Brahmamudi June 6th episode: చిత్రకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన రాజ్ .. చావు బతుకుల్లో ఉన్న మాయ బ్రతుకుతుందా!

రాజ్ గదిలోకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తుంది మాయ. తర్వాత అప్పు, కావ్య ఒరిజినల్ మాయ గురించి మాట్లాడుకోవడం విని కావ్య ని ఫాలో అవుతుంది రుద్రాణి. అనామిక ఇంట్లో చెక్ దొంగతనం చేయడం గమనించి అందరి ముందు దోషిగా నిలబెడుతుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 6వ తేదీ ఎపిసోడ్ 429 లో ఏం జరిగిందంటే..

కావ్య వాళ్ళకి దొరకకుండా పరిగెడుతున్న మాయని కారుతో గుద్ది వెళ్ళిపోతుంది రుద్రాణి. అపస్మారక స్థితిలో ఉన్న మాయని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అప్పు, కావ్య. మరోవైపు కారులో వెళ్తున్న రాజ్ కావ్య మాటలు తలుచుకుంటూ ఆమె నిజం చెప్పడం లేదు అనుకుంటాడు. అంతలోనే డూప్లికేట్ మాయ ఎవరితోనో మాట్లాడుతూ కనబడుతుంది.ఒక వ్యక్తి మాయని బెదిరిస్తూ ఉంటాడు గంటలో నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను అంటూ అతడిని పంపించేస్తుంది మాయ. అతను ఎవరు, మాయ అతడిని చూసి ఎందుకు భయపడుతుంది అనుకుంటూ అతడిని వెంబడించి అతడి ద్వారా నిజం తెలుసుకుని షాక్ అవుతాడు రాజ్.

Brahmamudi 6th June 2024

నీ పని చెప్తాను అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు హాస్పిటల్ లో అపస్మారక స్థితిలో ఉన్న మాయని చూసి ఏడుస్తూ ఉంటుంది కావ్య. దానికోసం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, చేసిన తప్పుకి ఆ దేవుడు దానికి శిక్ష వేశాడు అంటుంది అప్పు. శిక్ష దానికి కాదు అప్పు నాకు, మా అత్తగారు రేపే ఆ దొంగ మాయతో మీ బావకి పెళ్లి ఫిక్స్ చేశారు ఇప్పుడు ఈ మాయ నిజం చెప్పకపోతే ఆ పెళ్లి ఆపలేను అని ఏడుస్తుంది కావ్య.

అప్పుడే వచ్చిన డాక్టర్ని మాయ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది కావ్య. ఆమె కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది రేపటి వరకు ఆమె పరిస్థితి ఏమిటి అని చెప్పలేము అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్. నేను మాయ దగ్గర ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళు అని కావ్యకి చెప్తుంది అప్పు. రాత్రి అయినా పర్వాలేదు తనకి మెలుకువ వస్తే నాకు కాల్ చేయు నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు కోడలు చెంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి. నువ్వు ఇలాంటి పని చేస్తావ్ అనుకోలేదు.

నీకు అంత డబ్బు అవసరమైతే నేను ఇస్తాను కదా అంటుంది. మా నాన్న బిజినెస్ లాస్ అయింది, అప్పుల వాళ్ళు మీద పడుతున్నారు అని అమ్మ చెప్పడంతో మిమ్మల్ని అడిగితే ఎక్కడ చులకనగా చూస్తారో అని అలా చేశాను అంటుంది ధాన్యలక్ష్మి. అలా అనుకొని ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ముందు చులకన అయిపోయావు మరెప్పుడు ఇలా చేయొద్దు చేస్తే అప్పుడు నేను కూడా వెనకేసుకురాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి.

చేతిలో ఉన్న చూసుకుంటూ తిడితే తిట్టింది కానీ చెక్ మిగిలింది ఇదైనా అమ్మకు పంపించాలి అని ఆనందపడుతుంది అనామిక. మరోవైపు అపన్న దగ్గరికి వచ్చిన స్వప్న నిన్న కాక మొన్న వచ్చిన కోడల్ని ధాన్య లక్ష్మి గారు వెనకేసుకొస్తున్నారు కానీ మీరు మాత్రం మా చెల్లెలికి అన్యాయం చేయాలని చూస్తున్నారు అంటుంది. నేను అందరికీ న్యాయమే చేయాలని చూస్తున్నాను అంటుంది అపర్ణ.

నిజమే అందరికీ న్యాయమే చేస్తున్నారు కానీ ఒక నా చెల్లికి మాత్రమే అన్యాయం జరుగుతుంది అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. మరోవైపు చిత్ర అనబడే మాయ దగ్గరికి వస్తాడు రాజ్. నీ గురించి నిజం తెలిసింది అంటూ తనకు తెలిసిన నిజాలన్నీ చెప్తాడు. రాజ్ మాటలకి షాక్ అవుతుంది చిత్ర. మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, నేను మీరు అనుకుంటున్న వ్యక్తిని కాదు అని బుకాయిస్తుంది. నువ్వు ఎవరివో మీ ఇంటికి వెళ్తే తెలుస్తుంది.

మీ నాన్న పనిచేసిన చోటే కోటి రూపాయలు కన్నం వేసి పోలీసులకి దొరక్కుండా తిరుగుతున్నాడు, ఆ డబ్బులు కోసమే నువ్వు మా ఇంట్లో మాయగా ప్రవేశించావు అంటూ మర్యాదగా రాత్రికి రాత్రే ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపో లేదంటే మీ నాన్నని పట్టుకొని పోలీసులకి అప్పచెప్పటం నాకు పెద్ద పని కాదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్. రాజ్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తట్టుకోలేక పోతుంది మాయ, టెన్షన్ పడుతూ రుద్రాణి గారికి ఇదంతా చెప్పాలి అనుకుంటుంది.

మరోవైపు కావ్య ఇంటికి వచ్చేసరికి బయట ఉయ్యాల ఊగుతూ ఎక్కడికో బయటికి వెళ్లినట్లు ఉన్నావు వెళ్లిన పని అయిందా అని వెటకారంగా అడుగుతుంది రుద్రాణి. మీకు వచ్చే పోయే వాళ్ల గురించి ఆరాలు తీయడమే పనా అంటూ రుద్రాణి మీద కోప్పడుతుంది కావ్య. వాళ్ళిద్దరికీ మాట మాట పెరిగి పెళ్లి జరగనివ్వనని కావ్య, మాయతో రాజ్ పెళ్లి జరుగుతుందని రుద్రాణి ఇద్దరూ సవాల్ విసురుకుంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన కావ్య ఇంట్లో వాళ్ళందరూ చీరలు సెలెక్ట్ చేయడం చూసి షాక్ అవుతుంది.

తరువాయి భాగంలో మాయ అసలు మాయ కాదని, చిత్ర అని, రాత్రికి రాత్రి తనని ఇంట్లోంచి వెళ్లిపోమన్నానని జరిగినదంతా భార్యకి చెప్తాడు రాజ్. మరోవైపు బట్టలు సర్దుకుంటున్న చిత్రని బట్టలు ఎందుకు సర్దుతున్నావు అని అడుగుతుంది రుద్రాణి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అంటుంది చిత్ర. షాక్ అవుతుంది రుద్రాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X