Brahmamudi April 17th Episode : తల్లీకొడుకుల్ని కలిపిన కావ్య.. అపర్ణకి షాకిచ్చిన రాజ్
రాజ్ షర్ట్‌ను చూస్తూ ఆ జ్ఞాపకాలలోకి వెళ్లిపోతుంది కావ్య. తర్వాత తేరుకుని రాజ్‌కు షర్ట్ కొరియర్ చేసి ఫోన్ చేసి చెబుతుంది. కావ్య పంపిన షర్ట్ తీసుకుని కొరియర్ బాయ్ రావడంతో యామిని తలుపు తీసి చూస్తుంది. దాంతో కంగారుపడిన రాజ్.. ఈ షర్ట్ నేనే ఆర్డర్ చేశానని అంటాడు. రేపు మీరు అన్నదానానికి ఈ డ్రెస్‌లోనే రావాలని చెప్పడంతో రాజ్ సరేనని అంటాడు.
ఉదయాన్నే అన్నదానానికి అవసరమైన సామాగ్రి తీసుకుని కావ్య , అపర్ణ బయల్దేరే సరికి రుద్రాణికి డౌట్ వస్తుంది. నిజంగానే రాజ్ బతికొచ్చి అన్నదానం చేస్తున్నంత హడావుడి చేస్తున్నావేంటీ అని ప్రశ్నిస్తుంది. రాజే అన్నదానం చేస్తున్నానని అపర్ణ నోరు జారడంతో కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అపర్ణ, కావ్యలు ఏదోలాగా కవర్ చేసుకుని అక్కడి నుంచి బయటపడతారు. తర్వాత అందరూ కలిసి రుద్రాణికి క్లాస్ పీకుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 17వ తేదీ ఎపిసోడ్ 698లో ఏం జరిగిందంటే?

అపర్ణలో ఒక్కసారిగా వచ్చిన మార్పుకి రాహుల్ - రుద్రాణికి అనుమానం వస్తుంది. కావ్య పంపించిన షర్ట్ వేసుకుని గుడికి బయల్దేరేందుకు రెడీ అవుతాడు రాజ్. అతనిని చూడగానే యామిని అతని తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఈ డ్రెస్‌లో మీరు చాలా బాగున్నారని అందరూ కాంప్లిమెంట్ ఇస్తారు. ఏమైనా స్పెషల్ ఉందా? ఇంత బాగా రెడీ అయ్యారని రఘునాథ్ అడుగుతాడు. గుడికి వెళ్తున్నానని రాహుల్ చెప్పడంతో .. మీరు, అమ్మాయి కలిసి వెళ్తున్నారా? అని అడుగుతుంది వైదేహి. యామిని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని అంటుంది. తను రావడం లేదని నేనొక్కడినే వెళ్తున్నానని చెబుతాడు రాజ్.
ఈ డ్రెస్ చాలా బాగుందని, యామిని గిఫ్ట్‌గా ఇచ్చిందా? అని అడుగుతుంది వైదేహి. బావే ఈ డ్రెస్ బుక్ చేసుకున్నాడని చెబుతుంది యామిని. నాకు నీ డ్రెస్ అస్సలు నచ్చలేదని రాజ్‌ని బాధపెడుతుంది. అది పాత షర్ట్‌లా రెండు మూడు సార్లు వాడిన షర్ట్‌లా ఉందని అంటుంది. చూసే కళ్లను బట్టి ఉంటుందని, అందరికీ నచ్చి నీకు మాత్రం నచ్చలేదంటే ప్రాబ్లం నీలోనే ఉందని అంటాడు రాజ్. మోడ్రన్‌గా వెస్ట్రన్ కల్చర్‌ను ఫాలో అయ్యే నీలాంటి అమ్మాయికి మన ట్రెడిషన్ గురించి, ఈ ట్రెడిషనల్ డ్రెస్‌ల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నిస్తాడు రాజ్. ఏ గుడికి వెళ్తున్నావని యామిని అడగ్గా.. శివాలయానికి వెళ్తున్నానని చెబుతాడు.
గుడికి వెళ్తున్నానని చెప్పాడు కదా మళ్లీ ఎందుకు అడిగావని యామినిపై మండిపడుతుంది వైదేహి. నేను జీపీఎస్‌లో అన్ని తెలుసుకుంటున్నానని , కాకపోతే తను చెప్పే ప్లేస్.. వెళ్లే ప్లేస్ ఒకటేనా? కాదా? అని తెలుసుకోవడానికి అలా అడిగానని చెబుతుంది యామిని. తను నిజం చెబుతున్నాడో? అబద్ధం చెబుతున్నాడో? నాకో క్లారిటీ వస్తుంది కదా అని అంటుంది. రాజ్ కోసం గుడిలో కావ్య, అపర్ణ ఎదురుచూస్తుంటారు.
