Brahmamudi April 13th Episode: ఇందూకి షాక్.. కిడ్నాపర్లని కనిపెట్టిన రేఖ, దుగ్గిరాల నిలయంలోకి నందూ ఎంట్రీ

Photo Courtesy: JioHotstar

ఇందూతో కేక్ కట్ చేయించిన అనంతరం ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు వేయించుకుంటూ ఉండగా ఎలా కిడ్నాప్ చేయాలా? అని ఆలోచిస్తుంటాడు రాజ్. ఆ వెంటనే స్మోక్ బాంబు విసరగా.. లక్కీ గెస్ట్‌ల మొత్తానికి స్మోక్ వదులుతాడు. అందరూ మత్తులో పడిపోగానే ఇందూని తీసుకుని వెళ్లిపోతారు రాజ్- లక్కీ. ఇందూ బయటకు వెళ్లగానే లగేజ్ బ్యాగ్ తెచ్చుకోవడంతో వాళ్లిద్దరికీ ఏం అర్ధం కాదు. ఇందూకి మత్తు మందు ఇచ్చి తమ డెన్‌కి తీసుకెళ్తారు లక్కీ- స్వరాజ్.

మత్తులోంచి లేచిన శేషం.. అందరూ పడిపోవడం చూసి ఒక్కొక్కరిని లేపుతాడు. ఇంతలో ఐశ్వర్య వచ్చి ఇందూని ఎవరో ఇద్దరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా చూశానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఐశ్వర్యకి రాజ్ ఫోన్ చేసి రేఖ నుంచి కోటి రూపాయలు కొట్టేస్తానని చెబుతాడు. ఇందూ కనిపించకపోవడంతో పోలీసులను ఇంటికి పిలిపించి ఎంక్వైరీ చేయిస్తుంది రేఖ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్ 1005లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 13th 2026 Episode 1005 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూ కిడ్నాప్ కావడంతో పోలీసులు ఇంటికొచ్చి విచారణ చేస్తారు. ఇదంతా మీ ఇంట్లో వాళ్ల పనేనని తేలుస్తారు పోలీసులు. ఇందూ మేడకి పవర్స్ వస్తున్నాయని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పించి ఎవరికీ తెలియదు? మీరు ఫాంహౌస్‌లో బర్త్ డే పార్టీ ఎప్పుడు ప్లాన్ చేశారని అడుగుతారు పోలీసులు. నిన్నే అనుకున్నామని చెబుతుంది రేఖ. మీరు డిసైడ్ అయితే 24 గంటలు కూడా గడవలేదు.. అలాంటప్పుడు ఆ కిడ్నాపర్లు అంత పక్కగా కిడ్నాప్ ఎలా చేశారు? అని పోలీసులు ప్రశ్నిస్తారు. ఆ మాటలతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. ఇందూ కిడ్నాప్ అయిన విషయం పబ్లిక్‌గా అనౌన్స్ చేయాలి, అన్ని న్యూస్ ఛానెల్స్‌లోనూ న్యూస్‌గా రావాలని చెబుతారు పోలీసులు. అయితే వెంటనే అలా చేయమని అపర్ణ అడుగుతుంది. మీరు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లయంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెబుతారు పోలీసులు. కానీ దానికి రేఖ ఒప్పుకోదు.

కంప్లయంట్ ఇవ్వడానికి నీకేంటీ ప్రాబ్లమ్.. ఇందూ తిరిగి రావడం నాకు ముఖ్యమని చెబుతుంది అపర్ణ. ఇలాంటి విషయాలు పబ్లిక్ అయితే కంపెనీలో చాలా ఇష్యూస్ వస్తాయి. షేర్స్ పడిపోయే ప్రమాదం ఉంది, నా కోసం సీక్రెట్‌గా వెతకమని చెబుతుంది రేఖ. పోలీసులు సరేనని చెబుతారు. కంపెనీ గురించి ఆలోచించి నా మనవరాలిని రిస్క్‌లో పెడతావా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. నీ మాటల్ని బట్టి చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది.. నీ గురించి అందరికీ తెలిసిపోతుందని, నీకు ఆస్తి రాదని ఇలా చేస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఎంతలో ఉండాలో అక్కడి వరకు ఉండమని వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఇందూ గురించి ఏమైనా తెలిసిందా అని సుభాష్ అడగ్గా.. పోలీస్ కంప్లయంట్ ఇవ్వకుండా, దొంగని పట్టుకున్నట్లుగా సీక్రెట్‌గా వెతకమని చెప్పిందని అంటుంది అపర్ణ. వీళ్లు మనుషులు కాదు.. డబ్బు కోసం రక్తం తాగే రాక్షసులని బాధపడతాడు సుభాష్. ఎంతో రిస్క్ చేసి మీడియా వాళ్లకు కంప్లయంట్ చేశాను, కానీ ఇందూనే కనిపించకుండా చేశాడని కంటతడి పెడతాడు.

