Brahmamudi అలాంటి దారుణమైన టార్చర్‌.. ఓ దశలో చచ్చిపోదామనుకున్నా.. బ్రహ్మముడి అప్పూ కన్నీటిగాథ

బుల్లితెర ద్వారా ఇంటిల్లిపాదిని పలకరించే .. సీరియల్ నటులు నిజజీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నవారే. కానీ ఈ బాధలను పంటిబిగువన భరిస్తూనే నటించడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో తన అద్భుత నటనతో ఆకట్టుకుంటున్న అప్పు (నైనిషా రాయ్ ) రియల్ లైఫ్‌ కష్టాలు.. సీరియల్‌ ట్రాజెడికి ఏమాత్రం తగ్గవు.

బెంగాల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన నైనిష చిన్నప్పటి నుంచి సినిమాలపై వున్న ఆసక్తితో కొన్ని బెంగాలీ సినిమాల్లో నటించింది. ఆపై తెలుగులో ''కొంచెం ఇష్టం కొంచెం కష్టం '' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీమంతుడు, భాగ్యరేఖ, హంసగీతం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లో నటించింది.

brahmamudi serial appu alias Nainisha Rai Shares Shocking Facts About film industry

నైనిష కెరీర్‌లో తాను నటించిన అన్నింటిలోకి ఈటీవీలో టెలికాస్ట్ అయిన శ్రీమంతుడు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం మాటీవీలో బ్రహ్మముడి, వంటలక్క సీరియల్స్‌లో కీ రోల్ పోషిస్తోంది. అంతేకాదు.. 2021లో కథానిక, 2023లో ప్లాన్ బీ వంటి సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది.

అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. సీరియల్స్‌లో అనుభవిస్తున్న కష్టాలను మించి పడిందట. సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చి తల్లిదండ్రులకు దూరమైంది. సినీ పరిశ్రమ వైపు కూతురు రావడం ఇష్టం లేకపోవడంతో .. ఆమెతో తమ బంధాన్ని తెంచుకున్నారు. ఇక్కడ అడుగుపెట్టాక.. కనీసం తినడానికి తిండి లేకుండా ఇబ్బందిపడిన సందర్భాలు వున్నాయని నైనిష గుర్తుచేసుకుంది.

ఇంటిని వదిలి వచ్చాక ఆకలి తీర్చుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేసి ఆ డబ్బుతో కడుపు నింపుకున్నానని తెలిపింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని.. ఆ సమయంలో పడిన కష్టాలను అనుభవించలేక చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశానని నైనిష భావోద్వేగానికి గురైంది .

సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని అంతా అనుకుంటారని, నేను కూడా అలాగే అనుకునేదాన్నని కానీ.. అమ్మాయిలే అమ్మాయిల్ని మోసం చేస్తారని ఇండస్ట్రీకి వచ్చాకే తెలిసిందని నైనిష చెప్పింది. ఓ అమ్మాయి చేసిన మోసం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఆ సమయంలో సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ ఇచ్చి వుంటే జీవితం మరోలా వుండేదని భావించి.. కొన్ని సీన్లలో నాకు తెలియకుండానే నిజంగానే ఏడ్చానని నైనిష గుర్తుచేసుకుంది.

brahmamudi serial appu alias Nainisha Rai Shares Shocking Facts About film industry

నాకు తెలుగు రాదని తెలిసి అమ్మాయిలు ఏడిపించేవారని, బ్యాడ్ వర్డ్స్‌ని నేర్పించి వాటిని డైరెక్టర్‌ దగ్గర చెప్పమనేవాళ్లని.. తాను నిజమేనని నమ్మి అలాగే చేస్తే ఆయన నన్ను తిట్టేవారని తెలిపింది. నన్ను తిడితే వాళ్లు ఏంజాయ్ చేయడం ఏంటో .. ఇలాంటి మనుషులు కూడా వుంటారా అని అనిపించిందని నైనిష పేర్కొంది.

జీవితంలో డబ్బు చాలా ఇంపార్టెంట్ అని , క్యాబ్‌లో వెళ్లినదానికి, సొంతకారులో వెళ్లినదానికి చాలా తేడా వుందని చెప్పింది. పనిలో పనిగా తనకు కాబోయేవాడిలో ఎలాంటి క్వాలిటీస్ వుండాలో కూడా ఆమె హింట్ ఇచ్చింది. డబ్బుకు ఇంపార్టెన్స్ ఇచ్చినా తనను కేరింగ్‌గా చూసుకోవాలని.. అవసరమైతే నేను కూడా డబ్బు సంపాదించి ఇస్తానని నైనిష చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X