Brahmamudi April 11th Episode : యామినికి దొరికిపోయిన రాజ్ .. షాక్‌లో కావ్య , సీక్రెట్‌గా రాజ్‌తో ఏకాంతంగా

గుడిలో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని చూసిన యామిని ... వాళ్లలో ఎవరికి రాజ్ కనిపించినా అతను తనకు దూరమైపోతాడని భయపడుతుంది. ఏదో ఒకటి చేసి రాజ్‌ను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని తల్లిదండ్రులతో అంటుంది. అత్తాపూర్‌లో వేరే గుడిలో రాములవారి కళ్యాణం జరుగుతుందని.. అక్కడైతే ఫ్రంట్ రోలో కూర్చోవచ్చని రాజ్‌తో చెబుతుంది యామిని. ఆమె మాటలకు టెన్షన్ పడ్డ రాజ్.. దేవుడు ఎక్కడైనా దేవుడేనని ఇక్కడే ఉందామని అంటాడు.

యామిని, ఆమె కుటుంబ సభ్యుల పోరు తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సరేనంటాడు. తన ప్లాన్ సక్సెస్ కావడంతో కావ్య సంబరపడుతుంది. రుద్రాణి బయటే తిరుగుతుండటంతో భయపడిన కావ్య.. రాజ్ కోసం వెతుకుతుంది. యామినికి మస్కా కొట్టి మళ్లీ గుడిలోకి వచ్చిన రాజ్ .. కావ్యని చూసి ఇద్దరూ స్టోర్ రూమ్‌లోకి వెళ్తారు. ఇంతలో పంతులు గారు ఆ గదికి తాళం వేయడంతో ఇద్దరూ లోపలే ఇరుక్కుపోతారు. సీతారాముల కళ్యాణం చేయించాలని ఎంతో కష్టపడి వచ్చామని కావ్య బాధపడుతుండటంతో స్టోర్‌లోని పూజా సామాగ్రితో సీతారాముల కళ్యాణం జరిపిస్తాడు రాజ్. ఇదంత గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్ 693లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 11th 2025 Episode 693 Here is Today s full story

దుగ్గిరాల కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉండగా అప్పూ- కళ్యాణ్‌లు కిందకి వస్తారు. నేను స్టేషన్‌కి వెళ్తున్నానని ఇందిరతో చెబుతుంది అప్పూ. నువ్వు వెళ్తున్నావ్ సరే కళ్యాణ్‌ని కూడా తీసుకెళ్తున్నావా అని ప్రశ్నిస్తుంది ఇందిర. మొగుడిని చూడకుండా ఉండలేకపోతుందేమో అని స్వప్న అంటుంది. ఒకవేళ అప్పూకి నన్ను చూడాలని అనిపిస్తే ఏదో ఒక కేసులో ఇరికించి జైలులో పెడుతుందని చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో అంతా నవ్వేస్తారు. తను మ్యూజిక్ డైరెక్టర్‌ని కలవడానికి వెళ్తున్నాడని.. దారిలోనే డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నా అని చెబుతుంది అప్పూ. మిమ్మల్ని చూస్తుంటే నాకు జలసిగా ఉందని.. నా మొగుడు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లుగా ఉంటాడని మండిపడుతుంది స్వప్న.

నీకు బిడ్డ ఇచ్చాడుగా సరిపోదా అని రుద్రాణి ఫైర్ అవుతుంది. వీళ్లకి సపోర్ట్ చేసినట్లుగా నా కొడుకుని సపోర్ట్ చేసి ఉంటే ఈపాటికి మహారాజు అయ్యేవాడని అంటుంది రుద్రాణి. ఒకసారి కంపెనీని అప్పగిస్తే ఎంత గొప్పగా పరిపాలించాడో మేం కూడా చూశామని కౌంటర్ వేస్తుంది స్వప్న. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్తున్న కావ్య.. ఇందిరకు ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఎలా వేసుకోవాలో చెప్పి వెళ్తుంది. ఈసారి ఏ రెస్టారెంట్‌కు వెళ్తున్నారో అంటూ రుద్రాణి సెటైర్లు వేస్తుంది. ఈసారి ఆఫీస్‌కే వెళ్తున్నానని.. కావాలంటే నా కారులోనే వచ్చి ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చని కౌంటర్ వేస్తుంది కావ్య.

