Brahmamudi April 17th Episode: నందూకి మస్కా కొట్టి స్వరాజ్..మరో అబ్బాయితో దొరికిన రోజా.. వెంకీ మనసు ముక్కలు
Photo Courtesy: JioHotstar
మేం ఎంత చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు.. అందుకే మీ అమ్మాయి వేళ్లు కట్ చేసి పార్శిల్ చేస్తానని స్వరాజ్ వార్నింగ్ ఇవ్వడంతో రేఖ, నందూ షాక్ అవుతారు. నువ్వు అడిగిన కోటి రూపాయలు ఇవ్వడానికి మాకు రెండు రోజులు టైం కావాలని రేఖ చెప్పడంతో స్వరాజ్ ఓకే అంటాడు. నందూ చెప్పినంత సేపు రేఖ కాల్ మాట్లాడుతూ ఉండటంతో ఇందూని దాచిన ఏరియాని పోలీసులు ట్రేస్ చేస్తారు. మనకి కోటి రూపాయలు ఎవరిస్తారు? ఆ చక్రీ కూడా పాత బాకీ కోసం పీక్కుతింటున్నాడని రేఖతో భూషణ్ చెబుతాడు. ఇందూ కిడ్నాప్ వల్ల వచ్చే డబ్బుతో ఏం చేయాలా అని లక్కీ గాలిలో లెక్కలు వేస్తూ ఉండటంతో స్వరాజ్ క్లాస్ పీకుతాడు.
ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో లక్కీ తీసి చూడగా అక్కడ పోలీసులు ఉండటంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఇటువైపు ఓ దొంగ పారిపోయి వచ్చాడని వాడు ఇప్పటికే 150 మందిని చంపేశాడని చెప్పడంతో స్వరాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఇక్కడికి ఎవరూ రాలేదని మేం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుంటున్నామని స్వరాజ్- ఇందూలని భార్యాభర్తలని చెబుతాడు. ఈరోజుల్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ దొరకడం మీ అదృష్టమని లక్కీని మెచ్చుకుని పోలీసులు వెళ్లిపోతారు. మీరు నన్ను వదిలేస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తానని ఇందూ ఆఫర్ ఇవ్వడంతో లక్కీ, స్వరాజ్‌లు నవ్వేస్తారు. నేను దుగ్గిరాల ఇంటికి వారసురాలిని, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి కాబోయే ఛైర్మన్‌ని అని ఇందూ చెప్పడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. ఇందూని వెతికేందుకు వెంకీ సాయం తీసుకుంటుంది నందూ. పోలీసులకు ఇందూ ఫోటో చూపిస్తుండగా వాళ్లకు ఫోన్ రావడంతో వెళ్లిపోతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 17వ తేదీ ఎపిసోడ్ 1009లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూని వెతుక్కుంటూ ప్రతి ఇంటికి తిరుగుతున్న నందూ.. రాజ్- లక్కీలు ఉన్న ఇంటికి కూడా వస్తుంది. వాళ్లిద్దరినీ చూసి లోపల కంగారుపడతారు. ఇంతలో నందూ డోర్ కొట్టడంతో ఇద్దరూ వణికిపోతారు. డోర్ తీయకపోతే అనుమానం వస్తుంది, తీస్తే మా తమ్ముడు గుర్తుపడతాడని చెబుతాడు రాజ్. నేను చూసుకుంటానని రాజ్ వెళ్లి తలుపు తీస్తాడు. ఇంతలో ఫోన్ రావడంతో వెంకీ వెళ్లిపోతాడు. నేను ఒకరిని వెతుక్కుంటూ వచ్చానని ఫోటో తీసి చూపిస్తుంది నందూ. అది చూడగానే రాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఈమెను మేమిద్దరం చూడలేదని రాజ్ కవర్ చేస్తుండగా.. ఇందూ మిమ్మల్ని చూసి గొడవ పడిందని తెలియదంటున్నారని నిలదీస్తుంది నందూ.
రాజ్- లక్కీల ముఖం చూసి నందూకి అనుమానం వస్తుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు చెప్పమని వెళ్లిపోతుంది నందూ. ఇంతలో వెంకీ వచ్చి నా రోజా ఎక్కడుందో తెలిసిందని సంతోషంగా చెబుతాడు. అయితే ఇంటి బయట ఆడపిల్ల బట్టలు ఆరేసి ఉండటంతో నందూకి అనుమానం వస్తుంది. ఆ వెంటనే నందూని తీసుకుని రోజా దగ్గరికి వెళ్తాడు వెంకీ. ఇలా వెళితే నీ రోజా కోప్పడుతుంది... ఇంకో రోజు వెళ్దామని చెబుతుంది నందూ. అయినప్పటికీ వెంకీ వినిపించుకోకుండా రెస్టారెంట్ లోపలికి తీసుకెళ్లగా.. అక్కడ రోజా మరో కుర్రాడితో కబుర్లు చెబుతూ ఉంటుంది.
అది చూసి నందూ షాక్ అవుతుంది. నవ్వు సర్‌ప్రైజ్ ఇద్దామని వస్తే.. అదే నీకు సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఉందని అంటుంది నందూ. ఒకమ్మాయి... అబ్బాయితో కలిసి కాఫీ షాప్‌కు రాకూడదా? వస్తే వాళ్ల మధ్య ఏదో ఉన్నట్లా అని ప్రశ్నిస్తాడు వెంకీ. మరో కుర్రాడు రోజాని టచ్ చేస్తుండటం, ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ ఉండటం చూసిన నందూ.. నీ పరిస్ధితి చూస్తే జాలేస్తుంది. ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా కష్టమని వార్నింగ్ ఇస్తుంది నందూ. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ముందు విని.. ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను డిసైడ్ చేస్తానని చెబుతుంది నందూ.
నన్ను నీ లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకుంటే నీకు నమ్మకమైన బిజినెస్ పార్ట్‌నర్‌ని అవుతానని ఆ కుర్రాడికి చెబుతుంది రోజా. ఆ మాటలు విన్న వెంకీ - నందూలు షాక్ అవుతారు. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు అన్ని రకాలుగా ప్రాఫిట్ అని రోజా అనగానే.. వెంకీ గుండె పట్టుకుంటాడు. నీ వెంట ఎవరో తిరుగుతున్నారని అన్నావు కదా మరి వాడి సంగతి ఏంటని ఆ కుర్రాడు అడగ్గా.. ఆ వెంకీ గాడు ఒక వేస్ట్ ఫెలో, జెన్ జీలో పుట్టిన క్రేంజ్ ఫెలో. ఏదో కొన్నిరోజులు తిప్పుకుని వాడుకుని వదిలేద్దామని అనుకున్నానని అంటూ చెప్పడంతో వెంకీ రగిలిపోతాడు. వెంటనే వెళ్లి రోజాతో గొడవ పెట్టుకుంటాడు.
నీ గురించి మా నందూ ముందు నుంచి వార్నింగ్ ఇస్తూనే ఉంది, అయినా నేనే పట్టించుకోలేదంటూ రోజాని నానామాటలు అంటాడు. దాంతో రోజా సీరియస్ అవుతుంది. నా లైఫ్.. నా ఇష్టం, ఎవరితోనైనా తిరుగుతానని తేల్చేస్తుంది రోజా. నీకంటే ముందు చాలా మందితో తిరిగాను.. అలాగని వాళ్లందరినీ పెళ్లి చేసుకోవాలా అని అంటుంది రోజా. ఒక ఆడదాని మెడలో తాళికట్టి .. దాని చేత కాఫీలు, పకోడీలు చేసుకుని తిని మురిసిపోయే పరోటాగాడివి నవ్వు, నువ్వొక అరిగిపోయిన టేప్ రికార్డర్. నీలాంటోడిని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ సేవలు చేయడానికి నేను సిద్ధంగా లేను, ఇంకోసారి నా వెంట పడ్డావంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇస్తుంది రోజా. జీవితంలో ఇకపై ఏ అమ్మాయిని నమ్మనని నందూతో చెప్పి కోపంగా వెళ్లిపోతాడు వెంకీ.