నేను ఇంట్లో ఏడుస్తున్నానని , అన్నం తినడం లేదని వాడు బతికే ఉన్నాడని అబద్ధం చెప్పావా? అని కావ్యని అడుగుతుంది అపర్ణ. నేను మీకు అబద్ధం చెబుతానా? ఆయనతో నేను మాట్లాడాను.. గుడికి రావడానికి ఒప్పుకున్నారని చెబుతుంది కావ్య. నిన్ను నమ్మి ఇక్కడి దాకా వచ్చానని .. వాడు కనుక రాకపోతే అన్నదానం సంగతి పక్కనపెడితే కనీసం ప్రసాదం కూడా ముట్టుకోనని అంటుంది అపర్ణ. ఆయన రాకపోతే అలాగే చేయండని చెబుతుంది కావ్య. ఇంతలో రాజ్ కారు రావడంతో మీ అబ్బాయి వచ్చేశాడని అంటుంది కావ్య.
రాజ్‌ని చూసి అపర్ణ ఆనందంతో షాక్ అవుతుంది. నా కొడుక్కి ఏం కాలేదని, వాడు బతికే ఉన్నాడని అంటుంది అపర్ణ. కొడుక్కి ఎదురెళ్లి పలకరించేందుకు అపర్ణ ముందుకు వెళ్లబోతుండగా కావ్య ఆపుతుంది. మీరు అక్కడికి వెళ్లొద్దని, మీరు ఇలా ఎమోషనల్ అవుతారనే ఇన్నాళ్లు నేను మీకు చూపించలేదని అంటుంది కావ్య. ఇన్నాళ్లు దూరమైన కొడుకు ఇప్పుడు కళ్ల ముందుకు వచ్చాడని, కనీసం వాడి దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉండమంటావని అడుగుతుంది అపర్ణ. ఆయన మీ కొడుకేనని మనకి తెలుసని, కానీ ఆయనకు అది తెలియదని అంటుంది . ఆయన గతం మరిచిపోయారని మీకు ఇప్పటికే చెప్పానని.. ఆ సంగతి మరిచిపోవద్దని చెబుతుంది కావ్య.
ఒక్కసారి వాడితో మాట్లాడాలని ఉందని అపర్ణ చెప్పడంతో దానికి ఇది టైం కాదని అంటుంది కావ్య. మీరు ఒక్క మాటతో ఆగరని, అమ్మా అని పిలిపించుకోవాలని ఆరాటపడతారని చెబుతుంది. దాంతో మీరు ఎవరో తెలుసుకోవాలని ఆయన ఆలోచించడం మొదలుపెడతారని , ఆయన దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తే అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని అంటుంది. మీరు మౌనంగా ఉండక తప్పదని చెబుతుంది. వాడిని కనీసం దగ్గరి నుంచైనా చూస్తానని అపర్ణ అడగటంతో చూడటం వరకు ఓకే కానీ పలకరించొద్దని అంటుంది కావ్య.
మరోవైపు కావ్య కోసం రాజ్ అటు ఇటూ వెతుకుతుంటాడు. రాజ్‌ని చూస్తూ మెట్లు దిగుతుండగా అపర్ణ కిందపడిపోబోతుంది. దాంతో ఆమెను పట్టుకుంటాడు రాజ్. కళ్లు తిరిగాయా అని రాజ్ అడగ్గా.. ఉపవాసం ఉండటం వల్ల కళ్లు తిరిగాయని చెబుతుంది అపర్ణ. ఆమె వెనక్కి తిరిగి వెళ్లబోతుండగా రాజ్ అమ్మా అని గట్టిగా పిలుస్తాడు. దాంతో రాజ్‌కి గతం గుర్తొచ్చిందని కావ్య, అపర్ణలు అనుకుంటారు. మీ కర్చీఫ్ కింద పడిపోయిందని ఇస్తాడు రాజ్. తర్వాత అపర్ణని పక్కకి తీసుకెళ్తుంది కావ్య. నువ్వు చెప్పినట్లుగానే వాడితో ఒక్కమాట కూడా మాట్లాడలేదని అంటుంది అపర్ణ.
కనీసం దగ్గరి నుంచి చూశారు కదా అని చెబుతుంది కావ్య. కానీ వాడు నన్ను అమ్మా అని పిలవగానే గుర్తుపట్టేశారని అనుకున్నానని అంటుంది అపర్ణ. కానీ కర్చీఫ్ ఇచ్చేసి వెళ్లాడని చెబుతుంది. ఆయనకు మీకు ఎదురైన ప్రతిసారి మీరు ఇంత ఎమోషనల్‌గా కనిపిస్తే ఆయనకి ఎక్కడో అనుమానం కలుగుతుందని చెబుతుంది కావ్య. గతం ఆయనకి గుర్తొస్తే పర్లేదని, కానీ ఆయన గుర్తుచేసుకుంటే మాత్రం అది ఆయన ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తుంది కావ్య. ఇంతలో రాజ్ ఫోన్ చేయడంతో కావ్యని కొడుకు దగ్గరికి పంపిస్తుంది అపర్ణ. ఆలయంలో దేవుడికి దండం పెట్టుకుంటున్న కొడుకు, కోడల్ని చూసి రాజ్ సంతోషిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











