Brahmamudi June 7th episode: అత్తని రఫ్ ఆడించేసిన స్వప్న.. ఇంట్లోంచి మాయ బయటికి!

అప్పు, కావ్య ఒరిజినల్ మాయ గురించి మాట్లాడుకోవడం విని కావ్య ని ఫాలో అవుతుంది రుద్రాణి. అనామిక ఇంట్లో చెక్ దొంగతనం చేయడం గమనించి అందరి ముందు దోషిగా నిలబెడుతుంది స్వప్న. దొంగ మాయ గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఆమెని బెదిరించి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 7వ తేదీ ఎపిసోడ్ 430 లో ఏం జరిగిందంటే..

హల్లో అందరూ చీరలు సెలెక్ట్ చేసుకోవడం చూసిన కావ్య బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి రేపు మీ ఆయనకి పెళ్లి కదా నువ్వు కూడా మంచి చీర తీసుకో అని వెటకారంగా మాట్లాడుతుంది. అక్కడే భయపడుతూ నిలబడిన మాయని కూడా రేపు పెళ్లి జరగబోయేది నీకే, నువ్వేంటి అలా దూరంగా నిలబడ్డావు నువ్వు కూడా బట్టలు తీసుకో అంటుంది. సుమిత్ర కూడా మాయ ని బట్టలు సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది కానీ నాకు బట్టలు సెలెక్ట్ చేసుకోవడం రాదు అంటుంది మాయ.అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. రేపు నీ పెళ్లి కదా నీ కాబోయే పెళ్ళాన్ని చీరలు తీసుకోమంటే భయపడుతుంది అంటుంది రుద్రాణి.

brahmamudi-serial-7th-june-2024

ఇంతవరకు వచ్చిన తర్వాత ఆగడం ఎందుకు చీరలు తీసుకో అంటూ కోపంగా మాయ వైపు చూస్తాడు రాజ్. మా ముసలిది ఏదో అన్నట్లుగా ఉంది అందుకే భయపడిపోతుంది అని మాయని చూసి అనుకుంటుంది రుద్రాణి. మీ కాబోయే భర్త చీరలు తీసుకోమంటున్నాడు కదా తీసుకోవటానికేమి అంటుంది. ఆయన మాటలు నీకు అలా అర్థం అయ్యాయా అని రుద్రాణిని మనసులోనే తిట్టుకుంటుంది మాయ. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న అత్త..నేను వస్తున్నాను ఆగండి మీ ఆట కట్టిస్తాను అంటూ రాహుల్ ఏడి అని రుద్రాణిని అడుగుతుంది. ఇప్పుడు వాడు ఎందుకు అంటుంది రుద్రాణి.

నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను వాడితో నో అబ్జెక్షన్ లెటర్ రాయించుకుంటాను నేను కూడా రెండో పెళ్లి చేసుకుంటాను నాకు కూడా చీరలు సెలెక్ట్ చెయ్యత్త అని వెటకారంగా అడుగుతుంది. నేనెందుకు సెలెక్ట్ చేస్తాను అని అడుగుతుంది రుద్రాణి, మరి నా చెల్లెలు ఎలా సెలెక్ట్ చేస్తుందని అనుకున్నావు భర్తకి మరో పెళ్లి జరుగుతుందంటే ఒక ఆడది ఎంత బాధ పడుతుందో నీకు తెలియదా అసలు నువ్వు ఆడదానివేనా, అని అత్త పై విరుచుకుపడుతుంది స్వప్న. ఆమెని కోప్పడుతుంది అపర్ణ.

నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు ఆంటీ, నేను ఎన్ని మాటలు మాట్లాడినా రేపు ఈ పెళ్లి ఆగదని నాకు తెలుసు అయినా మనసుకి బాధ అనిపించి ఏదో మాట్లాడేశాను క్షమించండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కావ్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆమెని ఆగమని వదినా..కొత్త కోడలికి నగలు పెట్టాలి కదా పెట్టవా అని అపర్ణని రెచ్చగొడుతుంది రుద్రాణి. అపర్ణ కావ్యని నగలు తెచ్చి ఇమ్మంటుంది. నా భర్త కంటే నాకు నగలు ఎక్కువ కాదు ఇస్తాను అంటుంది కావ్య.

నీకు కావాలంటే వేరే నగలు కొను తన దగ్గరే తీసుకోవాలా అని అపర్ణని మందలిస్తుంది ఇందిరా దేవి. నా భర్త నాకు దూరం అవుతున్నప్పుడు నగలు మాత్రం నాకెందుకు అంటూ నగలు తెచ్చి ఇచ్చేస్తుంది కావ్య. కావ్య మీద కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇందిరా దేవి. నగలు తీసుకొని మాయ చేతిలో పెడుతుంది అపర్ణ. భయపడుతూనే నగలు తీసుకుంటుంది మాయ.

మరోవైపు బాధగా కూర్చున్న కావ్య దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పి ఈ పెళ్లి జరగదు కంగారు పడకు అని ధైర్యం చెప్తాడు రాజ్. మాయ కనిపించకపోతే మిమ్మల్ని అందరూ అనుమానిస్తారు అని కంగారుగా అడుగుతుంది కావ్య. అలాంటి భయాలు పెట్టుకోవద్దు కావ్యకి అన్యాయం చేయటం ఇష్టం లేక వెళ్ళిపోయాను అని ఒక లెటర్ రాసి ఆమె గదిలో నేనే పెడతాను ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్.

మరోవైపు బట్టలు సర్దుకుంటున్న మాయ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రుద్రాణి. రాజ్ కి నిజం తెలిసిపోయింది మా నాన్నని కూడా జైల్లో పెడతాను అంటున్నాడు నేను వెళ్ళిపోతాను అంటుంది మాయ. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ నువ్వు వెళ్ళిపోతే మేము ట్రబుల్స్ లో పడతాము, అయినా రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు నిన్ను ఎలా పంపించేస్తాం అనుకున్నావు అంటాడు.

తరువాయి భాగంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, నేను ఏమీ చేయలేని సహాయ పరిస్థితుల్లో ఉన్నాను నువ్వే ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని కావ్యని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్. మీరు ప్రశాంతంగా ఉండండి మిగిలినదంతా నేను చూసుకుంటాను అంటుంది కావ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X