Brahmamudi April 15th episode: నేను మొదటి భార్యానా? రెండో పెళ్లానా? రాజ్‌కు కావ్య షాక్!
రాజ్ చేసిన పనికి అపర్ణని సూటికోటి మాటలు అంటూ ఉంటారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. వెన్నెలని పట్టుకునే ప్రయత్నంలో శ్వేత సహాయం తీసుకుంటుంది కావ్య. భార్య పడుతున్న అవమానాలు భరించలేక ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు రాజ్. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు అంటుంది కావ్య. అప్పు పోలీస్ సెలక్షన్ కి సెలెక్ట్ కాకపోవటంతో చాలా బాధపడుతుంది. శ్వేత సహాయంతో వెన్నెల ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్ 384 లో ఏం జరిగిందంటే..
దేవుడికి దండం పెట్టుకుంటున్న కావ్య దగ్గరికి వస్తుంది చిట్టి. ఆమెని హగ్ చేసుకుని వెళ్తాను అని చెప్తుంది కావ్య. వస్తాను అని చెప్పమ్మా అంటుంది చిట్టి. నాకు అలాగే చెప్పాలని ఉంది కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలియదు కదా అంటుంది కావ్య. నిన్ను నిజాన్ని వెతికే ప్రయత్నం చేయకుండా ఆపాల్సింది, ఇప్పుడు నీకు సమాధానం చెప్పుకోలేక పోతున్నాను నువ్వు తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటుంది చిట్టి. అదంతా మీ మనవడి చేతిలో ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య.

మరోవైపు సిన్సియర్గా పనిచేసుకుంటున్న కళ్యాణ్ ని చూసి నేను చేయబోయే పని గురించి తెలియక సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నాడు అనుకుంటాడు రాహుల్. వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అబ్రాడ్ నుంచి ఆన్ అఫీషియల్ గా ఇండియాకి వచ్చిన బంగారం లీగల్ గా మేము కొంటాము అంటాడు. పోలీసులు గాని ఎంటర్ అయితే నేను తప్పించుకుంటాను అంటాడు రాహుల్ ఫ్రెండ్. నేను కూడా తప్పించుకుంటాను బలవ్వటానికి వేరేవాడు ఉన్నాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాహుల్. తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్లి బంగారం తక్కువ ధరలో శకుంతల కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అని చెప్తాడు. అలా ఎలా అని అడుగుతాడు కళ్యాణ్.
అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు టాక్స్ పడకుండా మేనేజ్ చేసుకున్నారంట అని చెప్తాడు రాహుల్. సరే అయితే అన్నయ్యకి ఒక మాట చెప్తాను అంటాడు కళ్యాణ్. సరే ఈ ఫైల్ చదువు అని చెప్పి ఫైల్ చేతిలో పెట్టి పక్కకు వచ్చేస్తాడు రాహుల్. ఈరోజు రాజ్ పార్టీలో ఉంటాడు వాడు తిరిగి వచ్చేసరికి నీ చేత ఎలాగైనా సంతకం పెట్టించుకుంటాను అనుకుంటాడు రాహుల్. మరోవైపు రీ యూనియన్ పార్టీకి వెళ్తారు రాజ్ దంపతులు.
అక్కడ శ్వేత వాళ్లని రిసీవ్ చేసుకుంటుంది. అంతలో ఒక ఫ్రెండ్ భార్యతో సహా అక్కడికి వస్తాడు. అతడిని గతంలో రాజ్ పెళ్లి పీటల మీద నుంచి తీసుకువచ్చేస్తాడు ఆ సీను గుర్తుకు వచ్చి మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోయారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మేమిద్దరం ఒకరిని ఒకరు క్షమించుకున్నాము, కలిసిపోయాం అంటాడు ఆ ఫ్రెండ్. మీకు ముందు నుంచే భార్యాభర్తలను విడదీయడమే పనాఅని లో గొంతుకతో అడుగుతుంది కావ్య.

ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ మాటల్లో పడిపోతారు. కావ్య శ్వేతని పక్కకు తీసుకువెళ్లి వెన్నెల వస్తుందా, ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది. కంగారు పడకు తను వస్తుంది ఆల్రెడీ బయలుదేరింది అని చెప్తుంది శ్వేత. ఎక్కడ ఉందో కనుక్కో అని కావ్య చెప్పడంతో వెన్నెలకి ఫోన్ చేస్తుంది శ్వేత. అందరూ వచ్చేసారు నీ కోసమే వెయిటింగ్ అని చెప్తుంది.
వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వెన్నెల. ఇది మాటలు మరీ పొదుపుగా వాడుతుంది అంటుంది శ్వేత. మరోవైపు కనకం ఇంటికి పక్కింటామే వస్తుంది. అప్పుకి సంబంధం తీసుకువచ్చానంటూ ఒక ఫోటో చూపిస్తుంది.ఆ ఫోటో చూసిన కృష్ణమూర్తి ఈ అబ్బాయి వయసు ఎక్కువగా ఉంది అంటాడు. నాలుగు పదుల వయసే ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు అయినా ఏం పోయింది నాలుగు హోటల్స్ ఉన్నాయి నెలకి బోల్డంత సంపాదన వస్తుంది అని చెప్తుంది పక్కింటి ఆమె.
నా కూతురికి ఇలాంటి సంబంధం తీసుకోవచ్చావ్ ఏంటి అంటుంది కనకం. ఏమైంది డబ్బున్న సంబంధమే కదా, నీకు కావాల్సింది అదే కదా. పెద్ద కూతుర్లు ఇద్దరికీ అలాగే చేశావు కదా, అప్పు కూడా పోలీస్ సెలక్షన్కని వెళ్ళింది, ఫెయిల్ అయిపోయింది అంట కదా వీధిలో అందరూ అదే మాట్లాడుకుంటున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది పక్కింటి ఆమే. ఆమెని కసురుకొని అక్కడి నుంచి పంపించేస్తుంది అప్పు.

మన పిల్ల గురించి వీధిలో అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని భర్తతో చెప్పి బాధపడుతుంది కనకం. ఏమి జరగదు మేము ప్రశాంతంగా ఉన్నాము నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు. మరోవైపు పార్టీలో ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు రాజ్ ఫ్రెండ్స్ అందరూ. బాటిల్ శ్వేత వైపు ఆగటంతో ట్రూతా,డేరా అని అడుగుతారు ఫ్రెండ్స్ ట్రూత్ అంటుంది శ్వేత.
అయితే నీకు నచ్చిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు ఫ్రెండ్. రాజ్ అంటుంది శ్వేత. ఇష్టం లేని వ్యక్తి ఎవరు అని అడుగుతాడు ఫ్రెండ్. రాజ్ అంటుంది శ్వేత. అదేంటి ఒకే మనిషిని ఇష్టపడటం, ఇష్టపడకపోవడం అని అడుగుతారు ఫ్రెండ్స్. నా విషయంలో డేర్ చేసి నాకు సాయం చేశాడు అందుకే నాకు ఇష్టం కానీ తన వరకు వచ్చేసరికి అలా చేయలేకపోయాడు అందుకే ఇష్టం లేదు అంటుంది శ్వేత.
ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తర్వాత రాజ్ వైపు బాటిల్ ఆగుతుంది. ట్రూత్ చెప్తాను అంటాడు రాజ్. నీ భార్య గురించి చెప్పు అంటారు ఫ్రెండ్స్. కావ్య గురించి చెప్పాలంటే ఒక పెద్ద కావ్యమే రాయాలి. నా కుటుంబం కోసం నా కోసం ఎంతో కష్టపడుతుంది. కోపం వచ్చినా అది కాసేపు మాత్రమే ఉంటుంది మళ్ళీ మా కోసమే ఆలోచిస్తుంది అని కావ్య గురించి గొప్పగా చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications










