Brahmamudi June 8th episode: బెడిసికొట్టిన రాజ్ ప్లాన్.. ఇంట్లో నుంచి కదలనంటూ తిష్ట వేసిన నకిలీ మాయ!

ఇంటి నుంచి వెళ్లిపోవడానికి చిత్ర (దొంగ మాయ) బట్టలు సర్దుతూ ఉంటుంది. ఇప్పుడు కాని ఇది వెళ్ళిపోతే మనం అడ్డంగా బుక్ అయిపోతాం అని రాహుల్ అంటాడు. మీరు ఏమైపోయినా పర్లేదు సమస్య నా వరకు వస్తే నేను అడ్డు తప్పుకుంటాను అని అంటుంది చిత్ర. మేము నీకు అన్ని చేస్తే నువ్వు తిరిగి మాకు చేస్తుంది ఇదా అని రుద్రాణి అడగగా మీరు నాకు ఎన్ని చేసినా అది మీ స్వార్థం కోసమే చేశారు నా మీద ప్రేమతో ఏమి చేయలేదు అంటుంది చిత్ర.

అయినా సరే నిన్ను వెళ్ళనివ్వను అని రుద్రాణి అనగా, మీరేం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి చెప్పాలనుకుంటారో చెప్పుకోండి నేను మాత్రం భయపడను అంటూ సమాధానం ఇస్తుంది చిత్ర. ఆ తర్వాత సీన్లో ఇంట్లో ఉన్న పెళ్లి డెకరేషన్లు చూస్తూ, ఆగిపోయే పెళ్లికి ఎన్ని ముస్తాబులేంటో అనుకుంటూ మనసులో నవ్వుకుంటాడు రాజ్. అలా ఇంటి బయటకి వచ్చి చూసేసరికి అక్కడ చిత్ర తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. చిత్రని చూసిన రాజ్ ఒకేసారి షాక్ అయ్యి నిన్న రాత్రి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాదనుకుంటే ఇక్కడే ఉంది ఏంటి అని చిత్ర దగ్గరికి వెళ్లే లోగ అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిరాదేవి రాజ్ ని పిలుస్తుంది.

Brahmamudi 8th June 2024

నిన్ను చిన్నప్పటి నుంచి నా ఒడిలో పెట్టుకొని పురాణ కథలు, గొప్ప గొప్ప వీరుల కథలు చెప్తే నువ్వు కూడా అంత వాడివి అవుతావు అనుకున్నాను కానీ ఆ కథలన్నీ నిద్రలోనే మరిచిపోతావని అనుకోలేదు. అయినా ప్రతి ఒక్కరిలో తప్పు వెతికే నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి ఎలా ఉండగలుగుతున్నావు? ఇంట్లో ఒక భార్యని పెట్టుకుని ఇంకొకరికి గర్భిణీనిని చేస్తే నీ భార్య ఏమైపోవాలి? పాపం కావ్యకి ఎంత అన్యాయం చేస్తున్నావో. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఈ పెళ్లి అవసరమా అని అనగా దానికి రాజ్ మూగబోతాడు. నీ మౌనమే నాకు సమాధానం ఇస్తుంది. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నావు ఇంక నేను మీ జీవితంలో జోక్యం చేసుకోను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి. వెంటనే చిత్ర దగ్గరికి వెళ్తాడు రాజ్.

ఏంటి నువ్వు ఇంకా వెళ్లి పోలేదా అని రాజు అడగగా వెళ్దామని అనుకున్నాను కానీ ఇంత ఆస్తిని మీ అంత అందగాడిని చూసి ఎలా వెళ్తాను అనుకున్నారు అంటుంది చిత్ర. మీ నాన్నని పోలీసులకి అప్ప చెప్పాలా అంటూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేయగా అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుందా? మీరు ఎన్నిసార్లు చేసినా అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నేను చేస్తాను ఉండండి అని ఇంకొక నెంబర్ తో చేయగా వాళ్ళ నాన్న రాత్రికి రాత్రే మలేషియా వెళ్ళిపోయాడు అని తెలుసుకుంటాడు రాజ్. మీ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో పని చేస్తుందేమో కానీ మలేషియాలో కాదు. మీరు నన్ను ఏమి చేయలేరు మా నాన్నని కూడా ఏమీ చేయలేరు. నన్ను బెదిరించడం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు ఈరోజు మన పెళ్ళికి సిద్ధంగా ఉండండి అని అంటుంది చిత్ర.

