Brahmamudi April 10th Episode : కావ్య ప్లాన్ సక్సెస్ .. యామినికి మస్కా కొట్టిన రాజ్, కళావతిపై అపర్ణకి అనుమానం

ఇతను రాజ్ కాదు.. మా బావ రామ్ అంటూ దుగ్గిరాల ఫ్యామిలీతో గొడవకు దిగుతుంది యామిని. ఇంత జరుగుతున్నా కావ్య మౌనంగా ఉండటం చూసిన అపర్ణ.. నువ్వేందుకు మౌనంగా ఉన్నావని నిలదీస్తుంది. దాంతో కావ్య కలగజేసుకుని ఆయన రామ్ కాదు రాజ్ అని , నా భర్త అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వు నా భార్యవి అయినప్పుడు ఫ్రెండ్‌గా నాకెందుకు పరిచయం అయ్యావని కావ్యని ప్రశ్నిస్తాడు రాజ్. దుగ్గిరాల ఫ్యామిలీ కూడా ఇదే విషయంపై గట్టిగా అడుగుతుంది.

ఆయనకు గతం గుర్తుచేయాలని చూస్తే బ్రెయిన్‌పై ప్రెజర్ పడి ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారని కావ్య చెబుతుంది. వీళ్లంతా కట్టుకథలు చెబుతున్నారని, వీరి మాటలు నమ్మొద్దని రాజ్‌తో అంటుంది యామిని. ఇంతలో సుభాష్ తన వద్ద ఉన్న రాజ్ పాన్‌కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్‌లని చూపిస్తాడు. యామిని కుటుంబం, దుగ్గిరాల కుటుంబం రాజ్ కోసం గొడవ పడుతుండగా రాజ్ కుప్పకూలిపోతాడు. ఆ వెంటనే కావ్య ఉలిక్కిపడి లేస్తుంది. ఇదంతా కల అని .. ఇలా జరగకూడదని యామినిని రెచ్చగొట్టేందుకు అక్షింతలు తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. ఇదంత గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్ 692లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 10th 2025 Episode 692 Here is Today s full story

దుగ్గిరాల ఫ్యామిలీలో ఎవరికి కనిపించినా అతని మీద హోప్స్ వదులుకోవాల్సిందేనని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. ఇక్కడికి తీసుకురావడానికి రామ్‌ని ఎంతో ఫోర్స్ చేశామని.. ఇప్పుడు వెళ్లిపోదామంటే ఎలా అని కూతురితో అంటుది వైదేహి. తను ఏమనుకుంటాడో అన్నది నాకు ఇంపార్టెంట్ కాదని, ఇక్కడి నుంచి ఖచ్చితంగా మనం వెళ్లిపోవాలని చెబుతుంది యామిని. తనని ఏదో ఒకటి చేసి నేను కన్విన్స్ చేసుకుంటానని అంటుంది. వెంటనే రాజ్‌ని పిలిచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది.. అత్తాపూర్‌లో శ్రీరామనవమి ఇంకా గ్రాండ్‌గా చేస్తున్నారట, అక్కడ మనకి తెలిసినవాళ్లు ఉన్నారు .. వెనుక దూరంగా కాకుండా మనల్ని ముందు వరుసలో కూర్చోబెడతారు అక్కడికి వెళ్దామని అంటుంది. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు.

ఇక్కడే ఉందాం.. వెయిట్ చేద్దామని అంటాడు రాజ్. మనం వచ్చాకే కళ్యాణం ప్రారంభిస్తారని చెబుతున్నారని , వాళ్లు అభిమానంగా పిలిచినప్పుడు మనం వెళ్లకపోతే బాగుండదని అంటుంది యామిని. ఇంతసేపు నేను కళావతి కోసం వెయిట్ చేశాను, తను కనిపించి హ్యాపీగా ఫీలయ్యేలోపు యామిని వెళ్లిపోదామని అంటోందని బాధపడతాడు రాజ్. ఇక్కడి నుంచి వెళ్లిపోతే కళావతిని మిస్ అయిపోతానని అనుకుంటాడు. వాళ్లకి ఫోన్ చేసి మేం చాలా దూరంలో ఉన్నాం.. ఇప్పుడు రావడం కుదరదని చెప్పేసేయ్ అంటాడు. మళ్లీ అంతదూరం ప్రయాణం చేసేంత టైం , ఎనర్జీ మన దగ్గర లేవు కదా అని చెబుతాడు రాజ్.

ఆ గుడి కట్టించిన దాతలు మనకి బాగా తెలిసినవాళ్లని, ఇప్పుడు వెళ్లకపోతే వాళ్లు బాధపడతారని చెబుతాడు యామిని తండ్రి. ఎన్నో ఏళ్లుగా మాకు ఆ గుడితో సంబంధాలు ఉన్నాయని, మనింట్లో ఎప్పుడు పూజలు ఉన్నా ఆ పూజారులు వచ్చి చేయిస్తూ ఉంటారని చెబుతుంది వైదేహి. నీకు ఓపిక లేకపోతే మీ మావయ్య గారు కారు డ్రైవ్ చేస్తారని అంటుంది. ఇక్కడ మనం లేట్ చేస్తే వాళ్లకి కూడా లేట్ అయిపోతుందని చెబుతుంది యామిని. దీంతో చేసేది లేక యామినితో పాటు గుడికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు రాజ్. అది చూసిన కావ్య.. ఊపిరి పీల్చుకుంటుంది.

