Brahmamudi April 15th Episode: ఇందూ కిడ్నాప్ డ్రామా పసిగట్టిన అపర్ణ.. స్వరాజ్‌కి ఇందూ బడితపూజ

Photo Courtesy: JioHotstar

ఇందూ కిడ్నాప్ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి దుగ్గిరాల నిలయంలోకి అడుగుపెడుతుంది నందూ. రావడం రావడంతోనే భ్రమరాంబకి చుక్కలు చూపిస్తుంది. తన పేరు అప్పూ అని చెప్పడంతో సుభాష్ - అపర్ణలు షాక్ అవుతారు. భ్రమరాంబని కాఫీ పెట్టమని చెప్పడంతో నేను పెట్టనని అంటుంది భ్రమరాంబ. అయితే నేను వెళ్లిపోతానని నందూ చెప్పడంతో రేఖ సీరియస్ అవుతుంది. ఇందూకి భోజనం తీసుకొచ్చి పెడతారు లక్కీ- స్వరాజ్. మంచినీళ్లు తాగే వంకతో లక్కీ ఫేస్ మాస్క్ లాగేస్తుంది ఇందూ. తనను కిడ్నాప్ చేసింది లక్కీ - రాజ్‌లు అని తెలుసుకుని షాక్ అవుతుంది. డబ్బు కోసమే మేం నిన్ను కిడ్నాప్ చేశాం.. డబ్బు రాగానే వదిలేస్తామని చెబుతాడు స్వరాజ్.

దుగ్గిరాల నిలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఎంక్వైరీ చేస్తుంది నందూ. ఇంతలో స్వరాజ్ నుంచి రేఖకి కాల్ వస్తుంది. మీ అమ్మాయిని వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని అడగటంతో అంతా షాక్ అవుతారు. అక్క తనకు తాను కిడ్నాప్ అయితే కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నది ఎవరు? అనుకుని టెన్షన్ పడుతుంది స్వాతి. పోలీసులు ట్రేస్ చేస్తున్న విషయాన్ని చెప్పాలని ఐశ్వర్య ఎంత ప్రయత్నించినా స్వరాజ్ మాత్రం కాల్ కట్ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్ 1007లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 15th 2026 Episode 1007 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూని కిడ్నాప్ చేసిందెవరో తెలియక స్వాతి టెన్షన్ పడుతుంది. వెంటనే తను మాట్లాడిన కిడ్నాపర్లకు ఫోన్ చసి అక్క ఎక్కడ? అని అడుగుతుంది. మాకేం తెలియదు.. కిడ్నాప్ చేసినవాళ్లని అడగమని అంటాడు బంటీ. ఆ మాటలతో స్వాతి షాక్ అవుతుంది. మేం కిడ్నాప్ చేయాలని అనుకునేలోపే.. పొగపెట్టి ఎవరో ఎత్తుకుపోయాడని బంటీ చెప్పడంతో స్వాతి ఉలిక్కిపడతాడు. మా అక్కని నువ్వు కిడ్నాప్ చేయకపోతే ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది స్వాతి. అందరితోపాటే మేం నిద్రపోయాం.. లేచి చూసేసరికి మీ అక్క కనిపించలేదని బంటీ అంటాడు. అక్కని వీళ్లు కిడ్నాప్ చేయలేదంటే మరి ఎవరు కిడ్నాప్ చేసినట్లు అని టెన్షన్ పడుతుంది. ఇదంతా విన్న అపర్ణ... స్వాతిని లాగిపెట్టి కొడుతుంది.

మరోవైపు.. స్వరాజ్‌కి చలపతి ఫోన్ చేసి మళ్లీ ఆ సాహూ గాడి చేత చేపలు ఎందుకు పంపించావని మండిపడతాడు. మీ తమ్ముడికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలని పూజలు చేయించాడట, అసలు నువ్వు వాడితో ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నావని సీరియస్ అవుతాడు చలపతి. తనకు వీలైనంత త్వరగా డబ్బులు ఇవ్వకపోతే నీ ఫ్యామిలీ జోలికి వస్తానని ఇలా ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నాడని లక్కీతో చెబుతాడు స్వరాజ్. ఈ కిడ్నాప్ డ్రామాని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలి, డబ్బులు తీసుకుని వాడి ముఖాన కొట్టాలని అంటాడు. ఆ ఇందూ మనిద్దరినీ గుర్తుపట్టేసింది.. రేపు బయటికి వెళ్లాక ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందని అంటాడు లక్కీ. మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండటం వల్లే.. దానిని మార్చాలని, తనని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయాలని చెబుతాడు స్వరాజ్.

ఇందూ దగ్గరికి వెళ్లి కట్లు విప్పేస్తాడు స్వరాజ్. మా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, ఇంకా బాధపెట్టడం మాకు ఇష్టం లేదు. అందుకే ఈ కట్లు విప్పేశానని చెబుతాడు స్వరాజ్. నేను ఎప్పుడూ మోసం చేసే తప్పుడు మనిషిగానే నీకు తెలుసు, కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా కుటుంబం కోసం, నా మీద ఆధారపడ్డ నా వాళ్ల కోసం ఇదంతా చేస్తున్నాను అని చెబుతాడు స్వరాజ్. నాకు మరో దారిలేదు.. లేచిపోయిన చెల్లెలు, పారిపోయిన తమ్ముడు, ఊరు నిండా అప్పులు, ఇంటి నిండా కష్టాలు. వీరందరీ కష్టాలు తీర్చాలంటే నేను చేసే ఉద్యోగం సరిపోదు. నేను రక్తం అమ్ముకుందామని అనుకున్నా. నా బక్క శరీరానికి రక్తం ఎక్కించాలి తప్పించి, రక్తం తీసుకోవడం కుదరదని డాక్టర్లు చెప్పేశారని నటిస్తాడు స్వరాజ్.

