Brahmamudi April 11th Episode: రేఖ ఆశలపై నీళ్లు.. ఇందూని కిడ్నాప్ చేసిన స్వరాజ్- లక్కీ

Photo Courtesy: JioHotstar

ఇందూ గారితో అందరిముందు ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయించుకుంటే దానిని వీడియో తీసి ఆధారంలా పెట్టుకోమని రేఖకు లాయర్లు చెబుతారు. అంత భయపడాల్సిన అవసరం లేదు, మా రేఖని ఎదిరించి ఇందూ బతకలేదని చెబుతుంది భ్రమరాంబ. ఇంతలో రేఖకి మీడియాకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీరు ఇందూగారితో బలవంతంగా ఆస్తి రాయించుకోబోతున్నారని, దానిని ఆపమని దుగ్గిరాల వారి నిలయం నుంచే ఫోన్ వచ్చిందని చెబుతాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. వెంటనే మీడియా వాళ్లెవరూ ఇటువైపు రాకుండా చేయమని చెబుతుంది రేఖ.

అపర్ణ, సుభాష్‌ల దగ్గరికి వెళ్లిన రేఖ.. కోపంతో ఊగిపోతుంది. మనవరాలి చేతిలో ఆస్తిని పెట్టడానికి మీడియాకి నా మీద కంప్లయంట్ చేస్తావా అని సీరియస్ అవుతుంది. మీడియాకు ఫోన్ చేసింది నేను.. వాళ్లకు ఏం తెలియదని సుభాష్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేనంటే భయం పోయింది.. ఇంత తప్పు చేశాక మీరు బతకకూడదని రేఖ అంటుంది. దాంతో నేను సంతకం పెడతాను, మా నానమ్మ- తాతయ్యలని వదిలేయమని చెబుతుంది ఇందూ. కేక్ కట్ చేసిన ఇందూ.. దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఆస్తి, కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్నీ రేఖ ఆంటీకి అప్పగిస్తున్నట్లు అందరి ముందు చెబుతుంది. దాంతో సుభాష్, రేఖలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్ 1004లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 11th 2026 Episode 1004 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేఖ కోసం ఇందూ సంతకం పెట్టేస్తుండటం.. ఎంతకూ స్వరాజ్ కిడ్నాప్ చేయకపోవడంతో ఐశ్వర్య సీరియస్ అవుతుంది. నీ వల్ల నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యేలా ఉంది? నీ వల్ల కాదు అని చెబితే నేను మరొకరిని చూసుకునే దానిని కదా అంటుంది. మేం ఏది కావాలని చేయలేదు.. అయినా ఇప్పుడు ఏమైంది? ఇంకా ఇందూ సంతకం పెట్టడం పూర్తి కాలేదు కదా? ఇందూ సంతకం పెట్టదు, మేం అనుకున్నది పూర్తి చేస్తామని చెబుతాడు స్వరాజ్. ఇంతలో లాయర్లు ఆస్తి పేపర్లు తీసుకురావడంతో ఇందూ, అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. లాయర్లు సంతకం చేయమని చెబుతుండగా.. మా ఇందూ చదువుకోలేదు, ఆమె సంతకం పెట్టదని చెబుతుంది భ్రమరాంబ.

అది విన్న గెస్ట్‌లంతా షాక్ అవుతారు. ఇన్ని కోట్లకు వారసురాలు అయ్యుండి.. సంతకం పెట్టే చదువులేదా అని అడుగుతారు. చిన్నప్పటి నుంచి తనను చదివించడానికి చాలా ట్రై చేశాం.. తనకి చదువు అబ్బలేదని చెబుతాడు భూషణ్. అయినా కోట్లుండగా చదువుతో పనేంటీ? మీరంటున్న ఆ చదువుకున్న వాళ్లే.. ఫ్యూచర్‌లో తన కింద పనిచేస్తారని చెబుతుంది ఇందూ. సంతకం లేకపోతే ఏంటీ? వేలిముద్రలు వేయించుకుందామని చెబుతుంది భ్రమరాంబ.

ఇందూ మేడంని ఎలా కిడ్నాప్ చేద్దామా అని బంటీ- బబ్లూలు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లంతా మత్తులో పడిపోగానే.. మేడంని స్టేజ్ మీద నుంచి తీసుకెళ్లిపోదామని అనుకుంటారు. సరిగ్గా ఇందూ వేలిముద్రలు వేస్తుండగా స్వరాజ్ స్మోక్ బాంబు విసురుతాడు. అక్కడి పొగకి అందరూ మత్తులో పడిపోతారు. ఆ వెంటనే ఇందూని స్వరాజ్ కిడ్నాప్ చేస్తాడు. ఆమెను కారు ఎక్కిస్తుండగా.. బ్యాగ్ తెచ్చుకుంటుంది ఇందూ. ఇదేమీ అర్ధంకాక స్వరాజ్- లక్కీలు షాక్ అవుతారు. అందరూ వచ్చేస్తారని కారులో ఎక్కి కూర్చొంటుంది ఇందూ. మన స్మోక్ దెబ్బకి ఈ అమ్మాయికి మైండ్ దొబ్బినట్లుగా ఉందని అనుకుంటారు. ఈరోజే నాకు స్వేచ్ఛ దొరికింది.. రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోతానని చెబుతుంది ఇందూ. మీరు నన్ను కిడ్నాప్ చేశారని నాకు తెలుసు.. అక్కడ స్మోక్ స్టార్ట్ కాగానే చున్నీ అడ్డుపెట్టుకున్నానని ఇందూ చెబుతుండగా ఆమెకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేస్తాడు స్వరాజ్.