త్వరలో తనకు లక్షల్లో డబ్బు వస్తుందని సంతోషపడుతుంటాడు రాజ్. ఇంతలో తండ్రి ఫోన్ చేసి ఎక్కడ చచ్చావంటూ సెటైర్లు వేస్తాడు. ఆ సాహూ బిజినెస్ పనిమీద తిరుగుతున్నానని చెబుతాడు. చిన్నోడిలా నువ్వు పద్ధతిగా ఉంటే 100 పర్సెంట్ నమ్మేవాడిని అంటాడు తండ్రి. ఆ సాహూ మళ్లీ ఇంటికొచ్చాడా అని రాజ్ అడుగుతాడు. వాడు నిన్ను కలవకుండా నన్నెందుకు కలుస్తారంటూ సెటైర్లు వేస్తాడు చలపతి. నా పనులన్నీ అవ్వగానే ఇంటికొస్తానని చెబుతాడు రాజ్.

ఇంతలో లక్కీ వచ్చి ఇందూ కనిపించడం లేదని చెప్పడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. ఇళ్లంతా వెతికినా ఇందూ కనిపించకపోవడంతో ఇద్దరూ టెన్షన్ పడుతుండగా ఇందూ వస్తుంది. మీరిద్దరి కామెడీ ఫేస్‌లు చూసి నన్ను సరిగా కిడ్నాప్ చేస్తారో లేదోనని అనుకున్నాం. కానీ బాగా చేశారని మెచ్చుకుంటుంది ఇందూ. ఆ మాటలకు లక్కీ, స్వరాజ్‌లు షాక్ అవుతారు. మీరే కిడ్నాప్ చేశారు కానీ, ప్లాన్ నాదే అంటుంది ఇందూ. తనకి చిప్ దొబ్బిందా ఏంటీ? తను కిడ్నాప్ చేయమని చెప్పడం ఏంటీ అనుకుంటారు లక్కీ, స్వరాజ్. ముందు నేను ఎక్కడున్నానో నా చెల్లికి కాల్ చేసి చెప్పాలని ఫోన్ ఇవ్వమని ఇందూ అడగ్గా.. ఫోన్ ఉండకూడదని బయట విసిరేశామని చెబుతారు. దాంతో ఇందూ సీరియస్ అవుతుంది.

నేను వెళ్తానని ఇందూ బయల్దేరుతుండగా.. స్వరాజ్- లక్కీలు ఆపేస్తారు. నిన్ను కిడ్నాప్ చేసింది డబ్బులు వసూలు చేయడానికి అని చెబుతాడు స్వరాజ్. మీరు బంటీ- బబ్లూ పంపించిన మనుషులు కాదా అని ఇందూ ప్రశ్నిస్తుంది. వాళ్లు కిడ్నాప్ చేయడానికి వచ్చారా అని రాజ్ అడుగుతాడు. వాళ్లని అలా గెటప్స్ వేసుకురమ్మని చెప్పిందే నేను అంటుంది ఇందూ. నువ్వు అనుకున్న వాళ్లం మేం కాదు.. మేము ఒరిజినల్ కిడ్నాపర్స్ అని చెబుతాడు రాజ్. ఇందూ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఇందూని పట్టుకుని కట్టేస్తాడు స్వరాజ్.

మీ అక్క ఇందూ కిడ్నాప్ అయ్యిందని పోలీస్ బాబాయ్ చెప్పడంతో నందూ షాక్ అవుతుంది. ఆ రేఖ గారు ఎస్ఐని పిలిచి కంప్లయంట్ ఇవ్వకుండా వెతకమని చెప్పారని అంటాడు బాబాయ్. ఆ రేఖ ఇంకా మారలేదు, తన స్వార్ధం తను చూసుకుంటుంది.. అక్కని నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది నందూ. నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ కావొద్దు.. అది పెద్ద క్రైమ్ అని చెబుతాడు బాబాయ్. నాకు బదులుగా నువ్వు వెతుకమని చెబుతుంది నందూ. అక్క చుట్టూ అంతా శత్రువులే.. కానీ ఇప్పుడు అక్కని వదిలేయలేనని అంటుంది. రేఖ కాకుండా అక్కకి కొత్త శత్రువు ఎవరు? అని ఆలోచిస్తుంది నందూ.

పార్టీ వీడియో చూస్తూ ఇందూని కిడ్నాప్ చేసిన వాళ్లని వెతుకుతుంది రేఖ. ఆ ముసలోళ్లతో కలిసి ఇందూ నా వెనుకే గోతులు తవ్వుతోందని భూషణ్‌కి చెబుతుంది రేఖ. దాంతో సుభాష్‌ని ఈడ్చుకుని బయటకు తీసుకొస్తాడు భూషణ్. మీ ముగ్గురు కొత్త కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడుతుంది రేఖ. ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టే ముందు వరకు మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. ఎన్ని డ్రామాలు ఆడారు.. నన్నే నమ్మించేశారు, మీకు మీరే కిడ్నాప్ చేయించుకుని నన్నే బ్లాక్‌మెయిల్ చేస్తే నేను కనిపెట్టలేరని అనుకున్నావా అని మండిపడుతుంది రేఖ. మీకు మామూలు తెలివితేటలు లేవు.. మా వెనుక పిల్లుల్లా తిరుగుతూ, మాకే టోపీ పెట్టాలని చూస్తారా అంటూ భ్రమరాంబ ఫైర్ అవుతుంది. మీకు చేతకాకపోతే నేనే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లయంట్ ఇస్తాను, అవసరమైతే మీడియా ముందుకు కూడా వెళ్తానని చెబుతుంది అపర్ణ. వీళ్ల డ్రామాలకి నేనే ఫుల్‌స్టాప్ పెడతానని చెబుతుంది రేఖ. ఇంతలో నందూ ఎంట్రీ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X