Brahmamudi April 12th episode: అనామిక అంటే ఇష్టం లేదంటున్న కళ్యాణ్.. అత్త ని నోరు ముయ్యమన్న స్వప్న!
రాజ్‌పై తల్లికి భార్య కి అనుమానాలు పెరిగిపోయాయి. రుద్రాణి తన కొడుకును కంపెనీ ఓనర్ చేయాలని ప్లాన్ వేసింది. రాజ్ కళ్యాణ్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటంతో కంపెనీకి ఎండి అవుతాడు కళ్యాణ్. రాజ్ చేసిన పనికి అపర్ణని సూటికోటి మాటలు అంటూ ఉంటారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. వెన్నెలని పట్టుకునే ప్రయత్నంలో శ్వేత సహాయం తీసుకుంటుంది కావ్య. భార్య పడుతున్న అవమానాలు భరించలేక ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు రాజ్. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు అంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్ 382 లో ఏం జరిగిందంటే..
ఇంటికి వచ్చిన భర్త పై చేతులు వేసి ఇన్నాళ్లు దూరంగా ఉంచింది చాలు ఇకమీదట నేనే మీ దగ్గరికి వస్తాను అంటుంది అనామిక. ఇన్నాళ్ళు దూరం పెట్టి ఇప్పుడు దగ్గరికి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు కళ్యాణ్. అనామిక ఏమి మాట్లాడకపోవడంతో నన్ను చెప్పమంటావా అంటూ నీ భర్త కవిగా ఉండటం ఇష్టం లేదు నీ భర్త ని బిజినెస్ మ్యాగ్నెట్ గా చూడాలనుకున్నావు.

కానీ నాకు ఈ అనామిక ఇష్టం లేదు, ఒక కవిగా నన్ను ప్రేమించిన నా ప్రేయసి అనామిక మాత్రమే ఇష్టం. కేవలం హోదాని కోరుకునే ఈ అనామిక నాకు ఇష్టం లేదు అందుకే నేను ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు నీ దగ్గరికి వస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఎలాగైనా నిన్ను నా దారికి తెచ్చుకొని కీలుబొమ్మని చేస్తాను అనుకుంటుంది అనామిక. మరోవైపు ఇంటికి వచ్చిన భర్తని అవమానకరంగా మాట్లాడుతుంది స్వప్న.
అదే విషయాన్ని తల్లితో చెప్తే ఆఫీసుకు వెళ్లి లిప్స్టిక్ ల గురించి పెర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడితే పెళ్ళాలు అలాగే మాట్లాడతారు అంటుంది రుద్రాణి. మీ తాత దాని పేరు మీద ఆస్తి రాసాడు ముందు ఆ ఆస్తిని మనం దక్కించుకునేలా చూడాలి అంటుంది. మరోవైపు శ్వేత రాజ్ కి ఫోన్ చేసి టెన్త్ క్లాస్ రీ యూనియన్ గురించి చెప్తుంది. టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ని కలవడం ఇష్టం లేదు నేను రాను అంటాడు రాజ్. అదే విషయం కావ్య కి ఫోన్ చేసి చెప్తుంది శ్వేత.
వదిలిపెట్టద్దు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈయన నెంబర్ ఇచ్చి వాళ్ళందరినీ ఫోన్ చేయమని చెప్పు అంటుంది కావ్య. మంచి ఐడియా అంటూ ఫోన్ పెట్టేస్తుంది శ్వేత. ఆ తర్వాత రాజ్ కి ఫ్రెండ్స్ దగ్గర నుంచి వరుస పెట్టి కాల్స్ రావడంతో చేసేదిలేక రీ యూనియన్ కి రావడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు ఇంటికి అపర్ణ ఫ్రెండ్ శకుంతల వస్తుంది. అందర్నీ పలకరించిన తర్వాత కొడుకుతో కిందకి వస్తున్న రాజ్ ని చూసి అదేమిటి నీకు మనుమడు పుట్టాడా నాకు చెప్పనేలేదు అంటుంది.

నార్మల్ డెలివరీ ఏనా అని కావ్యని అడుగుతుంది. ఆ ప్రశ్న రాజ్ ని అడగాలి అంటుంది రుద్రాణి. అదేంటి డెలివరీ అయిన అమ్మాయిని కదా అడగాలి అంటుంది శకుంతల. కానీ ఇప్పుడు మాత్రం రాజ్ నే అడగాలి అదే మ్యాజిక్ అంటుంది రుద్రాణి నాకు ఏమీ అర్థం కాలేదు అంటుంది శకుంతల. రుద్రాణి ఏదో మాట్లాడబోతుంటే ఆమెని వారించి ఆవిడ జోక్స్ వేస్తున్నారు మీకు ఇంకా అర్థం కాలేదా అంటూ నాకు నార్మల్ డెలివరీ అయింది అని చెప్తుంది కావ్య. రుద్రాణి ఇంకా మారలేదు అంటుంది శకుంతల.
ఆవిడ మారదు అంటుంది స్వప్న. సరే నా కొడుకు పెళ్లికి తప్పకుండా రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శకుంతల. ఆ తర్వాత అపర్ణ రుద్రాణిని మందలిస్తుంది, ఇంటిగుట్టు బయట పెట్టడానికి చూస్తావ్ ఏంటి అంటుంది. తిన్నంటివాసాలు లెక్కబెడతావేంటి ఆ మాత్రం విశ్వాసం లేదా అంటుంది చిట్టి. విశ్వాసం గురించి రుద్రాణి దగ్గర మాట్లాడుతున్నావా అని వెటకారంగా మాట్లాడుతాడు ప్రకాష్.

పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని వేరే ఎవరికో బిడ్డని కని ఇక్కడికి తీసుకు వస్తే నీ కొడుకుని ఏమీ అనటం లేదు కానీ నన్ను మాత్రం అంటున్నారు, అయినా కావ్య కూడా తనే ఏదో నొప్పులు పడి బిడ్డని కన్నట్టు అలా అబద్దం చెప్పేసింది తనని కూడా ఏమీ అనట్లేదు అంటుంది రుద్రాణి. రోజు మూడు పూటలా వండి పెడుతున్నా గడ్డి తింటున్నట్లు మాట్లాడుతున్న మిమ్మల్ని కూడా ఈ కుటుంబం ఏమి చేయలేదు, ఇంటిగుట్టు ఎక్కడ బయట పడుతుందో అని తను అలా మాట్లాడింది అంటుంది స్వప్న.
ఆ మాటలకి కోపంతో షట్ అప్ అంటుంది రుద్రాణి.స్వప్న కూడా అత్త ని నోరు ముయ్యమంటుంది. చెల్లెల్ని వెనకేసుకు రావద్దు, భర్త వేరొకరితో బిడ్డని కని ఇంటికి తీసుకువస్తే నిలదీయడం మానేసి సేవలు చేస్తుంది అంటే ఆమెకి కావలసింది డబ్బు మాత్రమే అంటుంది ధాన్యలక్ష్మి. ఈ మాటలు అన్నీ వింటున్న రాజ్ ఇంక ఆపండి తప్పు చేసింది నేను నన్ను ఏమైనా అనండి అంతేగాని కళావతి ని ఏమి అనొద్దు అంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











