Brahmamudi April 14th Episode: అప్పూ పేరుతో దుగ్గిరాల నిలయంలోకి నందూ... పోలీసుల ట్రాప్‌లో స్వరాజ్

Photo Courtesy: JioHotstar

ఇందూ కిడ్నాప్ కేసు గురించి ఎంక్వైరీ చేయిస్తుంది రేఖ. అయితే ఇదంతా ఇంట్లో వాళ్లు చేసిన పనిలాగే ఉందని పోలీసులు అనుమానిస్తారు. దాంతో అంతా షాక్ అవుతారు.. ఈ మాటలు వినగానే ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లయంట్ ఇస్తే.. మా పని మేం మొదలుపెడతామని పోలీసులు చెప్పగా.. రేఖ భయపడుతుంది. ఇందూ కిడ్నాప్ అయినట్లు తెలిస్తే మా కంపెనీ షేర్ వాల్యూ పడిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని, కంప్లయంట్ లేకుండానే ఇందూని వెతికి పట్టుకోమని చెబుతుంది రేఖ. ఈ మాటలన్నీ విన్న అపర్ణ కంగారుపడుతుంది.

స్వరాజ్ కొన్నిరోజులుగా ఇంటికి రాకపోవడంతో తండ్రి ఫోన్ చేసి నానామాటలు అంటాడు. ఇంతలో ఇందూ కనిపించడం లేదని లక్కీ చెప్పడంతో స్వరాజ్ ఇళ్లంతా వెతుకుతాడు. అయితే ఇందూ అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకుంటాడు. చాలా బాగా కిడ్నాప్ చేశారు.. మా చెల్లితో చెప్పి డబ్బులు వేయిస్తానని చెప్పడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. మేం నిన్ను డబ్బు కోసం కిడ్నాప్ చేశాం.. మా పేమెంట్ మాకు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని ఇందూని కట్టేస్తారు. ఇందూ కిడ్నాప్ అయిన విషయాన్ని నందూకి చెబుతాడు పోలీస్ బాబాయ్. దాంతో అక్కని నేనే వెతికి పట్టుకుంటానని అంటుంది నందూ. కిడ్నాప్ విషయం తేల్చడానికి ఇందూ బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో మొత్తం చూస్తుంది రేఖ. ఇది అపర్ణ- సుభాష్‌ల పని అని అనుమానించి ఇద్దరినీ చంపేయాలని అనుకుంటుంది. ఇంతలో నందూ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఏప్రిల్ 14వ తేదీ ఎపిసోడ్ 1006లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 14th 2026 Episode 1006 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

దుగ్గిరాల నిలయంలోకి అడుగుపెట్టిన నందూ.. కిడ్నాప్ కేసును అన్‌అఫీషియల్‌గా ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చానని అంటుంది. ఇంట్లోనే దొంగ దొరికాడా? కిడ్నాప్ చేసిందెవరో తెలిసిందా అంటుంది? నందూ. మీరందరూ కోపరేట్ చేస్తే ఇందూని పట్టేసుకుంటామని చెబుతుంది నందూ. కిడ్నాప్ అయిన ఇందూకి మీరు ఏమవుతారు? అంటూ భ్రమరాంబపై సెటైర్లు వేస్తుంది నందూ. ఏ సంబంధం లేకపోయినా నీకెందుకు? మాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావని మండిపడుతుంది భ్రమరాంబ. ఇందూ కిడ్నాప్‌కు వారం ముందు వరకు ఎక్కడికి వెళ్లింది? ఎవరిని కలిసింది? ఈ ఇంట్లో ఎవరెవరితో గొడవలు ఉన్నాయి? అన్ని తెలుసుకోవాలని చెబుతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే జైలుకి తీసుకెళ్లి మాట్లాడతానని నందూ వార్నింగ్ ఇస్తాడు.

