Brahmamudi April 16th Episode: స్వరాజ్‌కి ఇందూ భారీ ఆఫర్... పోలీసుల నుంచి లక్కీ అలా ఎస్కేప్
Photo Courtesy: JioHotstar
నేను పంపిన మనుషులు కాకుండా ఇందూ అక్కని ఎవరు కిడ్నాప్ చేశారు? అని ఆలోచిస్తూ బంటీకి ఫోన్ చేస్తుంది స్వాతి. మేమంతా మీలాగే పడుకున్నాం. ఈలోపు ఎవరో మీ అక్కని ఎత్తుకుపోయారని బంటీ చెప్పడంతో స్వాతి షాక్ అవుతుంది. ఈ మాటలన్నీ విన్న అపర్ణ.. లాగిపెట్టి కొడుతుంది. ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టకుండా చూడటానికి అక్క తనను తాను కిడ్నాప్ప చేసుకోవాలని అనుకుంది. కానీ ఇంతలో ఇలా జరిగిందని చెబుతుంది స్వాతి. ఇంతలో అక్కడికి వచ్చిన నందూ.. అక్క ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది.
సాహూ మన ఇంటికి మళ్లీ చేపలు పంపించి, ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పి వెళ్లాడని స్వరాజ్‌కు చెబుతాడు చలపతి. దాంతో ఈ కిడ్నాప్ డ్రామా వెంటనే క్లోజ్ చేయాలని మన డబ్బు మనం తీసుకుని పారిపోవాలని చెబుతాడు స్వరాజ్. ఇందూ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి ఆమె దగ్గరికి వెళ్లి నా కుటుంబం కోసం నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నానని డ్రామా ఆడతాడు. ఇదంతా పసిగట్టిన ఇందూ.. లక్కీ, స్వరాజ్‌లను చితకబాదుతుంది. భ్రమరాంబను కాఫీలు, జ్యూస్‌లు, టిఫిన్‌ల కోసం టార్చర్ చేస్తుంటుంది నందూ. ఇంతలో రేఖకి స్వరాజ్ కాల్ చేయడంతో నందూ ముందు మాట్లాడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్ 1008లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మీరు నా మాట పట్టించుకోవడం లేదు.. సరదాగా మీ అమ్మాయి వేళ్లు కట్ చేసి పంపిస్తానని రాజ్ వార్నింగ్ ఇవ్వడంతో అపర్ణ షాక్ అవుతుంది. మీరు పెట్టిన డబ్బు రెడీ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది రెండు రోజులు టైం ఇవ్వమని అడుగుతుంది రేఖ. అయితే ఫోన్‌ని ఎక్కువసేపు మాట్లాడటానికి గాను ఏదేదో మాట్లాడుతుంది రేఖ. డబ్బులు రెడీ చేసుకుంటే ఎక్కడికి రావాలో తర్వాత చెబుతానని అంటాడు స్వరాజ్. కిడ్నాపర్ లోకేషన్ దొరికిందని, ఆ ఏరియాని కనిపెట్టానని కానిస్టేబుల్ చెప్పడంతో నందూ సంతోషిస్తుంది. ఇప్పుడు మనల్ని నమ్మి అంత డబ్బు ఎవరిస్తారని రేఖ కంగారుపడుతుంది. చక్రీ దగ్గర తీసుకుంటానని రేఖ అంటుండగా.. వాడు ఈసారి మనకి చచ్చినా ఇవ్వడని చెబుతాడు భూషణ్. మన అదృష్టం బాగుండి ఈ పోలీసులు పట్టుకుంటే సరేసరి.. లేదంటే ఆ కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని చెబుతుంది రేఖ.
తమకు రాబోయే డబ్బులతో ఏం చేయాలో లక్కీ గాల్లోనే లెక్కలు వేస్తుంటాడు. డబ్బులు రాగానే మంచి కారు కొనుక్కుని బంజారాహిల్స్‌లో ఓ పెద్ద షోరూంలో 10 జతల బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలని చెబుతాడు స్వరాజ్. డబ్బులు రాగానే మనం కారులు, కొత్త బట్టలు కొనుక్కుంటే రోడ్డు మీదకే వస్తామని వార్నింగ్ ఇస్తాడు. అంత డబ్బు వచ్చాక కూడా మనం పేదరికంలోనే బతకాలా అని బాధపడతాడు లక్కీ. అలాగైతే మనం రిచ్ క్లాస్‌కి ఎప్పుడు వెళ్తామని అడుగుతాడు. మనకి వచ్చే 40 లక్షల రూపాయల్ని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి.. బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలని అంటాడు . ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో లక్కీ వెళ్లి తలుపు తీయగానే పోలీసులను చూసి షాక్ అవుతాడు.
