Brahmamudi April 14th Episode : అత్తగారి కన్నీటికి కరిగిపోయిన కావ్య.. రాజ్‌ను చూపిస్తానని హామీ

తనను కలిసేందుకు ఆఫీస్‌కు వచ్చిన రాజ్‌ను గమనించిన కావ్య పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు తీసుకెళ్తుంది. కావ్యతో ఏం మాట్లాడాలో తెలియక అటు ఇటూ దిక్కులు చూస్తుంటాడు రాజ్. నాకు గతం గుర్తులేదని, మీరు నాకు బాగా పరిచయమైన వ్యక్తిలా ఉన్నారని? మన మధ్య ఎలాంటి బంధం ఉందో చెప్పమని అడుగుతాడు రాజ్. భర్త మాటలకు సమాధానం చెప్పలేక ఏడుస్తూ వెళ్లిపోతుంది కావ్య. జీపీఎస్ లోకేషన్ ఆధారంగా రాజ్‌ను వెతుక్కుంటూ స్వరాజ్ గ్రూప్ కంపెనీ దగ్గరికి వస్తుంది యామిని. రాజ్ కారు బయటే ఉండటంతో లోపలికి వెళ్లాడని భయపడి తను కూడా లోపలికి వెళ్తుంది.

ఆఫీసులో శృతి ఆమెను ఎవరు కావాలని అడుగుతుండగా.. తన కారు వద్ద యామిని కారు చూసిన రాజ్, ఆమెకు ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్ కోసం వెళ్తుండగా నీ కారు కనిపించడంతో ఆగానని నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని రాజ్‌తో అంటుంది యామిని. అపర్ణ పుట్టినరోజు చేయాలని అనుకుంటున్నామని ప్రకాశం చెప్పగా.. రాజ్ లేనప్పుడు అలాంటివి కరెక్ట్ కాదని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో భోజనం కూడా చేయకుండా వెళ్లిపోయిన అపర్ణని చూసి బాధపడుతుంది అప్పూ. ఇదంత గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 14వ తేదీ ఎపిసోడ్ 695లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 14th 2025 Episode 695 Here is Today s full story

క్లయింట్స్ బిల్స్ క్లియర్ చేయకపోవడంపై మేనేజర్‌ను నిలదీస్తుంది కావ్య. మన ప్రాబ్లమ్స్ మన క్లయంట్స్ వరకు వెళ్లకూడదని అంటుంది. ఆఫీసు నుంచి కావ్య వచ్చేసరికి అప్పూ బాధపడుతూ ఉంటుంది. పెద్ద అత్తయ్య గారి పరిస్ధితి ఏం బాలేదని, ఎప్పుడూ బావ గురించే ఆలోచిస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందని చెబుతుంది అప్పూ. బావని ఎప్పటికైనా ఇంటికి తీసుకొస్తానన్న నమ్మకంతో నువ్వుంటే , నిజం తెలియని అత్తయ్యగారు మాత్రం రోజురోజుకు కృంగిపోతున్నారని.. తిండి తినడం లేదు, నిద్రపోవడం లేదని అంటుంది. ఇలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయం వేస్తుందని చెబుతుంది.

నాకు కూడా తెలుసని కానీ ఆయనను తిరిగి తీసుకురావడానికి టైం పడుతుందని అంటుంది కావ్య. అప్పటి వరకు ఆవిడని అలాగే వదిలేయలేమని , ఆమెను చూసి బావ బతికే ఉన్నారని చెప్పేయాలని అనుకున్నానని కానీ నిన్ను అడగకుండా చెప్పడం కరెక్ట్ కాదని అంటుంది అప్పూ. రేపు అత్తయ్య పుట్టినరోజు.. ప్రతి ఏడాది బావగారు అన్నదానం చేస్తారట కదా. అలాగే ఈ సంవత్సరం కూడా చేద్దామని ప్రకాశం మావయ్య అంటే నా కొడుకే లేనప్పుడు నాకు ఏ పుట్టినరోజు వద్దని చెప్పారని అంటుంది అప్పూ. అత్తయ్యతో నేను మాట్లాడతానని వదిలేయమని చెబుతుంది కావ్య.

చీకట్లో బాధపడుతున్న అపర్ణ దగ్గరికి కావ్య వస్తుంది. మావయ్య గారు , అమ్మమ్మ గారు, నేను, మన ఫ్యామిలీ మీకు అక్కర్లేదా అని ప్రశ్నిస్తుంది కావ్య. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదని, నన్ను ఒంటరిగా వదిలేయమని అంటుంది అపర్ణ. ఇప్పుడు ఏమైందని ఇంతగా బాధపడుతున్నారని ప్రశ్నిస్తుంది కావ్య. ఆ మాటలతో ఏం మాట్లాడుతున్నావే, బాధపడకుండా ఎలా ఉండను.. రేపు నా పుట్టినరోజుని ఘనంగా జరిపించాలని ఇంట్లో వాళ్లంతా అంటున్నారని కానీ అది ఎవరి కోసం జరుపుకోవాలి? ఎందుకోసం జరుపుకోవాలని ప్రశ్నిస్తుంది అపర్ణ.

