధాన్యలక్ష్మి. మరోవైపు మాయ ఇంటికి చేరుకుంటారు అప్పు, కావ్య. వాళ్ళిద్దరూ ఆ ఇంటి ఆవిడతో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి మాయ వస్తుంది. కావ్య ని చూసి కంగారు పడుతుంది. కావ్య అని పిలుస్తుంది మాయ.
నన్ను గుర్తుపట్టావంటే నువ్వే అసలైన మాయవి అన్నమాట ఇప్పుడు నువ్వు జరిగిందంతా చెప్పాలి, మా ఇంటి కి వచ్చి అందరి ముందు నిజం చెప్పాలి అంటుంది కావ్య. భయంతో పరుగులు తీస్తుంది మాయ. ఆమెని వెంబడిస్తారు కావ్య, అప్పు ఇదంతా గోడ చాటు నుంచి చూస్తున్న రుద్రాణి కావ్య ని చూసి భయపడిందంటే తనే మాయ అయి ఉంటుంది, తనని కావ్య కి దొరక్కుండా చూడాలి అనుకుంటుంది.

తరువాయి భాగంలో హాస్పిటల్లో ఉన్న మాయని చూసి చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుంది అంటుంది అప్పు.శిక్ష తనకి కాదు నాకు. రేపే మా అత్తగారు ఆ దొంగ మాయ కి మా ఆయనకి పెళ్లి ఫిక్స్ చేశారు అని చెప్తుంది కావ్య. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ని మాయ కండిషన్ గురించి అడుగుతుంది. మాయ కండిషన్ క్రిటికల్ గా ఉంది అని డాక్టర్ చెప్పడంతో కంగారుపడుతుంది కావ్య.


Click it and Unblock the Notifications