ఇలాంటి పరిస్ధితుల్లో నా కుటుంబం కోసం అడ్డదారి తొక్కాల్సి వచ్చింది.. నా స్వార్ధం కోసం ఒక ఆడపిల్లని మోసం చేయడం నాకు నచ్చలేదు, అందుకే కట్లు విప్పేశానని అంటాడు. నా వాళ్ల కోసం కొంచెం సపోర్ట్ చేయమని అడుగుతాడు స్వరాజ్. ఇన్నిరోజులు నిన్నొక వెధవలా చూశాను, నువ్వు వెధవ్వి కాదు, వెధవన్నర వెధవ్వి అంటూ చీపురు కట్ట తీసుకుని బడితపూజ చేస్తుంది. దాంతో స్వరాజ్.. ఆమెను లోపలికి పెట్టి తలుపులు వేసేస్తాడు. మావాడు బాగానే పర్ఫార్మ్ చేశాడు కదా .. ఎలా గుర్తుపట్టారని అడుగుతాడు లక్కీ. ఇందాక మీరిద్దరూ మెయిన్ డోర్‌కి లాక్ చేయడం నేను విన్నాను. అయినా మీరు చేసిన దాని వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ అయ్యింది కాబట్టి మీ ఇద్దరినీ వదిలేస్తున్నాను అని చెబుతుంది ఇందూ.

బయట పోలీసులు నీకోసమే వెతుకుతున్నారు. నువ్వు కనిపించగానే తీసుకెళ్లి రేఖ ఆంటీ ముందు వదిలిపెడతారు, అప్పుడు నీ ప్లాన్ మొత్తం బయటపడుతుందని చెబుతాడు స్వరాజ్. పోలీసులు నన్ను పట్టుకుంటే మీరిద్దరే నన్ను కిడ్నాప్ చేశారని జైలుకు పంపిస్తానని చెబుతుంది ఇందూ. మరోవైపు.. కిడ్నాప్ ప్లాన్ తెలిసిపోవడంతో స్వాతికి క్లాస్ పీకుతుంది అపర్ణ. అందరి ముందు రేఖ ఆంటీని ఎదిరించి మిమ్మల్ని ప్రమాదంలో పడేయటం ఇందూ అక్కకి ఇష్టం లేదు, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతుంది స్వాతి. ఇప్పటి వరకు ఇందూ అక్క.. తన ప్లాన్‌లో భాగంగానే కిడ్నాప్ అయ్యిందని అనుకున్నా.. కానీ తనను వేరే ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతుంది స్వాతి. అసలు ఇందూని ఎవరు ఎత్తుకెళ్లారో, క్షేమంగా ఉందో లేదో కూడా తెలియదని అపర్ణ కంగారుపడుతుండగ నందూ ఈ మాటలన్నీ వింటుంది. ఎక్కడున్నా ఇందూ అక్కని నేను కాపాడతానని హామీ ఇస్తుంది.

భ్రమరాంబని కాఫీలు, జ్యూస్‌లు, టిఫిన్లు అంటూ ఆడుకుంటుంది నందూ. ఇదంతా చూసి శేషం నవ్వుకుంటాడు. పుట్టినప్పటి నుంచి నా కూతురికి కూడా ఇన్ని సేవల చేయలేదని బాధపడుతుంది భ్రమరాంబ. కిడ్నాపర్లు కోటి రూపాయలు అడగటంతో రేఖ డల్‌గా ఉంటుంది. ఇందూ వస్తేనే కానీ మనకు డబ్బులు రావు.. డబ్బులు ఇస్తేనే కానీ వాడు మనల్ని వదిలిపెట్టడని చెబుతుంది రేఖ. వీళ్లు జ్యూస్‌లు, స్నాక్స్ తప్పించి ఏం పట్టుకోవడం లేదని మండిపడుతుంది భ్రమరాంబ. ఇంతలో స్వరాజ్ ఫోన్ చేయడంతో రేఖ ఫోన్ తీసుకొచ్చి నందూకి ఇస్తుంది. ఈసారి మాత్రం ఎక్కువసేపు మాట్లాడాలని రేఖకి చెబుతుంది నందూ. మేమంటే మీకు భయం లేదనుకుంటా.. అలాంటప్పుడు డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? అనేది అడగాలి కదా అని మండిపడతాడు స్వరాజ్.

మీరు అడిగింది చిన్న అమౌంట్ కాదు కదా? నాకు కొంచెం టైం కావాలని అడుగుతుంది రేఖ. ఇంతలో భ్రమరాంబ ఫోన్ తీసుకుని అమ్మాయి వస్తేనే మాకు డబ్బులొస్తాయి.. ముందు అమ్మాయిని పంపేయండి, మాకు రావాల్సిన డబ్బు రాగానే మీ డబ్బు మీకు ఇచ్చేస్తామని చెబుతుంది. మీ అమ్మాయి వేళ్లు కట్ చేసి పంపిస్తానని స్వరాజ్ వార్నింగ్ ఇవ్వడంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X