మీరు వెయిట్ చేయండి.. నేను పార్కింగ్‌లో ఉన్న కారు తీసుకొస్తానని వెళ్తాడు. యామినికి అనుమానం వచ్చి నేను వెళ్లి బావని తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెబుతుంది. కావ్యని నమ్మడానికి వీల్లేదని, ఈ గ్యాప్‌లో ఏదైనా చేయొచ్చని .. బావ గురించి నేను ఏ ఛాన్స్ తీసుకోలేనని అంటుంది. కావ్యని ఎలా కలవాలా అని రాజ్ గుడిలో అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో రుద్రాణి బయటే ఉన్న విషయం గమనించిన కావ్య.. ఆయనను చూస్తే ఇబ్బందులు తప్పవని భయపడుతుంది. వెంటనే రాజ్‌ను వెతుక్కుంటూ బయటికి వస్తుంది.

కావ్యని చూసిన రాజ్ సంతోషంతో ఆమె దగ్గరికి వెళ్తాడు. అయితే యామినికి భయపడి ఆమెను స్టోర్ రూమ్‌లోకి తీసుకెళ్తాడు రాజ్. ఇలా చేయి పట్టుకుని గదిలోకి లాక్కొస్తూ నలుగురు ఏమనుకుంటారని నిలదీస్తుంది కావ్య. మీ ఇంట్లో వాళ్ల ముందు మీతో క్లోజ్‌గా మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని అందుకే పక్కకి తీసుకొచ్చానని చెబుతాడు రాజ్. ఇంతలో పూజారి వచ్చి వాళ్లిద్దరూ ఉన్న స్టోర్ రూమ్‌కి తాళం వేస్తాడు. మన పురాణాల్లో అలా చేయి పట్టుకుంటే పాణి గ్రహణం అంటారని, అంటే సగం పెళ్లి అయిపోయినట్లే అంటుంది.

అలా మీరు చేయి పట్టుకోవడం మా వాళ్లు చూస్తే .. వాళ్లు కూడా అలాగే అనుకుంటారు కదా అని చెబుతుంది కావ్య. అంటే మీ ఫ్యామిలీ అంత పాతకాలపు మనుషులని నాకు తెలియదని సెటైర్ వేస్తాడు రాజ్. అంటే మా దుగ్గిరాల ఫ్యామిలీని మీరు అవమానిస్తున్నారని అంటుంది కావ్య. నేను వెళ్లిపోతూ మీకు బాయ్ చెబుదామని వచ్చానని చెబుతాడు రాజ్. కావ్య మాటలతో ఖంగుతిన్న రాజ్ వెళ్లిపోతానని డోర్ ఓపెన్ చేయగా అది ఎంతకూ రాదు.. బయటి నుంచి ఎవరో లాక్ పెట్టారని అంటాడు రాజ్.

పెళ్లి కాకుండా ఒక అమ్మాయి, అబ్బాయి లోపల ఉంటే నలుగురు ఏమనుకుంటారని అంటుంది.. సీతారాముల వారి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయని , దాని కోసమే నేను ఉదయం 3 గంటలకు లేచి రెడీ అయ్యానని చెబుతుంది. ఇంత కష్టపడితే మీ వల్ల నేను గదిలో ఉండాల్సి వస్తోందని బాధపడుతుంది కావ్య. మీరు రాముల వారి కళ్యాణం చూడాలి అంతే కదా అని అటు ఇటూ చూస్తాడు రాజ్. ఆ రాముల వారి దగ్గరికి మీరు వెళ్లనక్కర్లేదు.. ఆయనే మన దగ్గరికి వస్తాడని అంటాడు. నేను చెప్పేంత వరకు కళ్లు మూసుకోమని చెప్పి లోపల స్టోర్‌లో ఉన్న సీతారాముల ఫోటో, పీటలు, పూజా సామాగ్రి సిద్ధం చేస్తాడు. అది చూసి కావ్య సంబరపడిపోతుంది.

తర్వాత ఇద్దరూ కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. గుడిలో కావ్య కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్లిందని అప్పూని అడుగుతుంది అపర్ణ. రాజ్ కోసం వెతుకుతూ వచ్చిన యామినికి కావ్య , రాజ్ ఇద్దరూ కనిపించకపోవడంతో డౌట్ వస్తుంది. బావ- కావ్య కలిసి ఎక్కడికైనా వెళ్లారా అని వాళ్లిద్దరని వెతకడానికి వెళ్తుంది యామిని. భర్తతో కలిసి సీతారాముల కళ్యాణం జరిపించినందుకు కావ్య సంతోషిస్తుంది. ఇంతలో పూజారి వచ్చి తలుపు ఓపెన్ చేయడంతో కావ్య - రాజ్ బయటికి వస్తారు.

కారు తీసుకొస్తానని చెప్పి వెళ్లి ఇంతసేపు ఏం చేస్తున్నావని రాజ్‌ని అడుగుతుంది యామిని. కీ కోసం వెతుకుతున్నానని ఇంతలో కళ్యాణం జరుగుతూ ఉండటంతో అక్కడే ఉండిపోయానని అంటాడు రాజ్. నేను లోపలికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ కనిపించలేదని అంటుంది యామిని. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లావని కావ్యని నిలదీస్తుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X