పక్కవీధిలో పెద్ద దొంగతనం జరిగింది. ఆ దొంగ ఏదో ఇంట్లో దూరాడు.. వాడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామని చెబుతాడు ఎస్ఐ. వాడు చాలా డేంజరస్.. 150 మందిని చంపేశాడు, మీ ఇల్లంతా వెతుకుతామని చెబుతాడు ఎస్ఐ. ఇంతలో ఇందూ రావడంతో ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు ఎస్ఐ. మా వాడి భార్య అని లక్కీ చెప్పడంతో ఇందూ, స్వరాజ్‌లు షాక్ అవుతారు. ఇందూని బతిమలాడినట్లు నటిస్తాడు లక్కీ. ఇందూ కాళ్లు పట్టుకోవడంతో ఎస్ఐ షాక్ అవుతాడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ఈరోజుల్లో కూడా నీలాంటి ఫ్రెండ్స్ ఉంటారా? ఇలాంటి ఫ్రెండ్ దొరకడం మీ ఇద్దరి అదృష్టం. ఈగోలకు పోయి విడిపోకుండా జాగ్రత్తగా సంసారం చేసుకోండని చెప్పి వెళ్లిపోతాడు ఎస్ఐ.
నా లవ్‌కి సాయం చేయమంటూ నందూని బతిమలాడతాడు వెంకీ. నీ వల్లే నా లవ్ ప్రమాదంలో పడింది. సహాయం చేయమని అడుగుతాడు. ముందు ఓ అమ్మాయి కిడ్నాప్ అయ్యింది, వాళ్లింట్లో వాళ్లు కంగారుపడుతున్నారు. నా పరిస్ధితి అర్ధం చేసుకోమని సీరియస్ అవుతుంది నందూ. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నా మెసేజ్‌లకు కూడా రిప్లయ్ ఇవ్వడం లేదని అంటాడు వెంకీ. ఒకమ్మాయి వెనుక అలా పడితే నీ ప్రేమను అర్ధం చేసుకోదు.. నిన్ను చీప్‌గా చూస్తుందని అంటుంది నందూ. అది ఎక్కడుందో తెలుసుకుంటే నువ్వేం చేయాలో నేను చెబుతానని వెంకీకి చెబుతుంది నందూ. ఇందూ కోసం వెతుకున్న నందూకి స్వరాజ్ ఇంట్లో నుంచి బయటికొస్తున్న పోలీసులు కనిపిస్తారు. వాళ్లకి విషయం మొత్తం చెప్పి ఇందూ ఫోటో చూపిస్తుండగా ఎస్ఐకి ఫోన్ వచ్చి వెళ్లిపోతాడు.
పోలీసుల ముందు ఇందూని తన భార్య అని చెప్పడంతో లక్కీపై స్వరాజ్ మండిపడతాడు. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకమని నాకు బాగా తెలుసు. పోలీసులు వస్తే ఇలాగే మాట్లాడాలని మీరిద్దరూ ఆల్రెడీ డిసైడ్ అయ్యారని ఇందూ సీరియస్ అవుతుంది. నాకు మొగుడిగా నటించి ఈజీగా పోలీసుల నుంచి తప్పించుకున్నావు.. నువ్వు పెద్ద ఫ్రాడ్‌వి అంటుంది. మరి నువ్వెందుకు పోలీసుల ముందు సైలెంట్‌గా ఉన్నావని ఇందూని ప్రశ్నిస్తాడు స్వరాజ్. నువ్వు ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఆ ఇంటికి తిరిగి వెళ్లలేవు.. పోలీసుల ముందు కిడ్నాప్ విషయం బయటపెడితే నిన్ను తీసుకెళ్లి ఆ ఇంటిలో వదిలేస్తారు, అలా జరిగితే నువ్వు వేసుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుందని అంటాడు స్వరాజ్.
మీరు ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నారని నాకు బాగా తెలుసు.. మీకు ఎంత కావాలో చెప్పండి, మీకు ఆ డబ్బు నేను ఇస్తాను నన్ను మాత్రం వదిలేయమని చెబుతుంది ఇందూ. నువ్వు మాకు కోటి రూపాయలు ఇస్తావా అని స్వరాజ్ - లక్కీలు నవ్వేస్తారు. ఇప్పటి వరకు మీరు వెధవలని మాత్రమే అనుకున్నా.. ఇంత తెలివి తక్కువ వాళ్లని ఇప్పుడే అర్థమైందని అంటుంది ఇందూ. నన్ను కిడ్నాప్ చేస్తే మా రేఖ ఆంటీ కోటిరూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యింది అంటేనే మీకు అర్ధం కాలేదా? నేను పెట్టే సంతకం ఎంత విలువైందో అని ప్రశ్నిస్తుంది ఇందూ. నేను దుగ్గిరాల కంపెనీ వారసురాలిని, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపనీస్‌కి కాబోయే ఛైర్మన్‌ని, నన్ను వదిలిపెడితే మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తానని చెబుతుంది ఇందూ.


Click it and Unblock the Notifications