ఉదయాన్నే రెడీ అయి కళావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. కళావతిని కలిసినప్పటి నుంచి తనెవరో తెలుసుకోవాలని మనసు తహతహలాడిపోతుందని, అది తనతోనే చెప్పిస్తానని అనుకుంటాడు . రాజ్‌తో కలిసి టిఫిన్ చేయాలని వెయిట్ చేస్తుంటుంది యామిని. నాకిప్పుడు ఆకలిగా లేదని నువ్వు తినేశాయ్.. నాకు అర్జెంట్ వర్క్ ఉందని నేను వెళ్లాలని చెబుతాడు రాజ్. ఆ మాటలతో యామిని అతని కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. అయితే యామినిని కూడా తీసుకెళ్లమని చెబుతుంది వైదేహి. తనకి ప్రైవసి కావాలని మొన్న అడిగాడు కదా.. మళ్లీ ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావని మండిపడుతుంది యామిని.

మమ్మీ మాటలు పట్టించుకోవద్దని, నువ్వు ఎక్కడికైనా వెళ్లు.. ఎంతసేపైనా ఉండు అని చెబుతుంది యామిని. కాకపోతే నీకు అక్కడ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఈ చిన్న గుండె తట్టుకోలేదని అంటుంది. ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే వెంటనే ఫోన్ చేయ్ క్షణాల్లో నీ ముందుంటా. నాకు నువ్వు , నీ హెల్త్ మాత్రమే ముఖ్యమని చెబుతుంది యామిని. నన్ను అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి రాజ్ బయటికి బయల్దేరతాడు. ఆ మాటలతో వైదేహి, రఘునాథ్‌లు షాక్ అవుతారు. ఇంతసేపు రాజ్‌తో మాట్లాడింది మన యామినియేనా అని ప్రశ్నిస్తుంది వైదేహి.

ఒక్కరోజులోనే నీలో ఇంత మార్పా? ఆశ్చర్యంగా ఉందని అంటుంది వైదేహి. మీ నాన్న కూడా నువ్విచ్చిన షాక్‌తో నిన్ను అలా చూస్తూ ఉండిపోయారని చెబుతుంది. మగాళ్లని మనదారిలోకి తెచ్చుకోవాలంటే మనమే వాళ్ల దారిలోకి వెళ్లి ప్రేమగా బుజ్జగించాలని అంటుంది యామిని. రామ్‌ని దక్కించుకోవడం కోసం ఏ అనుభవం లేకుండానే యాక్సిడెంట్ చేయించానని , ఎంతో అనుభవంతో నువ్వు చెప్పిన మాటల్ని ఫాలో అవ్వకుండా ఉంటానా అని ప్రశ్నిస్తుంది. నువ్వు చెప్పిన తర్వాత ప్రేమగా అతని దగ్గరికెళ్లి నా కారు కీస్ కూడా ఇచ్చానని చెబుతుంది యామిని.

నా మాటలు విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కానీ తనను అలా ఒంటరిగా వదిలేస్తే అతని ఫ్యామిలీలో ఎవరో ఒకరు చూస్తే ప్రాబ్లమ్ కదా అని అంటుంది వైదేహి. రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలంటే తనతో ఉండాల్సిన అవసరం లేదని, అంటే తనకు తెలియకుండా తన వెనకే ఫాలో అవుతావా అని అడుగుతాడు రఘునాథ్. కారులో జీపీఎస్ పెట్టానని, దానిని నా ఫోన్‌కి కనెక్ట్ చేసుకున్నానని రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎంతసేపు ఉంటున్నాడు? ప్రతి అంశం ఫోన్‌తో తెలుసుకుంటానని చెబుతుంది యామిని. నాకు నష్టం జరుగుతుందని అనిపించేత వరకు రాజ్‌కి నా వల్ల ఏ కష్టం రాదని అంటుంది.

ఆఫీసుకొచ్చిన కావ్యని చూసి ఉద్యోగులంతా షాక్ అవుతారు. రాజ్ సార్‌కి అలా జరిగిందని తెలిసి మేమంతా షాకయ్యామని అంటుంది శృతి. ఆయన లేకపోవడం మీకే కాదు.. మా అందరికీ తీరని లోటేనని, సార్ మాకెప్పుడూ తోడుగా ఉన్నారని మిగతా స్టాఫ్ కూడా రాజ్‌ను పొగుడుతారు. మేం మీకు అండగా ఉంటామని కష్టపడి పనిచేస్తామని కావ్యకి చెబుతారు. ఇది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని అంటుంది కావ్య. నెల రోజులుగా పెండింగ్‌లో ఉన్న వర్క్స్ వెంటనే పూర్తి చేయాలని ఆర్డర్స్ వేస్తుంది కావ్య.

ఆఫీస్ ల్యాప్‌టాప్ చూసి చూడగానే అందులో రాజ్ ఫోటో కనిపించగానే కావ్య బాధపడుతుంది. ఇంతలో శృతి వచ్చి ఫైల్స్ ఇస్తుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉందని పొగుడుతుంది. మీరింత త్వరగా కోలుకుంటారని అనుకోలేదని, ఇంట్లో అందరూ ఇలాగే మాట్లాడుతున్నారని ఆఫీస్‌కి వచ్చానని ఇక్కడ కూడా ఇలాగే మాట్లాడి విసిగించొద్దని మండిపడుతుంది కావ్య. మీ గుండెల్లో ఉన్న బాధని బయటికి రానీయకుండా పైకి నవ్వుతున్నారని శృతి అలాగే మాట్లాడటంతో కావ్య ఫైర్ అవుతుంది.

రాజ్‌ కారుని జీపీఎస్‌లో ట్రాక్ చేస్తుంటుంది యామిని. రాజ్ కారు కావ్య ఆఫీసు వైపు వెళ్తుండటంతో యామిని కంగారు పడుతుంది. అది స్వరాజ్ కంపెనీ కావడంతో అక్కడి వాళ్లంతా రాజ్‌ని గుర్తు పట్టేస్తారని భయపడుతుంది. లోపలికి వెళ్లాలా ? వద్దా? అని రాజ్ కంగారుపడుతుంటాడు. ఇంతలో వాచ్‌మెన్‌కు ఫోన్ రావడంతో అతను పక్కకి వెళ్తాడు. రాజ్ వచ్చిన విషయాన్ని కావ్య సీసీ కెమెరాలో చూసి షాక్ అవుతుంది. ఆయనను స్టాఫ్ చూస్తే పెద్ద ప్రాబ్లమ్ అవుతుందని భయపడుతుంది.

గేటు తీసుకుని లోపలికి వెళ్లబోతున్న రాజ్‌ చేతిని పట్టుకుని కిందకి తీసుకొస్తుంది కావ్య. చెప్పకుండా ఇలా ఆఫీస్‌కి వస్తే ఎలా అని అని అడుగుతుంది కావ్య. నేనొచ్చింది మీ ఆఫీస్‌కి కదా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారని అడుగుతాడు రాజ్. ఇది నా ఆఫీస్ కాదు.. నేను పనిచేస్తున్న ఆఫీస్ అని చెబుతుంది కావ్య. సడెన్‌గా ఆఫీసుకు ఎందుకొచ్చారని కావ్య అడగ్గా.. రాజ్ సిగ్గు పడుతుంటాడు. మరోవైపు రాజ్ కోసం యామిని తన కారులో అక్కడికి బయల్దేరుతుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X