Brahmamudi April 10th Episode: సుభాష్ ప్లాన్ పసిగట్టిన రేఖ... తాత, నానమ్మల కోసం ఇందూ త్యాగం

Photo Courtesy: JioHotstar

ఇందూని కిడ్నాప్ చేయడానికి ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చిన స్వరాజ్- లక్కీలు తమ ప్లాన్ ఎలా అమలు చేయాలని ఆలోచిస్తుండగా అపర్ణ అడ్డు తగులుతుంది. రాజ్‌ని చూడగానే బాగా తెలిసిన ముఖంలా అనిపించడంతో మాస్క్ తీసి చూపించమని అడుగుతుంది. ఆ మాటలకు స్వరాజ్ కంగారుపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇందూని చూసిన నందూ.. ఆమెను గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. నిన్ను చూస్తే మా అక్కలాగే ఉన్నావని నందూ.. నువ్వు నా చెల్లెలిలా ఉన్నావని ఇందూ చెప్పుకుంటారు. నాకు నా చెల్లెలంటే చాలా ఇష్టం.. అది చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, దానిని తలచుకోని రోజు లేదని బాధపడుతుంది ఇందూ. అయితే నన్ను నీ చెల్లెలు అనుకోమని చెబుతుంది నందూ.

స్వాతి పంపించిన మనుషులు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలుపుతుండగా ఇందూ వచ్చి .. నన్ను ఎలా కిడ్నాప్ చేస్తారని ప్రశ్నిస్తుంది. వాళ్లు తమ ప్లాన్ చెప్పడంతో ఇందూ సంతోషిస్తుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి.. నువ్వు సంతకం పెట్టాక నీ ఆస్తి మొత్తం రేఖ ఆంటీకి వచ్చేస్తుంది. రేపటి నుంచి నీ జీవితం ఎలా ఉంటుందోనని సెటైర్లు వేస్తుంది. నేను సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నా.. పరిస్ధితులు అనుకూలించాలి కదా అని ఇందూ అనడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్ 1003లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 10th 2026 Episode 1003 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూ చేత నాలుగు గదుల మధ్యలో కాకుండా పబ్లిక్‌గా అందరిముందు ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోమని రేఖకి చెబుతాడు లాయర్. అందరిముందే సంతకం తీసుకుంటూ దానిని వీడియో ఫుటేజ్ తీయించి దానిని ప్రూఫ్ కింద పెట్టుకుంటే, ఇందూ తన ఇష్టపూర్వకంగానే సంతకం చేసింది అనడానికి మన దగ్గర బలమైన ప్రూఫ్ ఉంటుందని చెబుతాడు లాయర్. మీరు అలా భయపడటానికి ఏం లేదు.. మా రేఖని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదని అంటుంది భ్రమరాంబ. ఇంతలో రేఖకి ఫోన్ వస్తుంది. మీ ఇంటి నుంచి ఎవరో కాల్ చేసి ఈరోజు ఇందూ గారి బర్త్ డేలో, మీరు బలవంతంగా తన నుంచి సంతకం పెట్టించుకుని ఆస్తి మొత్తం లాక్కోవాలని చూస్తున్నారని, ఈ విషయంలో ఇందూ గారికి సపోర్ట్ చేయాలని మీడియా వాళ్లు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారని చెబుతాడు.

ఈ న్యూస్ అన్ని ఛానెల్స్‌కు వెళ్లిపోయింది.. నేను ప్రెసిడెంట్‌ని కాబట్టి అందరూ నన్ను అడుగుతున్నారు, మన ఫ్రెండ్‌షిప్ వల్ల ముందు ఈ విషయం మిమ్మల్ని అడుగుదామని చేశానని అంటాడు ఆ వ్యక్తి. ఇంట్లో వాళ్లని నేను మేనేజ్ చేస్తాను, మీడియాను మీరు హ్యాండిల్ చేయమని చెబుతుంది రేఖ. అంతమందిని నేను ఆపలేనని ఆ వ్యక్తి చెప్పగా.. నేను మీ కోసం చాలా చేశాను, ఈసారి కూడా పెద్ద గిఫ్ట్ ఇస్తానని అంటుంది రేఖ. ఏం జరిగిందని భూషణ్ అడగ్గా.. ఆ ఇందూ చేత బలవంతంగా సంతకం పెట్టిస్తున్నామని, మీడియాకు లీక్ చేశారని చెబుతుంది రేఖ. తన మనవరాలిని కాపాడుకోవడానికి, ఈ ఆస్తి మొత్తం తనకే అప్పగించడానికి ఆ అపర్ణే ఇదంతా చేసిందని అనుకుని రగిలిపోతుంది రేఖ.

ఆస్తి పేపర్ల మీద సంతకం చేసి ఈ సమస్య నుంచి బయటపడదామని అనుకుంటున్నావా? మమ్మల్ని కాపాడదామని అనుకుంటున్నావా? అని ఇందూపై మండిపడుతుంది అపర్ణ. రాత్రి మీ అమ్మ గురించి తెలుసుకుంటే అయినా నీలో మార్పు వస్తుందని ఆశపడ్డాను, కానీ నువ్వు ఇంకా ఇలానే ఉన్నావని అంటుంది. ఇంతో రేఖ వచ్చి.. వెనుక నుంచి నువ్వు ఏమేం చేయిస్తున్నావని నాకు తెలియదా అంటుంది. ఏం జరిగిందని ఇందూ అడుగుతుంది. నువ్వు, మీ నానమ్మ కలిసి నా మీద మీడియా వాళ్లకి కంప్లయంట్ చేస్తారా అని ఫైర్ అవుతుంది రేఖ. ఆ మాటలతో ఇందూ, అపర్ణలు షాక్ అవుతారు.