మత్తులోంచి లేచిన శేషం.. పార్టీలో అందరూ పడిపోయి ఉండటం చూసి షాకై అందరినీ లేపుతాడు. బంటీ- బబ్లూలకు ఇందూ కనిపించకపోవడంతో భయపడి పారిపోతారు. ఇందూ అక్క సక్సెస్‌ఫుల్‌ కిడ్నాప్ అయ్యిందని అనుకుంటుంది స్వాతి. ఇంతలో ఐశ్వర్య పరిగెత్తుకుంటూ వచ్చి ఇందూని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం చూశానని చెబుతుంది. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇందూని ఇద్దరు బలవంతంగా కారులో వేసుకుని వెళ్తున్నారని చెబుతుంది ఐశ్వర్య. మన ఆశలు గల్లంతయ్యాయి, ఆస్తి చేజారిపోయిందని భ్రమరాంబ ఏడుస్తుంది. నా ఇంటికొచ్చి, నా కళ్ల ముందే ఇందూని కిడ్నాప్ చేసేంత ధైర్యం ఎవరికుంది? అసలు ఎవడు వాడు? అని రగిలిపోతుంది రేఖ.

ఇందూని కుర్చీకి కట్టేస్తారు స్వరాజ్- లక్కీ. కిడ్నాప్ అంత ఈజీ అనుకోలేదు.. చాలా సింపుల్‌గా చేశామని చెబుతాడు లక్కీ. అక్కడ మనల్ని ఎవరూ చూడలేదు కాబట్టి మనం సేఫ్ .. కానీ ఇందూ మనల్ని గుర్తుపడితే జైళ్లో పడాల్సిందేనని లక్కీతో చెబుతాడు స్వరాజ్. నువ్వు చిన్న డ్యాష్ ఇస్తేనే నీకు చుక్కలు చూపిస్తుంది.. స్పృహలోకి వస్తే నీ సంగతి చెబుతుందని అంటాడు లక్కీ. ఇందూని సేఫ్‌గా లాక్ చేసేస్తారు. ఇంతలో ఐశ్వర్య ఫోన్ చేసి.. రేఖ ఆంటీని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు అడగమని చెబుతుంది. కిడ్నాప్ చేసిన వెంటనే ఫోన్ చేయకూడదు.. ఇదంతా ఎవరు చేశారు? మా అమ్మాయి ఏమైందోనని కంగారుపడుతుండగా ఫోన్ చేస్తే భయం ఎక్కువగా ఉంటుందని చెబుతాడు కార్తీక్.

డబ్బులు ఎంత అడగాలని రాజ్ ప్రశ్నించగా.. ఒక 20 లక్షల రూపాయలు అడుగుదామని చెబుతుంది. మనల్ని తక్కువగా అంచనా వేయకూడదంటే కోటి రూపాయలు అడుగుదామని అంటాడు రాజ్. అయితే ఫిఫ్టీ.. ఫిఫ్టీ అని డీల్ కుదుర్చుకుంటారు స్వరాజ్- ఐశ్వర్య. మరోవైపు.. ఇందూని ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక రేఖ టెన్షన్ పడుతుంటుంది. ఇంటికి పోలీసులను పిలిపించి ఎంక్వైరీ చేయిస్తుంది. అంత ధైర్యంగా.. చుట్టూ ఇంతమంది ఉండగా అంత తెలివిగా ఇందూని ఎలా కిడ్నాప్ చేశారో అర్ధం కావడం లేదని ప్రశ్నిస్తుంది రేఖ. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని పోలీసులు అడగ్గా.. అనుమానం ఉంటే వాళ్ల దగ్గరికే వెళ్తామని చెబుతాడు భూషణ్.

మాకు తెలిసినంత వరకు ఎవరి మీదా అనుమానం లేదని చెబుతుంది రేఖ. ఎవరి వల్లయినా మాకు ప్రమాదం ఉండదు.. మా వల్లే ఎవరికైనా ప్రమాదం ఉంటుందని చెబుతాడు శేషం. నువ్వు నోరు మూసుకోమని చెబుతుంది భ్రమరాంబ. ఇందూ కిడ్నాప్ అయ్యిందనా? సంతకం పెట్టలేదనా? ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నిస్తాడు శేషం. ఇందూ ఎక్కడున్నా ఎలాగైనా పట్టుకోమని చెబుతుంది రేఖ. శత్రవులు లేరు, అనుమానించే వాళ్లు లేరు, పోనీ కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారనుకుంటే మీ ఫ్యామిలీ గురించి వాళ్లకు అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? కిడ్నాప్ చేసినవాళ్లు ఎవరో? మీకు బాగా తెలిసినవాళ్లు అయ్యుంటారని అంటారు పోలీసులు. ఆ మాటలతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. మాకు తెలిసినవాళ్లలో ఎవరైనా ఈ కిడ్నాప్ చేయించారని అంటున్నారా అని అడుగుతుంది రేఖ. ఇందూ మేడంకి ఈ ఆస్తికి సంబంధించిన మొత్తం పవర్స్ వస్తున్నాయని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మాత్రమే తెలుసు.. మరి ఆ విషయం కిడ్నాపర్లకు ఎలా తెలుస్తుందని పోలీసులు ప్రశ్నిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X