Brahmamudi April 16th Episode : రాజ్ గురించి నోరు జారిన అపర్ణ .. రుద్రాణిలో మొదలైన అనుమానం

కూరగాయలు తీసుకురావడానికి నేను కూడా వస్తానని కావ్యతో చెబుతాడు రాజ్. కావ్య ఇచ్చిన అడ్రస్‌తో కూరగాయల షాపు దగ్గరికి వచ్చిన రాజ్.. తనకు కూరగాయలు కొనడం చేత కాదని చెబుతాడు. మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయిస్తున్నానని కూరగాయాలు కొనమని చెబుతాడు రాజ్. ఆ మాటలతో కావ్య ఎంతో సంతోషిస్తుంది. 200 మందికి అన్నదానం చేయిస్తున్నానని అంటాడు రాజ్. ఈ అన్నదానానికి మీరే వంట చేసి పెట్టాలని అడగటంలో కావ్య సరేనని అంటుంది.

రాజ్ ఎక్కడికి వెళ్లాడో తెలియక యామిని ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. జీపీఎస్ లోకేషన్ ఆధారంగా రాజ్ ఓ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్లినట్లుగా తెలుసుకుంటుంది యామిని. రాజ్ రాగానే కూరగాయలు తీసుకొచ్చావా అని అడుగుతుంది యామిని. నేనేందుకు కూరగాయలు తీసుకొస్తానని రాజ్ కోప్పడతాడు. ఇందాక నిన్ను కూరగాల షాపు దగ్గర చూశానని అందుకే అడిగానని కవర్ చేస్తుంది. యామిని. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్ 697లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 16th 2025 Episode 697 Here is Today s full story

రాజ్ షర్ట్‌ను తడుముకుంటూ బాధపడుతున్న కావ్యని రాజ్ ఓదారుస్తాడు. ఈ షర్ట్ చూసినప్పుడల్లా నేను మీకు గుర్తుకురావాలి.. నన్ను మరిచిపోవాలని దూరంగా వెళ్లిపోవచ్చు, ఇది మీకు గుర్తొచ్చి మీరు నా దగ్గరకి వచ్చేస్తారని అంటుంది కావ్య. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోందని , నీ అంతగా నేను ప్రేమించలేకపోవచ్చని.. నేను ఎంత దూరం వెళ్లినా సరే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయని చెబుతాడు రాజ్. నీకు దూరమయ్యానన్న బాధ ఏ రోజు కలగనివ్వనని అంటాడు.

అలాంటి పరిస్థితే వస్తే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వచ్చేస్తానని చెబుతాడు రాజ్. ఏదో ఒకరోజు నీ కంటే గొప్పగా నేను నిన్ను ప్రేమించానని నీకు అనిపించేలా చేస్తానని అంటాడు. ఆ మాటలు గుర్తొచ్చి కావ్య బాధపడుతుంది. మీరు చెప్పిన క్షణాలు వచ్చేశాయని.. ఈ జ్ఞాపకాలను మీ దగ్గరికే పంపిస్తున్నాను, దీని ఆధారంగా మీ గుండె లోతుల్లో ఉన్న నా జ్ఞాపకాలను బయటికి తీసుకురండి అని అనుకుంటుంది కావ్య. రేపు మీరు గుడికి ఇదే షర్ట్ వేసుకుని రావాలని చెబుతుంది. అన్నదానానికి చేయాల్సిన పనులు చాలా ఉండటంతో షర్ట్‌ని అప్పూ చేత కొరియర్ చేయించాలని అనుకుంటుంది కావ్య.

అన్నదానం చేయించే వంకతో తనతో చాలా సేపు గడపొచ్చని అనుకుంటాడు రాజ్. తన గురించి పూర్తిగా తెలుసుకోవాలి .. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య ఫోన్ చేస్తుంది. అన్నదానం పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఏ ఐటమ్స్ వండుతున్నారు? అని అడుగుతాడు రాజ్. రేపు గుడికి వస్తే అన్ని తెలుస్తాయని అప్పటి వరకు వెయిట్ చేయమని చెబుతుంది కావ్య. మీకో సర్‌ప్రైజ్ ఉందని, కాసేపట్లో మీ ఇంటికి ఓ కొరియర్ వస్తుందని అది ఓపెన్ చేసి చూడమని అంటుంది.

ఇంతలో కొరియర్ కావడంతో యామిని డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి ఆ కొరియర్ తనకేనని నేనే బుక్ చేసుకున్నానని చెప్పడంతో ఏం బుక్ చేసుకున్నావని అడుగుతుంది . యామిని. వెంటనే కొరియర్ తీసుకుని రాజ్ లోపలికి పరిగెత్తుతాడు. ఏం జరుగుతుందో తెలియక యామిని టెన్షన్ పడుతుంది. రామ్ రోజురోజుకి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని .. నిజంగానే ఈ కొరియర్ రాజ్ బుక్ చేసుకున్నాడా? లేక నా దగ్గర నిజం దాస్తున్నాడా? అని ఆలోచిస్తుంది యామిని.