తాను కిడ్నాప్ అయిన విషయం స్వాతికి చెప్పాలని అనుకున్న ఇందూ.. రాజ్ ఫోన్‌ని దొంగతనంగా కొట్టేస్తుంది. స్వాతికి ఫోన్ చేస్తుండగా లక్కీ ఫోన్ కోసం వస్తాడు. ఇందూ ఫోన్ మాట్లాడటం చూసిన లక్కీ ఈ విషయం స్వరాజ్‌కి చెప్పడంతో ఇద్దరూ కలిసి ఇందూ దగ్గర ఫోన్ లాక్కుంటారు. నేను సేఫ్‌గా ఉన్నానని మా చెల్లికి చెప్పాలని అంటుంది ఇందూ. ఇక్కడ మేమిద్దరం నిన్ను జాగ్రత్తగానే చూసుకుంటున్నాం కదా? అయినా ఎందుకు ఇలా చేస్తున్నావని రాజ్ సీరియస్ అవుతాడు. ఈ కిడ్నాప్ విషయంలో ఏ తప్పు జరిగినా అది నన్ను నమ్ముకున్నవారికి పెద్ద శిక్షగా మారుతుందని చెబుతాడు స్వరాజ్.
ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు మాత్రమే, నువ్వు గొప్పింట్లో పెరిగావు కాబట్టి నీకు డబ్బు విలువ తెలియదు. నీకు నిజంగా అంత ప్రేముంటే ఇంట్లో వాళ్లని వదిలేసి ఎందుకు పారిపోవాలని అనుకుంటావని నిలదీస్తాడు రాజ్. నీ పర్సనల్స్ మేం టచ్ చేయకూడదు, మా పర్సనల్స్ మాత్రం నేను చెప్పాలా అంటాడు. అమ్మాయిని ఎత్తుకు రావడం కూడా పెద్ద ప్లానా? చేతకాని వాళ్లే ఇలాంటి ప్లాన్స్ వేస్తారు. నేను బయటికి వెళ్లాక మీ పని చెబుతానని వార్నింగ్ ఇస్తాడు స్వరాజ్.
ఇందూ కనిపించకపోవడంతో అపర్ణ- స్వాతిలు ఏడుస్తుంటారు. ఇదంతా నా వల్లే జరిగింది, ఈ ట్రస్ట్‌లు, ఈ ఆస్తులు ఏమైపోతాయోనని నేను భయపడటం వల్లే ఈ రోజు నా ఇందూ దూరమైంది. ఆస్తిని కాపాడమని బలవంతం పెట్టానని బాధపడుతుంది అపర్ణ. అక్కకి ఏం కాదు, చాలా ధైర్యవంతురాలని చెబుతుంది స్వాతి. ఇన్నిరోజులు ఇందూ కోసం రేఖ దగ్గర చచ్చిన మనిషిలా బతుకుతున్నానని చెబుతుంది అపర్ణ. రేఖ ఆంటీ అక్క చేసే సంతకం కోసం ఎదురుచూస్తుంది, మా అమ్మకి అంత ధైర్యం లేదు. మరి అక్కని ఎవరు కిడ్నాప్ చేశారని స్వాతి అనుమానిస్తుంది. రేఖ నుంచి తప్పించుకోవాలని ఇలాంటి పనిచేసింది.. బాగా తెలిసినవాళ్లే ఈ పనిచేయించారని అంటుంది అపర్ణ. ఇంతలో నందూ వచ్చి నేనుండగా అక్కకి ఏం కానివ్వనని చెబుతుంది. ఆ ఏరియా మొత్తం వెతికాను, అక్క ఎక్కడా కనిపించలేదని చెబుతుంది నందూ. కిడ్నాపర్లకు కావాల్సింది డబ్బు మాత్రమే.. అక్క ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటానని అంటుంది నందూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications