Brahmamudi April 15th Episode : అన్నదానానికి రాజ్.. కావ్య సంబరం, యామినిలో కొత్త అనుమానాలు
క్లయింట్స్‌కు బిల్స్ క్లియర్ కాకపోవడంతో మేనేజర్‌పై మండిపడుతుంది కావ్య. ఇంటికొచ్చేసరికి అప్పూ బాధపడుతుండటంతో ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. పెద్ద అత్తయ్య పరిస్ధితి ఏం బాలేదని బావగారినే తలచుకుంటూ కృంగిపోతున్నారని ఆమెను అలాగే వదిలేస్తే ఏమైపోతుందోనని చెబుతుంది అప్పూ. చీకట్లో లైట్లు కూడా లేకుండా బాధపడుతున్న అపర్ణని కావ్య ఓదారుస్తుంది. నీకు ఒక్కడికే కనిపిస్తున్న రాజ్.. మాకెందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తుంది అపర్ణ.
ఆయన బతికే ఉన్నారని.. త్వరలోనే మనముందుకు వస్తారని అంటుంది. నువ్వు చెప్పేది నిజమో? కాదో ? తెలియడం లేదని , ప్రాణాలతోనే ఉంటే వాడు ఇంటికి ఎందుకు రావడం లేదని అపర్ణ అడిగేసరికి ఆయన గతం మరిచిపోయాడని జరిగినదంతా చెబుతుంది కావ్య. అయితే వాడిని నాకు చూపిస్తేనే నేను నువ్వు చెప్పేది నమ్ముతానని అంటుంది అపర్ణ. నేను ఆయనను చూపిస్తే మీరు గతం గుర్తుచేయడానికి ప్రయత్నించనని మాట ఇవ్వమని అడుగుతుంది కావ్య. రాజ్‌కు కావ్యతో మాట్లాడాలనిపించి ఫోన్ చేయడంతో కూరగాయల షాప్‌కు వెళ్తున్నానని అడ్రస్ చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్ 696లో ఏం జరిగిందంటే?

కూరగాయలు తీసుకురావడానికి నేను కూడా వస్తానని కావ్యతో చెబుతాడు రాజ్. భర్త మాటలతో కళావతి సంబరపడిపోతుంది. ఇవాళ్టీతో మా పరిచయం ఏంటో? నాకు ఆమకు ఎలాంటి అనుబంధం ఉందో పూర్తిగా తెలుసుకుని తీరతానని అంటాడు రాజ్. కూరగాయల దుకాణం వద్ద రాజ్ కోసం కావ్య ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ అక్కడికి రావడంతో చాలా త్వరగా వచ్చేశారని అంటుంది. ఈ షాపు మీకు చాలా దూరం కదా అని చెబుతుంది కావ్య.
మీకు నిజంగా కూరగాయలు కొనడం రాదా? అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది కావ్య. కొనాల్సిన అవసరం ఎప్పుడు రాలేదని , ఈ సెక్షన్ అంతా లేడీస్ చూసుకుంటారు కదా అని అంటాడు. అంతమంది లేడీస్ ఉంటారా మీ ఇంట్లో అని ప్రశ్నిస్తుంది కళావతి. మరి వాళ్లు చూసుకోరా ఈ పని అని అడుగుతుంది . అసలు కూరగాయలే కొనడం రానీ మిమ్మల్ని ఎలా పంపించారని ప్రశ్నిస్తుంది కావ్య. ఇవి ఇంట్లోకి కాదని.. రేపు అన్నదానం చేయిస్తున్నామని చెబుతాడు రాజ్.
ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. ఎదురుగా ఉన్న గుడిని చూపించి ఇక్కడే అన్నదానం చేయిస్తున్నామని చెబుతాడు రాజ్ . రేపు ఏమైనా స్పెషలా? అని కావ్య అడగ్గా.. మా అమ్మ పుట్టినరోజుని చెప్పడంతో కావ్య సంతోషిస్తుంది. ప్రతి సంవత్సరం మా అమ్మ పుట్టినరోజు నాడు గుడిలో అన్నదానం చేయిస్తానని చెప్పడంతో ఆమె సంబరపడిపోతుంది. ఆ మాటలతో నిజంగానే ఈయనికి గతం గుర్తులేదా? లేక? గతం మరిచిపోయినట్లుగా నాతో ఫ్రాంక్ చేస్తున్నాడా? అని కావ్య డౌట్ పడుతుంది.
నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయిందని.. ఆవిడ జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది అన్నదానం చేస్తుంటానని చెప్పడంతో కావ్య బాధపడుతుంది. రాజ్‌కు గతం గుర్తొచ్చిందని సంబరపడిన కావ్య ఆ మాటలతో డల్ అయిపోతుంది. చిన్నప్పుడు నన్ను మా అమ్మ బాగా ఆడించిందని డ్రామా ఆడతాడు. మీలాంటి కొడుకుని కన్న ఆవిడ చాలా అదృష్టవంతురాలని చెబుతుంది కావ్య. కూరగాయలు కొనడం స్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది. 200 మంది అన్నదానానికి కూరగాయలు రెండు కేజీలైనా సరిపోతుందా? అని ప్రశ్నిస్తాడు రాజ్. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. మీరు ప్రసాదం పెడుతున్నారా? అన్నదానం చేస్తున్నారా? అని అడుగుతుంది.
ప్రతి సంవత్సరం 200 మందికి 2 కేజీలతో అన్నదానం చేస్తారా అని సెటైర్లు వేస్తుంది . మీరు ఎన్ని చెబితే అన్ని తీసుకుంటానని , నాకు కూరగాయల గురించి తెలియదని అంటాడు రాజ్. దాంతో కేజీల కొద్ది కూరగాయలు ఆర్డర్ వేస్తుంది కావ్య. ఇన్ని కూరగాయలు ఇంటికి తీసుకెళ్తే యామినికి ఏం సమాధానం చెప్పాలోనని భయపడతాడు రాజ్. కావ్యని ఆపడానికి మీ వంట చాలా బాగుందని , అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయిందని చెబుతాడు రాజ్. నన్ను పొగడటానికే ఈ బ్రేక్ ఇచ్చారా? అని ప్రశ్నిస్తుంది కావ్య.
రేపు అన్నదానం చేసేటప్పుడు అక్కడికి వచ్చే వాళ్లు తృప్తిగా భోజనం చేయాలంటే మీరే చేయండి అని అడుగుతాడు రాజ్. అంతమందికి నేను వంట చేయలేనని చేతులెత్తేస్తుంది కావ్య. అంతమందికి భోజనం వండాలంటే తర్వాతి రోజు నా చేతులు పనిచేస్తాయో లేదోనని ఆలోచిస్తున్నానని చెబుతుంది. కావ్య మనసులో సంబరపడిపోతూ ఇష్టం లేనట్లుగా నటిస్తుంది. మీకోసం ఖచ్చితంగా వంట చేసి పెడతానని అంటుంది. ఇంతకీ అన్నదానం ఏ గుడిలో అని అడుగుతుంది కావ్య. అది తెలియక అటు ఇటూ చూస్తాడు రాజ్. మణికొండ రామాలయమేనా అని కావ్య చెప్పడంతో అదేనని అంటుంది కావ్య. కూరగాయలు తీసుకోకుండా వెళ్తున్న కావ్యని పిలిచి రాజ్ అడగటంతో అమ్మగారి ఇల్లు మాకు తెలుసని కూరగాయలు అమ్మే ఆమె అంటుంది.
రాజ్ ఎక్కడికి వెళ్లాడో తెలియక యామిని ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. కూరగాయలు తీసుకురమ్మని చెప్పాను కదా బయటికి వెళ్లి తీసుకురమ్మని భర్తతో అంటుంది వైదేహి. రామ్ వెళ్లాడు కదా? కూరగాయలు తీసుకొస్తాడులే అని చెబుతుంది యామిని. ఆ మాటలు విన్న రాజ్ టెన్షన్ పడతాడు. కూరగాయలు తీసుకురాలేదా అని రాజ్‌ను ప్రశ్నిస్తుంది యామిని. నేను తీసుకొస్తానని చెప్పలేదు కదా అని అంటాడు.
నువ్వు కూరగాయల షాప్ నుంచే వస్తున్నావ్ కదా? తెస్తున్నావని అనుకున్నానని అంటుంది యామిని. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. నేను కూరగాయల షాప్ దగ్గర ఉన్నట్లు నీకు ఎలా తెలుసు అని రాజ్ అడగడటంతో యామిని షాక్ అవుతుంది. నేను ఏం చేస్తున్నానో నన్ను ఫాలో అవుతున్నావా? అంటూ నిలదీస్తాడు. మా అమ్మాయి అలాంటిది కాదని, ఆమె మీద అలాంటి నిందలు వేయొద్దని వైదేహి చెబుతుంది. దాంతో చిరాకు పడిన రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
బట్టలు సర్దుతుండగా రాజ్ షర్ట్ కనిపిస్తుంది కావ్యకి.. ఆ షర్ట్‌ని తడుముకుంటూ భర్తతో గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. వైట్ షర్ట్‌కి రాజ్ అనే అక్షరం కుడుతుంది కావ్య. అప్పుడు రాజ్ రావడంతో దానిని వేసుకోమని చెబుతుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











