Brahmamudi: సగం మంది హీరోలు నా కొడుకులే.. 'బ్రహ్మముడి' అపర్ణ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం కాలంలో సీరియళ్లకు బీభత్సమైన పాపులారిటీ వస్తోంది. వెండితెరపై కనువిందు చేసే హీరో హీరోయిన్ తరహా స్థాయిలోనే బుల్లితెరపై అలరించే నటీనటులకు సైతం ప్రేక్షకాదరణ అందుతోంది. ఇలా సీరియళ్ల ద్వారా ఎంతోమంది నటీమణులు మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి వారిలో బ్రహ్మముడి సీరియల్ లోని అపర్ణ పాత్ర ఒకరు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ కు తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందులో హీరో రాజ్ (బిగ్ బాస్ ఫేమ్ మానస్) కు తల్లిగా నటించిన అపర్ణ పాత్ర శ్రీప్రియ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రెండు వేరియేషన్స్..:బ్రహ్మముడి, వైదేహి పరిణయం సీరియళ్లలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నటి శ్రీప్రియ. ఇక ఇటీవల కార్తీక దీపం స్థానంలో టెలీక్యాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో మంచి నటన కనబరుస్తూ అశేష ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఇష్టం లేని కోడలిని తన మాటలతో ఇబ్బంది పెట్టే అత్తగా.. మరోవైపు కొడుకుపై ప్రేమ చూపించే తల్లిగా రెండు వేరియేషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, సీరియల్స్ పై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

99 శాతం మందికి:"మా సొంతూరు విజయవాడ. మా ఆయన డైరెక్టర్ శ్రీకర్, చాలా సీరియల్స్, కొన్ని సినిమాలు కూడా చేశారు. సంధ్యా రాగం సీరియల్ లో హీరోయిన్ గా నా కెరీర్ స్టార్ట్ అయింది. పాప పుట్టిన తర్వాత కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చింది. మళ్లీ మొగలి రేకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చాను. మొగలి రేకులు సీరియల్ చేసిన 99 శాతం మందికి మంచి లైఫ్ వచ్చింది. ఇప్పటికీ నన్ను చాలా మంది రజని అని పిలుస్తారు" అని శ్రీప్రియ తెలిపారు.
9 గంటల వరకు:మేకప్, కాస్ట్యూమ్స్ గురించి శ్రీప్రియను ప్రశ్నించగా.. "ఓ గది మొత్తం నా చీరలే ఉంటాయి. రిచ్ క్యారెక్టర్లు అనేసరికి చీరలు, నగలకే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఒక సీరియల్ కాస్ట్యూమ్ ఇంకో సీరియల్ కు వాడటానికి లేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా షాపింగ్ చేస్తూనే ఉంటాను. సీరియల్ షూటింగ్ కోసం ఉదయం 8 గంటలకు ఇక్కడికి వచ్చేస్తాం. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్. ఇంటికెళ్లేటప్పటికీ రాత్రి 11 అవుతుంది. తిని పడుకునేసరికి 12 అవుతుంది" అని వెల్లడించారు.

మొగలి రేకుల నుంచి:తల్లి పాత్రలకు సంబంధించి ప్రశ్నించగా.. "మొగలి రేకులు సీరియల్ నుంచి తల్లి క్యారెక్టర్లు చేస్తున్నాను. అందులో నేను దేవి క్యారెక్టర్ కు తల్లి అయిన రజని పాత్రలో నటించాను. ఓవరాల్ గా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయిపోయింది. వైదేహి పరిణయం, బ్రహ్మముడి సీరియల్స్ చేస్తున్నాను. టీవీ ఇండస్ట్రీలో ఉన్న సగం మంది కూతుళ్లకు నేనే తల్లిని. ఇక కొడుకుల విషయానికొస్తే చాలా మంది సీరియల్ హీరోలకు నేను తల్లిగా చేశాను" అని నటి శ్రీప్రియ చెప్పుకొచ్చారు.

బాధ ఇలా తీరింది:బ్రహ్మముడి అపర్ణ అదే శ్రీప్రియ ఇంకా కొనసాగిస్తూ.. "ఏదైనా ఈవెంట్ కు వెళితే అందరూ హాయ్ అమ్మ అని పిలుస్తూనే ఉంటారు. నిజానికి నాకు ఇద్దరు ఆడ పిల్లలు. నాకు బాబులు అంటే చాలా ఇష్టం. ఈ విధంగా నాకు దేవుడు కొడుకులను ఇచ్చాడని సంతోషంగా ఫీలవుతాను. కొడుకు లేడనే బాధ ఇలా తీరిపోయింది" అని ఆమె ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