ఏ తల్లయినా తన బిడ్డ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటుందని, కానీ కొడుకు ఈ లోకం నుంచి దూరమయ్యాక ఏ తల్లయినా సంబరపడిపోతుందా అని అడుగుతుంది. ఆయన లేరని ఎవరు అన్నారు, రారనీ ఎందుకు అనుకుంటున్నారు , ఆయన బతికే ఉన్నారని తిరిగి వస్తారని నేను ఎంత చెప్పినా మీరు ఎందుకు నమ్మడం లేదని అంటుంది. వాడు నీకు మాత్రమే కనిపిస్తూ ఈ ఇంట్లో ఎవ్వరికీ కనిపించడం లేదంటే ఎలా నమ్మమంటావని కావ్యని ప్రశ్నిస్తుంది అపర్ణ. వాడి మీదున్న ప్రేమతో వాడు బతికే ఉన్నాడన్న భ్రమలో బతుకుతున్నావో, లేక మాకు ధైర్యం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నావో? అసలు నీ మానసిక పరిస్దితి ఏంటో అర్ధం కావడం లేదని అంటుంది.

అంటే నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నిలదీస్తుంది కావ్య. వాడు బతికే ఉంటే నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు? ఎందుకు ఇంటికి రావడం లేదు? ఎక్కడో బయట బతకాల్సిన అవసరం ఏంటీ అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఆ దేవుడే వచ్చి చెప్పినా వాడు బతికే ఉన్నాడన్న విషయాన్ని నేను నమ్మలేనని అంటుంది. వాడు బతికే ఉంటే ఎందుకు రావడం లేదని పదే పదే అపర్ణ నిలదీయడంతో ఆయన గతం మరిచిపోయారని చెబుతుంది. ఆ మాటలతో అపర్ణ షాక్ అవుతుంది. వాడు గతం ఎలా మరిచిపోయాడని అడగ్గా.. కావ్య జరిగినదంతా చెబుతుంది కావ్య.

ఆయనను ఇంటికి తీసుకొచ్చే దాకా ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అనుకున్నానని కానీ రోజురోజుకు మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే చూడలేక చెప్పానని అంటుంది కావ్య. ఆయన యామిని ఇంట్లో క్షేమంగా ఉన్నారని సంతోషపడాలో? లేక ఆయనను మాయ చేసి తన గుప్పిట్లో పెట్టుకుందని బాధపడాలో తెలియడం లేదని బాధపడుతుంది. నేను నిజం చెబితే మీరు ఉండగలరా? వాడికి గతం గుర్తుచేసేవాళ్లం కదా అని అపర్ణ అడగ్గా.. అలా చేస్తారనే చెప్పలేదని అంటుంది కావ్య. ఆయనకి గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది.

నాకు వాడిని చూడాలని ఉందని అపర్ణ అడగ్గా వద్దని అంటుంది కావ్య. లేదంటే నువ్వు చెప్పినదంతా అబద్ధమని నేను అనుకుంటానని చెబుతుంది. దీంతో రేపు ఆయనను చూపిస్తానని , కానీ మీరు ఆయనతో గతం గురించి మాట్లాడనని మాట ఇవ్వాలని చెబుతుంది కావ్య. ఆకలిగా ఉంది.. భోజనం చేయాలని ఉందని అంటుంది అపర్ణ. ఏదో ఒకటి చేసి కావ్య గురించి తెలుసుకోవాలని అనుకుని ఆమెకు ఫోన్ చేస్తాడు రాజ్. మా అమ్మాయిలు పనుంటే ఆఫీసులో ఉంటారు.. పని లేకపోతే ఇంట్లో ఉంటారని చెబుతుంది కావ్య.

ఏం మాట్లాడాలో తెలియక నేనిచ్చిన బోకే ఎలా ఉందని అడుగుతాడు రాజ్. నాకు చాలా బాగా నచ్చిందని అంటుంది కావ్య. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి.. కూరగాయలు తీసుకురావాలి, నేనే వంట చేయాలని అంటుంది కావ్య. ఈ అవకాశం వాడుకుని కావ్యని కలవాలని అనుకుంటాడు రాజ్. కూరగాయల షాపు ఎక్కడో అడ్రస్ చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X