రాజ్ కొరియర్ ఓపెన్ చేసి చూడగానే అందులో షర్ట్ ఉంటుంది. ఆ వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు. గిఫ్ట్ అందిందా? అది చూస్తే నీకు ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతుంది కావ్య. నా మీద మీకున్న అభిమానం గుర్తొచ్చింది అని చెబుతాడు రాజ్. నా కోసం మీరు పడ్డ కష్టం గుర్తొచ్చిందని అంటాడు . ఆ మాటలతో కావ్య డల్ అయిపోతుంది. ఇంతకీ ఆర్ లెటర్ అంటే ఏంటో అర్ధమైందా? అని కావ్య ప్రశ్నించగా.. ఆర్ అంటే రామ్ కదా అని అంటాడు. అయినా ఇంత కష్టపడి ఎందుకు తయారు చేశారు అని ప్రశ్నిస్తాడు రాజ్. రేపు మీరు గుడికి వస్తున్నారు కదా? ఆ షర్ట్ అయితే కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటుందని పంపించానని చెబుతుంది కావ్య.

ఉదయాన్నే భారీగా క్యారియర్ తయారు చేస్తున్న కావ్యని చూసి రుద్రాణి షాక్ అవుతుంది. ఇంతలో అపర్ణ చాలా ఆనందంగా బయటికొచ్చి అన్నదానానికి కావాల్సినవి రెడీ చేశావా అని అడుగుతుంది . అపర్ణని అలా చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆంటీ ఒక్కపూటలో మారిపోయారని స్వప్న అంటుంది. కావ్య పూనుకున్నాక కానీ పని ఉండదని అంటుంది ఇందిర. తన ముఖం అలా వెలిగిపోతుంటే ఈ ఇంటికే వెలుగొచ్చినట్లుగా ఉందని అంటాడు సుభాష్. తర్వాత అందరూ కలిసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెబుతారు.

రాలిపోయే పువ్వు రాగాలు పలికినట్లు అంత ఆనందం దేనికి అని అడుగుతుంది రుద్రాణి. నిన్నటి వరకు కొడుకే లేడు, వాడే లేనప్పుడు వాడి జ్ఞాపకాలు నాకెందుకు అని చెప్పి ఇప్పుడేంటీ ఇంత అందంగా రెడీ అయిపోయావ్ అని అపర్ణని ప్రశ్నిస్తుంది. అక్కడ అన్నదానం చేయించేది నా కొడుకే కదా అని అపర్ణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా కొడుకు స్థానంలో నా కోడలు నిలబడి వాడు కోరుకున్న విధంగానే అన్నదానం జరిపిస్తుంది కదా అని అంటుంది. ఇప్పుడు మనకి కొడుకైనా కోడలైనా కావ్యేనని చెబుతాడు సుభాష్.

నిన్నటి వరకు ఈ ఇంట్లో కావ్య ఒక్కటే పిచ్చిది అనుకున్నానని.. ఇప్పుడు నిన్ను కూడా పిచ్చిదాన్ని చేసిందని అంటుంది రుద్రాణి. ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదని చెబుతుంది అపర్ణ. ఇంకోసారి మా కోడలికి పిచ్చి పట్టింది హాస్పిటల్‌లో జాయిన్ చేయించాలని వాగితే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. మద్యపానం, ధూమపానమే కాదు , అతి ఆలోచనలు కూడా ప్రమాదకరమేనని రుద్రాణితో అంటుంది కావ్య.

ఇన్ని రోజులు అపర్ణ ఏమైపోతుందోనని తెగ బాధపడిపోయావ్, ఇప్పుడు సంతోషంగా ఉండేసరికి చూసి ఓర్వలేకపోతున్నావని మండిపడుతుంది ఇందిర. అపర్ణ మనసుని కావ్య మార్చి గుడికి తీసుకెళ్లిందని ఆ సంతోషం కూడా దూరం చేస్తావా? అని ఫైర్ అవుతుంది. ఇంతలో అప్పూ ఆఫీసుకి బయల్దేరుతుండగా రుద్రాణి ఎక్కడికి అని అడుగుతుంది. ఒక ఫ్యామిలీ చాలా రోజులుగా కొందరినీ మోసం చేసి తప్పించుకుని తిరుగుతుందని.. వాళ్లని పట్టుకోవడానికి వెళ్తున్నానని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X