నాకు సిస్టమ్, పవర్, ఇంటర్నెట్ ఇవన్నీ కావాలి.. కిడ్నాపర్ ఫోన్ చేస్తే ట్రేస్ చేయాలి కదా అని అంటుంది నందూ. ఆ మాటలకు ఐశ్వర్య వణికిపోతుంది. ఇందూ దొరికే వరకు నేను ఇక్కడే ఉంటానని చెబుతుంది. ఎవరూ ఊరికే కిడ్నాప్ చేయరు.. చేయించారు కాబట్టి, వాళ్ల డిమాండ్స్ కోసం తప్పకుండా కాల్ చేస్తారు. అప్పుడు ఆ కాల్‌ని ట్రేస్ చేసి పట్టుకోవాలని చెబుతుంది నందూ. ఆమెకు కావాల్సిన పరికరాలు మొత్తం ఇంట్లో ఏర్పాటు చేస్తారు. నందూ దెబ్బకి భ్రమరాంబకు మండిపోతుంది. ఇంతకీ నీ పేరేంటీ అని అడగ్గా.. తన అసలు పేరు కాకుండా అప్పూ అని నందూ చెప్పడంతో సుభాష్, అపర్ణలు షాక్ అవుతారు. మీరు వేడిగా కాఫీ పెట్టుకుని రండి.. నేను ఫ్రెష్ అయి వస్తానని భ్రమరాంబకి చెబుతుంది నందూ. నేను కాఫీ పెట్టి తీసుకురారా.. అయితే నేను వెళ్లిపోతానని నందూ బెదిరించడంతో రేఖ సీరియస్ అవుతుంది. దాంతో భ్రమరాంబ కాఫీ తీసుకొస్తానని చెబుతుంది. నందూ నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లబోతుండగా భ్రమరాంబ కోప్పడుతుంది.

లక్కీ, స్వరాజ్‌లు భోజనం చేస్తుండగా ఇందూ గురించి గుర్తొస్తుంది స్వరాజ్‌కి. దాంతో తనే భోజనం తీసుకుని వెళ్తాడు. రాజ్‌ని చూడగానే నిద్ర నటిస్తుంది ఇందూ. అది గమనించి స్వరాజ్ క్లాస్ పీకుతాడు. ఇందూకి కట్లు విప్పి అన్నం తినమని చెబుతాడు కార్తీక్. ఆకలి మీద ఉండటంతో ఇందూ భోజనం తినేస్తుంది. అసలు వీళ్లు ఎవరు? ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది ఇందూ. ఇంతలో ఎక్కిళ్లు వచ్చి మంచినీళ్లు అడుగుతుంది ఇందూ. లక్కీ మంచినీళ్లు తాగిస్తుండగా.. అతని ఫేస్‌కున్న మాస్క్‌ని లాగేస్తుంది. అతను లక్కీ అని తెలుసుకుని షాక్ అవుతుంది ఇందూ. ఆ వెంటనే స్వరాజ్ మాస్క్ కూడా లాగేస్తాడు లక్కీ. చీటింగ్‌లు, స్కామ్‌లు, దొంగతనాలు.. ఇప్పుడు కిడ్నాప్‌లు. నాకు ముందే తెలుసు మీరే నన్ను కిడ్నాప్ చేస్తారని అంటుంది ఇందూ. డబ్బుల కోసం మీరు ఎంతకైనా దిగజారతారని నాకు ముందే తెలుసని నానా మాటలు అంటుంది.

డబ్బు కోసమే ఇదంతా చేశాం.. మేం చేసే ప్రతి పని కిడ్నాప్ కోసమే చేస్తాం. ఇప్పుడు నిన్న కిడ్నాప్ చేసింది కూడా డబ్బు కోసమే. మీలాంటి వాళ్లు బాగుపడరు, నాశనమైపోతారని అంటుంది ఇందూ. ఓవరాక్షన్ చేయకుండా మేం చెప్పినట్లు చేస్తే.. డబ్బులు తీసుకుని నిన్ను వదిలేస్తాని అంటాడు స్వరాజ్. నేను ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది. ఒకరకంగా సంతకం పెట్టకుండా తప్పించుకోగలిగాను, ఆ రేఖ ఆంటీని ఎలా అడ్డుకోవాలో ఆలోచించాలని అనుకుంటుంది ఇందూ.

ఇంట్లోనే సెటప్ చేసి ఇందూని కిడ్నాప్ చేయడం గురించి ఎంక్వైరీ చేస్తుంది నందూ. ఇంతలో భ్రమరాంబ .. కాఫీ పెట్టుకొచ్చి సీరియస్‌గా చూస్తుంది. కిచెన్ ఎక్కడుందో తెలియని నువ్వు.. నా కోసం కాఫీ పెట్టుకొచ్చావా అని శేషం సంతోషిస్తాడు. నీ పుణ్యమా అని నీ వల్ల మా ఆవిడ కిచెన్‌లోకి వెళ్లడం చూశానని అంటాడు శేషం. బ్రేక్‌ఫాస్ట్‌లో బట్టర్ హాఫ్ బాయిల్డ్ చేసి తీసుకురమ్మని చెబుతుంది నందూ. ఆ మాటలతో షాక్ అవుతుంది భ్రమరాంబ. ఇంతలో స్వరాజ్ నుంచి ఫోన్ రావడంతో దానిని నందూకి చూపిస్తుంది రేఖ. ఎవరో కాల్ చేస్తుంటే రేఖ ఆంటీ టెన్షన్ పడుతోందని స్వాతి సంతోషిస్తుంది. అక్క తనని తాను కిడ్నాప్ చేసుకున్నప్పుడు వీళ్లకెందుకు కాల్ చేస్తుందని అనుకుంటుంది.

తన ఫోన్ ట్రేస్ చేస్తున్న సంగతి తెలియని స్వరాజ్.. రేఖతో మాట్లాడతాడు. మీ ఇంట్లో ఒక మనిషి కిడ్నాప్ అయినప్పుడు ఏం కావాలో తెలుసుకోవాలని చెబుతాడు. మీ అమ్మాయి ఇందూ అంటే మీకు ప్రేమ ఉన్నట్లుగా కనిపించడం లేదు అంటాడు. కిడ్నాప్ ఎందుకు చేస్తారు.. డబ్బుల కోసం చేస్తారని చెబుతాడు స్వరాజ్. ఆ మాటలకు రేఖ, ఐశ్వర్యలు షాక్ అవుతారు. కోటి రూపాయలు రెడీ చేసుకోమని స్వరాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అంత పెద్ద బంగ్లాలో ఉంటున్నారు.. అంత గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ చేశారు, కోటి రూపాయలు మీకు ఎక్కువా? ఈసారి కాల్ చేసినప్పుడు మళ్లీ మీకు విసిగించారంటే, మీ అమ్మాయి ప్రాణాలతో ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేనని చెబుతాడు స్వరాజ్.

అయితే అనుకున్న టైం కన్నా ముందే రేఖ కాల్ కట్ అవ్వడంతో నందూ మండిపడుతుంది. మినిమం రెండు మూడు నిమిషాలు మాట్లాడాలి, ఈసారి కాల్ చేసినప్పుడు మాత్రం నేను సైగ చేసేంత వరకు వాడితో మాట్లాడుతూనే ఉండాలని అంటుంది నందూ. దానికి రేఖ సరేనని చెబుతుంది. అక్క తనకు తాను కిడ్నాప్ అయితే డబ్బుల కోసం కిడ్నాపర్లు కాల్ చేయడం ఏంటీ? అని స్వాతి టెన్షన్ పడుతుంది. పోలీసులు ట్రేస్ చేస్తున్నారని వెంటనే లక్కీకి చెప్పాలని అనుకుంటుంది ఐశ్వర్య. కానీ స్వరాజ్ మాత్రం కాల్ కట్ చేస్తాడు. కిడ్నాపర్‌లా అద్భుతంగా మాట్లాడావని స్వరాజ్‌ని మెచ్చుకుంటాడు లక్కీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X