మీడియా వాళ్లని పిలిచి నీతో బలవంతంగా సంతకాలు పెట్టించాలని చూస్తున్నానని చెబుతారా? ఇంట్లో వంటలు చేసుకునే మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే.. 23 ఏళ్లుగా ఈ ఆస్తి కోసం ఎదురుచూస్తూ అందరినీ మేనేజ్ చేస్తూ వస్తున్న నాకెన్ని తెలివితేటలు ఉండాలని అంటుంది రేఖ. మీడియా వాళ్లని పిలిచి సంతకం పెట్టకుండా తప్పించుకోవచ్చని ఆలోచించావు కానీ, నీ ముసలి తాతయ్య నానమ్మలు ఏమవుతారో మరిచిపోయావా అని అడుగుతుంది రేఖ. నేను ఏ మీడియా వాళ్లకి కంప్లయంట్ చేయలేదని చెబుతుంది ఇందూ.

నీకు మా రేఖ ఏం అన్యాయం చేసింది.. తిండి పెట్టి మంచిగానే చూసుకుంటోంది కదా? ఇలా వెన్నుపోటు పొడవటానికి సిగ్గులేదా అని సీరియస్ అవుతుంది భ్రమరాంబ. వెన్నుపోటు గురించి, మోసం చేయడం గురించి నువ్వు చెబుతున్నావా అని అపర్ణ సీరియస్ అవుతుంది. ఆస్తి మొత్తం వస్తుందని మీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందని చెబుతుంది రేఖ. ఈ ముసలోళ్లకి నరకం ఏంటో చూపిస్తే కానీ ఇందూకి మనమంటే ఏంటో అర్ధం కాదని అంటాడు భూషణ్. ఇప్పటి వరకు నా మనవరాలి కోసం సైలెంట్‌గా ఉన్నా, మీడియా వాళ్లకి కంప్లయంట్ చేసింది నేనే. ఇప్పటి వరకు మీరు చేసిన వెధవ పనులన్నీ బయటపెడతాను, డబ్బు కోసం మీరు చేసిన పాపాలన్నీ చెబుతానని అంటాడు సుభాష్.

నువ్వు చచ్చిన వానపాము అనుకున్నా.. బాగానే బుసలు కొడుతున్నావని అంటుంది రేఖ. నీ నడుము విరగ్గొట్టి ఒక చేతకానీ వాడిలా నిలబెట్టింది కాలం, అయినా మీడియా వాళ్లు ఎవ్వరూ ఇక్కడికి రారని చెప్పడంతో సుభాష్, అపర్ణలు షాక్ అవుతారు. ఇంతదూరం వచ్చాక మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టాలన్న కోరిక చచ్చిపోయింది.. ఈరోజుతో మీ కథ ముగించేస్తానని అంటుంది రేఖ. మీ తాతయ్య నన్ను బాగా డిసప్పాయింట్ చేశాడు, వీళ్లు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలని అంటుంది. దాంతో ఇందూ బాధపడుతూ.. వాళ్లని వదిలేయండి, సంతకాలు పెట్టేస్తానని చెబుతుంది. ముందు బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకో.. ఆ తర్వాత అందరిముందు సంతకాలు పెట్టమని చెబుతుంది రేఖ. మత్తుమందు సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి శేషంతో జ్యూస్ తాగిస్తారు స్వాతి మనుషులు. జ్యూస్ తాగిన శేషం మత్తుగా నిద్రపోతాడు.

మనిద్దరి జీవితాలు ఒకేచోట మొదలయ్యాయి.. నీ వాళ్లను నువ్వు కోల్పోయావు, నా వాళ్లను నేను కోల్పోయాను. ప్రేమతో నువ్వు, పగతో నేను మన జీవితాల్ని మొదలుపెట్టాం. కేక్ కట్ చేశాక నువ్వు ఏం మాట్లాడతావో నీ ఇష్టం. నువ్వు తప్పు చేస్తే ఆ పాపం నీ పెద్దవాళ్లకు చుట్టుకుంటుంది. ఆట నీదే అయినా గెలుపు నాది అని చెబుతుంది. ఇందూ ఏం చేయబోతుందా అని అపర్ణ, సుభాష్‌లు టెన్షన్ పడతారు. ఇందూని కిడ్నాప్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ఫెయిల్ కావడంతో రాజ్, ఐశ్వర్యలు టెన్షన్ పడతారు.

నా పుట్టినరోజు నాడు విష్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మా అమ్మనాన్నలు చనిపోయాక ఆ లోటు లేకుండా నన్ను మా నానమ్మ చూసుకున్నారు. ఆ తర్వాత నాకు అండగా నిలబడి, ముందుకు నడిపించింది మా రేఖ ఆంటీ అని చెబుతుంది ఇందూ. ఈ పుట్టినరోజుతో ఈ ఆస్తికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీదకు రాబోతోంది.. కానీ వాటి మీద నాకు ఎటువంటి ఆశ లేదు, నా కోసం ఇంత కష్టపడ్డ రేఖ ఆంటీకి బాధ్యతలన్నీ అప్పగించాలని అనుకుంటున్నానని చెబుతుంది. ఈ మాటలతో అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. ఇంత చిన్న వయసులోనే ఆస్తిని మోయడానికి నేను సిద్ధంగా లేను, వాటిని మా రేఖ ఆంటీ పేరు మీదకి మార్చాలని అనుకుంటున్నాను. మా రేఖ ఆంటీయే దుగ్గిరాల కుటుంబ ఆస్తుల్ని కాపాడతారని ఆశిస్తున్నానని చెబుతుంది ఇందూ. వెంటనే సంతకాలు పూర్తి చేసేద్దామని అంటుంది భ్రమరాంబ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X