ఇలా జరుగుతుందని ఊహించని రాజ్ చాలా కోపంగా ఇంట్లోకి వస్తాడు. అప్పుడే అపర్ణ పెళ్లి బట్టలు తీసుకోమని రాజ్ కు చిత్రకు ఇస్తుంది. అక్కడికి వచ్చిన చిత్ర, మీ కొడుకు అందరి మధ్యలో నన్ను కన్నెత్తి కూడా చూడడు కానీ మీరు ఎవరూ లేనప్పుడు నాతో అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఈ రోజైనా నా దగ్గరికి రాకుండా వెళ్లి పెళ్లికి రెడీ అవ్వమని చెప్పండి అని అపర్ణతో అంటుంది. వాడికి బుద్ధి లేదు నీకైనా సిగ్గుండాలి కదా? ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అయినా నీకు బుద్ధుండాలి రాజ్ ఎలాంటి దాన్ని ఈ ఇంటికి కోడలుగా చేస్తున్నావో ఛీ! అనుకుంటూ వెళ్లిపోతుంది. చిత్రని అంటబెట్టినందుకు కళావతిని మనసులో తిట్టుకుని తన గదిలోకి వెళ్తాడు రాజ్. మరోవైపు ప్రకాష్ తన చేతి గోళ్లు తీసుకుంటూ ఉండగా ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది.

Brahmamudi 8th June 2024

పెళ్లి పెట్టుకొని చేతి గోళ్లు తీసుకుంటున్నారు ఏంటండీ అని అనగా మరేం చేయమంటావు? నీలా పట్టుబట్టలు వేసుకొని అలంకరించుకోమంటావా? ఇక్కడ జరుగుతున్నదే తప్పంటే దానికి నువ్వు ముత్తైదువులాగ రెడీ అవుతున్నావు. ఏదైనా చేసి పెళ్లిని ఆపాలి అంటాడు ప్రకాష్. దానికి ధాన్య లక్ష్మీ, మనం ఎన్ని అనుకున్నా ఇంట్లో మన మాటలు చెల్లవు. ఇన్ని సంవత్సరాలలో మన నిర్ణయాలు ఎప్పుడైనా అక్క లెక్క చేసిందా? ఇప్పడు కూడా అదే అవుతుంది మనం ఏం చేయలేము అంటుంది. తన మాటలు విని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు ప్రకాష్. మరోవైపు రాజ్ గదిలోకి వెళ్లి తన పెళ్లి బట్టలు చూసి కోపంగా నేల మీదకి విసురుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య దాన్ని తీసుకొని కోపంగా ఉండకండి ఏదో ఒక దారి ఉంటుంది అని అంటుంది.

నేను ఇంత నిస్సహాయ స్థితిలో ఎప్పుడూ లేను, పరిస్థితి నా చేయి జారిపోతుంది అని అనగా మీ భార్యని అయ్యుండి ఇంకొక ఆడది మీ జీవితంలోకి వస్తే చూస్తూ నేను ఎలా ఉండగలనుకుంటున్నారు? పెళ్లికి ఇంకా టైం ఉంది కదా నేను చేయాల్సింది చేస్తాను మీరేం కంగారు పడొద్దు అని ధైర్యం ఇస్తుంది కావ్య. నా జీవితంలో ఎవరిమీద ఆధారపడలేదు నేను. ఎవరిని సహాయం అడగలేదు. ఈ ఒక్క బాధ్యత మాత్రం నీకు ఇస్తున్నాను ఎలాగైనా ఈ పెళ్లి ఆపేటట్టు చూడు అంటూ కావ్య చేయి పట్టుకుని బతిమిలాడతాడు రాజ్. మీరు ప్రశాంతంగా ఉండండి మిగిలింది అంతా నేను చూసుకుంటాను అని రాజ్ కు ధైర్యం ఇస్తుంది కావ్య. ఆ తర్వాత సీన్లో అప్పు కావ్య కి ఫోన్ చేస్తుంది. మాయ కళ్ళు తెరిచిందా? అని కావ్య ఆశగా అడగగా డాక్టర్ నీతో మాట్లాడుతాను అన్నారు అని డాక్టర్ కి ఫోన్ ఇస్తుంది అప్పు.

మాయ స్పృహలోకి వచ్చిందా డాక్టర్ అని కావ్య అడగగా నేను అందుకే ఫోన్ చేశాను మేడం. మామూలుగా ఈ సిచువేషన్ లో తను స్పృహలోకి రావాలి కానీ ఇంకా రాలేదు. తను ఇప్పుడు స్పృహలోకి రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. తనకి హైడోస్ ఉన్న ఇంజక్షన్ వేస్తే స్పృహలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అది వేసినా స్పృహలోకి రాకపోతే మనం ఇంకే చేయలేము. తనంతట తానే స్పృహలోకి వచ్చేవరకు వెయిట్ చేయవలసిందే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని అనగా దానికి కావ్య ఎలాగైనా ఇంజక్షన్ వేయండి డాక్టర్ తను స్పృహలోకి రావడం నాకు చాలా అవసరం అంటుంది.

Brahmamudi 8th June 2024

తరువాయి భాగంలో పెళ్లి పీటల మీదకు వెళ్తూ, నీ మీదే భారమంతా పెట్టి వెళ్తున్నాను అని కావ్యకి చెప్పి వెళ్తాడు రాజ్. ఇంతలో మాయ స్పృహలోకి వచ్చింది అని అప్పు ఫోన్ చేసి చెప్పగా వెంటనే హాస్పిటల్ కి పయనం అవుతుంది కావ్య. హాస్పిటల్లో డాక్టర్ మాయను లేపుతూ ఉండగా తన కంటి రెప్పలను ఆడిస్తూ ఉంటుంది మాయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X