Brahmamudi April 16th episode: నా బిడ్డని నాకు దూరం చేస్తావా? రాజ్‌కు షాక్ ఇచ్చిన యువతి.. అయోమయంలో కావ్య!

వెన్నెలని పట్టుకునే ప్రయత్నంలో శ్వేత సహాయం తీసుకుంటుంది కావ్య. భార్య పడుతున్న అవమానాలు భరించలేక ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు రాజ్. వెళ్తాను కానీ ఇప్పుడు కాదు అంటుంది కావ్య. అప్పు పోలీస్ సెలక్షన్ కి సెలెక్ట్ కాకపోవటంతో చాలా బాధపడుతుంది. శ్వేత సహాయంతో వెన్నెల ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కావ్య. రుద్రాణి కోడలి దగ్గరనుంచి ఆస్తి కొట్టేయటానికి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్ 385 లో ఏం జరిగిందంటే..

పార్టీలో తన భార్య గురించి చెప్తూ ఎమోషనల్ అవుతాడు రాజ్. తను నాకోసం, నా కుటుంబం కోసం చాలా చేస్తుంది. అందరికీ నేను సాయం చేస్తాను కానీ సాయం చేయడంలో నాకన్నా ఒక అడుగు ముందే ఉంటుంది నా భార్య. అలాంటి భార్య ప్రేమని చెప్పటం కన్నా చూపించడమే న్యాయం అంటాడు. ఎమోషన్ ఆపుకోలేక పక్కకి వెళ్ళిపోతాడు. వెనకే కావ్య కూడా వస్తుంది. మీరు చెప్పింది అంతా నిజమైతే బాగుండు అనుకుంటున్నాను.

Brahmamudi serial April 16th Episode of 384 Here is full story

కానీ బాబు గుర్తొచ్చి ఆ బాబు తల్లి గుర్తొచ్చి మీరు చెప్పేదంతా నిజం కాదని బాధనిపిస్తుంది. నిజము మీరే అబద్ధము మీరే, కష్టము మీరే సుఖము మీరే. ఇప్పటికైనా నిజం చెప్పండి ఆ బాబు ఎవరు, తల్లిని వదిలేసి బిడ్డను మాత్రమే ఎందుకు తీసుకువచ్చారు అని నిలదీస్తుంది ఆమెకి సమాధానం చెప్పలేక అందరూ మన కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు నిజం చెప్పకపోయినా ఈరోజు ఎలాగైనా నిజం తెలుస్తుంది అనుకుంటుంది కావ్య.

మరోవైపు స్వప్న చేతి వేలిముద్రలు సంపాదించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది రుద్రాణి. ఆమె కోసం జ్యూసులు చేస్తూ ఉంటుంది.అప్పుడే రాహుల్ అక్కడికి వచ్చి అనుకున్న పని అయిందా అని అడుగుతాడు. పొద్దుటి నుంచి దానికి అరగలేదట జ్యూస్ ల మీద జ్యూసులు తీస్తూనే ఉన్నాను కానీ అది తాగటం లేదు. అన్ని రెడీ చేసి ఉంచండి ఎప్పుడు ఏది కావాలంటే అది తాగుతాను అంటూ ఆర్డర్లు వేస్తుంది అని చిరాకు పడుతుంది రుద్రాణి. అప్పుడే స్వప్న అక్కడికి వచ్చి ఆకలి వేస్తుంది అని చెప్తుంది.

ఫుడ్ ప్రిపేర్ చేయటానికి టైం పడుతుంది కదా ఈలోపు నువ్వు జ్యూస్ తాగు అంటుంది. రాహుల్ ఆమెను వెనక్కి తిప్పి మాటల్లో పెడతాడు. ఇంతలో జ్యూస్ లో మత్తుమందు కలిపి స్వప్నకి ఇస్తుంది రుద్రాణి. అది తాగిన స్వప్న డిన్నర్ కి నాన్స్ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమె చేతి వేలిముద్రలు తీసుకోవటానికి ప్లాన్ వేసుకుంటారు తల్లీ కొడుకులు. మరోవైపు భర్తల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు యూనియన్ పార్టీకి వచ్చిన ఆడవాళ్లు. అక్కడ భర్త గురించి, భర్త గొప్పతనం గురించి గొప్పగా చెప్తుంది కావ్య.

Brahmamudi serial April 16th Episode of 384 Here is full story

అలాగే రాజ్ భార్య గురించి, భార్య గొప్పతనం గురించి గొప్పగా చెప్తాడు. వాళ్ళ ఇద్దరి మాటలు విన్న శ్వేత ఇంత అన్యోన్యత ఉన్న వీళ్ళిద్దరూ వెన్నెల రాకతో కలుస్తారా.. విడిపోతారా అని ఆరాటపడుతుంది. ఇంతలో పాప ఏడుస్తుంటే ఆయా తీసుకు వస్తుంది. రాజ్ ఎత్తుకుంటే అక్కడికి ఒక ఆవిడ వచ్చి నా బిడ్డని నా దగ్గర నుంచి దూరం చేస్తావా,నీకు అసలు మనసే లేదా అని అడుగుతుంది. అందరూ షాక్ అయి చూస్తారు.

కావ్య ఆమె వెన్నెల ఏమో అనుకుంటుంది. కానీ ఆమె రాజ్ వాళ్ళ టెన్త్ క్లాస్ క్లాస్మెట్. ప్రాంక్చేయడానికి అలా చేస్తుంది. ఆమెని అందరూ మందలిస్తారు. మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావు ఇంట్లో కూడా ఇంతేనా నీ భర్త ఎలా భరిస్తున్నాడు అంటూ చివాట్లు పెడతారు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే శ్వేతని పక్కకి తీసుకువెళ్లి వెన్నెల ఇంకా రాలేదా అని అడుగుతుంది కావ్య.

ఒకసారి ఫోన్ చెయ్యు అని చెప్తుంది. ఫోన్ చేసిన శ్వేతకి ఇంకా 20 మినిట్స్ పడుతుంది పార్టీకి రాజు వచ్చాడా అని అడుగుతుంది వెన్నెల. వచ్చాడు అంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమో అని రాలేదు అని చెప్తుంది శ్వేత. అదే విషయం కావ్య కి చెప్తుంది. నిజమే మా ఆయన ఇక్కడ ఉన్నట్టు వెన్నెలకి తెలియకపోవటమే మంచిది తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X