Brahmamudi April 10th episode: ఆఫీసులో రాహుల్ పరువు తీసేసిన స్వప్న.. అపర్ణని మాటలతో హింసిస్తున్న ఆ ఇద్దరు!

ఓ చిన్నారిని ఇంటికి తీసుకు రావడంతో అందరూ రాజ్ కొడుకే అని ఫిక్స్ అయ్యారు. వెన్నెలకు, రాజ్‌కు పుట్టిన బిడ్డ అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజ్‌పై తల్లి, భార్య కావ్య అనుమానాలు పెరిగిపోయాయి. రుద్రాణి తన కొడుకును కంపెనీ ఓనర్ చేయాలని ప్లాన్ వేసింది. రాజ్ కళ్యాణ్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటంతో కంపెనీకి ఎండి అవుతాడు కళ్యాణ్.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్ 380 లో ఏం జరిగిందంటే..

సీటు త్యాగం చేసినందుకు
స్వప్న, అనామిక ఇద్దరూ పోటీలు పడి మరీ భర్తలకి క్యారేజీలు కడతారు. అది చూసిన కావ్య అవి ఒక మనిషి తినే క్యారేజీ లాగా లేవు అంటుంది. ఆ మాట అనామికని అడుగు అంటుంది స్వప్న. మేనేజర్ భార్య అంత కుక్కి,కుక్కి కడుతుంటే ఎండి భార్యని నేనెందుకు ఆగుతాను అంటుంది అనామిక. సరే త్వరగా వెళ్లండి లేదంటే వాళ్లు బయట నుంచి ఫుడ్ తెచ్చేసుకుంటారు అంటుంది కావ్య. దాంతో స్వప్న, అనామిక ఇద్దరూ ఆఫీసుకి బయలుదేరుతారు. అది చూసిన రుద్రాణి కావ్య దగ్గరికి వచ్చి వాళ్లు ఉన్న ప్లేస్ లో నువ్వు ఉండవలసింది కానీ రాజ్ ఆ సీటు త్యాగం చేసేసాడు నీకేమీ బాధనిపించడం లేదా అని అడుగుతుంది.

Brahmamudi April 10th episode

పెర్ఫూమ్ పేరు ఏమిటి?
నాకెందుకు బాధ కళ్యాణ్ ఖరాఖండిగా చెప్పాడు రాముడు ఎప్పుడు రాముడే, భరతుడు ఎప్పుడూ భరతుడే. నా భర్తకి ఉండవలసిన విలువ ఎప్పుడూ నా భర్తకి ఉంటుంది అంటుంది. నువ్వు బాగా నటిస్తావు అంటుంది రుద్రాణి. అలాగే అనుకోండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఈ మాటలు అన్ని రాజ్ వెనకనుంచి వింటాడు. మరోవైపు శృతి తన క్యాబిన్ కి వస్తే తన పెర్ఫ్యూమ్ పేరేంటి అని అడుగుతాడు రాహుల్. మీకెందుకు సార్ అని అడుగుతుంది శృతి.

శృతికి క్లాస్ పీకిన..
లేదు చాలా బాగుంది, నా భార్య కి కొంటాను అంటాడు రాహుల్. వద్దులేండి సార్, వేరే ఎవరైనా మీ భార్యని కూడా ఇలాగే అడుగుతారు అది మీకు బాగోదు అని సమాధానం చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది శృతి. ఇంతలో క్యారేజీలతో సహా అక్కడికి వచ్చిన స్వప్న, అనామికలని చూసి స్వప్నని విష్ చేస్తుంది. అనామిక తనకి విష్ చేయలేనందుకు శృతికి క్లాస్ పీకుతుంది. దేనికైనా ఫేస్ వ్యాల్యూ ఉండాలి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది స్వప్న.

Brahmamudi serial April 10th Episode Number 380 Here is full story
నా భర్త నిన్ను గోకాడా?
అక్కడ వాళ్ళిద్దరూ గొడవపడటం చూసి విసుక్కుంటుంది శృతి. తర్వాత అనామిక తన భర్త పనితీరు ఎలా ఉంది అని అడుగుతుంది. చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్తుంది శృతి. అనామిక అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత నా భర్త నిన్నేమైనా గోకాడ అని అడుగుతుంది స్వప్న. మీకు ఎలా తెలుసు అంటుంది శృతి. నా భర్త సంగతి నాకు తెలియకపోవటం ఏమిటి? అయినా ఏం జరిగిందో చెప్పు అనటంతో క్యాబిన్లో జరిగిందంతా చెప్తుంది శృతి.

కంగారుగా కావ్య
ఆ తర్వాత అనామిక క్యారియర్ తీసుకొని కళ్యాణ్ రూమ్ కి వెళ్తుంది ఇప్పుడు తినాలని లేదు అని కసురుకోవటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు చెప్పినట్లు చేస్తే మంచి వాడిని లేదంటే కనీసం మనిషిని చూసినట్లు కూడా చూడరు అని బాధపడతాడు కళ్యాణ్. మరోవైపు రాహుల్ దగ్గరకి వచ్చి అందరి ముందు తిట్టి రాహుల్ పరువు తీసేస్తుంది స్వప్న. మరోవైపు ఇంట్లోంచి కంగారుగా వెళుతున్న కావ్య ని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది చిట్టి.

Brahmamudi serial April 10th Episode Number 380 Here is full story

వెన్నెల ఫ్యామిలీ అప్పులు
శ్వేత దగ్గరికి వెళ్తున్నాను అని జరిగిందంతా చెప్తుంది చిట్టి. నేను ఇప్పుడే వచ్చేస్తాను ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే మీరే మేనేజ్ చేయండి అంటుంది కావ్య. నాకు టాబ్లెట్లు తేవడానికి వెళ్ళావని చెప్తానులే అని కావ్యకి సపోర్ట్ గా నిలబడుతుంది చిట్టి. ఆ తర్వాత కావ్య శ్వేత దగ్గరికి వెళ్లి వెన్నెల గురించి ఎంక్వయిరీ చేస్తుంది. వెన్నెల రాజ్ మంచి ఫ్రెండ్స్, వెన్నెల వాళ్ళ ఫ్యామిలీ అప్పులన్నీ రాజ్ వాళ్ళ తాతయ్యతో మాట్లాడి తీర్చేసాడు.

వెన్నెల వెనుకలా పడటంపై
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మూడు నెలల తర్వాత వెన్నెల కనిపించకుండా పోయింది అని చెప్తుంది శ్వేత. అయితే ఇన్నేళ్ల తర్వాత వెన్నెల ఎక్కడుందో తెలుసుకొని తిరిగి ఆయన వెన్నెలకి దగ్గర అయ్యారన్నమాట అంటుంది కావ్య.నాక్కూడా అదే ఆశ్చర్యంగా ఉంది నిన్ను పెళ్లి చేసుకున్నాక కూడా తను వెన్నెల వెనకాల పడటం ఏమిటి అంటుంది శ్వేత. అవన్నీ తెలియాలంటే ముందు వెన్నెల ఎక్కడుందో తెలుసుకోవాలి అంటుంది కావ్య.

నువ్వు చేసే సాయం
మీ టెన్త్ క్లాసు బ్యాచ్ అందరినీ రీ యూనియన్ పేరుతో మీటింగ్ ఏర్పాటు చేయు, కానీ ఇదంతా మనం వెన్నెలని పట్టుకోవడం కోసమే చేస్తున్నట్లుగా మా ఆయనకి తెలియకూడదు అంటుంది కావ్య. అందుకు ఒప్పుకున్న శ్వేత నేను నీకు సపోర్ట్ గా నిలబడతాను అంటుంది. నువ్వు చేసే ఈ సాయం నా జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అంటుంది కావ్య.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X