Brahmamudi April 13th episode: పోలీస్ సెలక్షన్ లో ఫెయిల్ అయిన అప్పు.. కోడల్ని కాకాపడుతున్న రుద్రాణి!
రాజ్ కళ్యాణ్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటంతో కంపెనీకి ఎండి అవుతాడు కళ్యాణ్. రాజ్ చేసిన పనికి అపర్ణని సూటికోటి మాటలు అంటూ ఉంటారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. వెన్నెలని పట్టుకునే ప్రయత్నంలో శ్వేత సహాయం తీసుకుంటుంది కావ్య. భార్య పడుతున్న అవమానాలు భరించలేక ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు రాజ్. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు అంటుంది కావ్య. అప్పు పోలీస్ సెలక్షన్ కి సెలెక్ట్ కాకపోవటంతో చాలా బాధపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్ 383 లో ఏం జరిగిందంటే..
తప్పు చేసింది నేను, నన్ను ఏమైనా అనండి అంతేకానీ కళావతిని ఏమీ అనొద్దు, ఇంటి పరువు పోకూడదని తను అబద్ధం చెప్పింది అంతేకానీ ఆస్తి కోసం కాదు, ఆ విషయం నా మనసుకు తెలుసు. స్వప్నకి ఆస్తి రాసి ఇచ్చిన తాతయ్య కావ్య అడిగితే ఈ ఇల్లే రాసి ఇచ్చేస్తారు అప్పుడు నువ్వు కూడా నాలాగే ఇంట్లో గెస్ట్ గా ఉండాల్సి వస్తుంది అని రుద్రాణిని మందలించి వెళ్ళిపోతాడు రాజ్. ఇదంతా నీ వల్లే వాడికి నువ్వు సపోర్ట్ చేసి ఉండకపోతే ఈరోజు వాడికి ఇలా మొండికేసేవాడు కాదు.

ఈరోజు చూడు వాడు నిజం చెప్పడం లేదు అని కావ్యని మందలిస్తుంది అపర్ణ. ఆయన చెప్పకపోయినా నిజం అనేది ఏదో ఒక రోజు బయటికి వస్తుంది అంటుంది కావ్య. మరోవైపు ఏదో కవర్ వచ్చిందని అప్పుకి లెటర్ తీసుకువచ్చి ఇస్తాడు ఆమె తండ్రి. పోలీస్ సెలక్షన్స్ ది అయి ఉంటుంది నాన్న అని చెప్పి ఆనందంగా కవర్ ఓపెన్ చేస్తుంది. పోలీస్ సెలక్షన్స్ లో ఫెయిల్ అయినట్లు ఆ లెటర్ లో ఉంటుంది.
అదే విషయం తల్లిదండ్రులకి చెప్పి నేను దురదృష్టవంతురాలిని అనుకుంటూ అక్కడ నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. దానికి భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉన్నాడు అది నా కడుపున పుట్టడమే పాపం. నా ఇద్దరు కూతుర్లు నా నుంచి దూరమయ్యాకే ఆనందంగా ఉన్నారు. దీనికి పెళ్లి చేస్తానంటే ఒప్పుకోవటం లేదు అని బాధపడుతుంది కనకం. మరోవైపు భార్య దగ్గరికి వచ్చిన రాజ్ ఆమెని రీ యూనియన్ పార్టీకి పిలవటానికి మొహమాటపడుతూ ఉంటాడు.

విషయం అర్థం చేసుకున్న కావ్య ముసి ముసిగా నవ్వుకుంటుంది ఇంతలోనే శ్వేత ఫోన్ చేస్తుంది. పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. నేను రాను అంటుంది కావ్య. నటించింది చాలు ఎక్కువగా లాగొద్దు వాడు అసలే మొండి మొగుడు, రాకపోయినా పర్వాలేదు అని వాడొక్కడే వచ్చేస్తే మన ప్లాన్ పాడవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రావడానికి ఏమైంది అందరూ భార్యలతో వస్తున్నారు కానీ భార్యని బ్రతిమాలుకుంటాడు రాజ్.
నేను ఏ హోదాలో రావాలి మొదటి భార్య గానా, రెండో భార్య గానా అంటూ భర్తతో కాసేపు వాదిస్తుంది ఆఖరికి రావటానికి ఒప్పుకుంటుంది. ప్లాన్ సక్సెస్ అయినందుకు మనసులోనే ఆనందపడుతుంది. మరోవైపు ప్లే గ్రౌండ్ లో కలుసుకుంటారు అప్పు, కళ్యాణ్. పోలీస్ సెలక్షన్ లో ఫెయిల్ అయినందుకు సారీ అంటాడు కళ్యాణ్. దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటుంది అప్పు. పెళ్లి చేసుకో అంటాడు కళ్యాణ్.

ఇష్టం లేని పని చేయలేను ఆడదానిగా పుట్టడమే పెద్ద తప్పు ఉంటుంది అప్పు. మగాడిగా పుట్టి నేను మాత్రం ఏం సాధించాను. అన్నయ్య కోసం ఆఫీసుకు వెళ్తున్నాను భార్య కోసం పని చేస్తున్నాను అంటాడు కళ్యాణ్. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అంటుంది అప్పు. మరోవైపు రుద్రాణి జ్యూస్ లో మత్తు మందు కలిపి కోడలికి ఇచ్చి ఆమె వేలిముద్ర తీసుకొని ఆస్తి కాజేయాలి అనుకొని మత్తు మందు కలిపిన జ్యూస్ తీసుకుని కోడలి దగ్గరకి వెళ్తుంది.
మీరేమిటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఇదంతా నా వెనుక ఉన్న ఆస్తి కోసమేనా అంటుంది స్వప్న. తుచ్ఛమైన ఆస్తి కోసం వారసుడిని వదులుకుంటామా అంటూ ఓవరాక్ట్ చేస్తుంది రుద్రాణి. అత్తని కసురుకొని బయటికి పంపించేస్తుంది స్వప్న. ఈవిడెంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది స్వప్న. మరోవైపు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కావ్య.

నేనంటే ఇష్టం లేక నా భర్త వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నారా లేదంటే నన్ను వదిలించుకోవడానికి బిడ్డలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారా అనేది ఈరోజు తెలుస్తుంది. ఒకవేళ ఆ బిడ్డ ఆయన బిడ్డ అని తెలిస్తే మాత్రం ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవుతుంది నాకు సాయం చేయవద్దు కానీ న్యాయం చెయ్యు అని ఆ కృష్ణమూర్తిని వేడుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











