Brahmamudi April 17th episode: తల్లి కొడుకుల చేతిలో మోసపోయిన స్వప్న.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వెన్నెల!

పోలీస్ సెలక్షన్ కి సెలెక్ట్ కాకపోవటంతో చాలా బాధపడుతుంది అప్పు. శ్వేత సహాయంతో వెన్నెల ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కావ్య. రుద్రాణి కోడలి దగ్గరనుంచి ఆస్తి కొట్టేయటానికి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. రీ యూనియన్ పార్టీకి వెన్నెల వస్తుందో లేదో అని కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటారు కావ్య, శ్వేత. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 17వ తేదీ ఎపిసోడ్ 386 లో ఏం జరిగిందంటే..

వెన్నెల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది శ్వేత. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అంటాడు రాజ్. వెన్నెల కోసం అంటుంది శ్వేత. ఒక్కసారి గా షాక్ అవుతాడు రాజ్. తను వస్తుందని ముందే ఎందుకు చెప్పలేదు అంటాడు. వెన్నెల వస్తుందా అంటూ కంగారుగా అక్కడికి వస్తుంది కావ్య. వెన్నెల నీకు తెలుసా అంటుంది శ్వేత. నాకు ఒక వెన్నెల తెలుసు, మరి ఆ వెన్నెల ఈ వెన్నెల ఒకరో కాదో తెలియదు అంటుంది కావ్య.

Brahmamudi serial April 17th Episode of 386 Here is full story

వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వెన్నెల వస్తుంది. నిజం బయటపడిపోతుందని కంగారు పడిపోతాడు రాజ్. మరోవైపు స్వప్న మత్తులో ఉంటుంది ఆమె చేతి వేలిముద్రలు తీసుకుందామని స్వప్న గది డోర్ ఓపెన్ చేస్తారు రాహుల్, రుద్రాణి. అక్కడ స్వప్న తీన్మార్ డాన్స్ చేస్తూ ఉంటే అది చూసి షాక్ అవుతారు తల్లి కొడుకులు.

ఇదేంటి మత్తుగా పడుకుంటుంది అనుకుంటే ఇలా డాన్స్ చేస్తుంది ఇప్పుడు ఎలా అంటుంది రుద్రాణి. ఇది కూడా మన మంచికే వేలిముద్రలు కాకుండా తన సంతకమే తీసుకుందాము ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి తనతో పాటు డాన్స్ చేస్తాను నువ్వు మెల్లగా వెళ్లి ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో చూడు అని తల్లితో చెప్పి లోపలికి వెళ్లి స్వప్నతో డాన్స్ చేస్తూ ఉంటాడు. మత్తులో ఉన్న స్వప్న డాన్స్ చేస్తూ ఉంటే రుద్రాణి వెనకగా వెళ్లి కబోర్డ్ లో ఉన్న ఆస్తి పేపర్లు తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోబోతుంది.

అది చూసిన స్వప్న మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు అంటుంది. నిజం బయటపడిపోయిందని షాక్ అవుతారు రాహుల్, రుద్రాణి. మీరు కూడా నాతో పాటు డాన్స్ చేయడానికి వచ్చారు కదా అంటూ తనతో పాటు అత్తని కూడా డాన్స్ చేయిపిస్తుంది స్వప్న. రాహుల్ మాట్లాడుతూ నువ్వు మంచి మోడల్ వి అయిపోతావు అప్పుడు అందరూ నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవటానికి వస్తారు అందుకే ముందుగా నీ ఆటోగ్రాఫ్ నాకే ఇవ్వు అంటాడు. ఎక్కడ పెట్టాలి అంటుంది స్వప్న.

ఆస్తి పేపర్స్ చూపించి దానిమీద సంతకం పెట్టమంటాడురాహుల్. మత్తులో ఉన్న స్వప్న సంతకం పెట్టేసి స్పృహ కోల్పోతుంది. ఈ పేపర్స్ తాకట్టు పెట్టి కోటి రూపాయలు అప్పు తీసుకొస్తాను డబ్బు మనకి, అప్పు దానికి అప్పుడు ఇంట్లో వాళ్ళు దానిని బయటికి గెంటేస్తారు అనుకుంటారు తల్లి కొడుకులు. మరోవైపు పార్టీకి వచ్చిన వెన్నెలని అందరూ పలకరిస్తారు. టెన్త్ క్లాస్ తర్వాత కనిపించకుండా పోయావు, ఏమైపోయావు అని అడుగుతాడు ఒక ఫ్రెండ్.

Brahmamudi serial April 17th Episode of 386 Here is full story

అప్పుడు స్టేజ్ ఎక్కి తన కథ అంతా చెప్తుంది వెన్నెల. తను వెన్నెల కాదని తను వెన్నెల ఇద్దరు కావల పిల్లలు అని వెన్నెల చనిపోయిందని, ఆ విషయం రాజ్ కి చెప్పానని చెప్తుంది. ఎమోషనల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఆ వెనకనే శ్వేత కూడా వస్తుంది. నా భర్తని అందరూ తప్పు చేశారు అన్నారు కానీ నా భర్త తప్పు చేయరు అనే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైంది.

ఎక్కడ వెన్నెల ఆయన జీవితంలోకి వస్తుందో, నేను ఎక్కడ ఆయన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలో అని కంగారు పడ్డాను. కానీ 10 ఏళ్ల క్రితం చనిపోయిన వెన్నెలతో ఆయన బిడ్డని ఎలా కంటారు కాబట్టి ఆయన అబద్ధం చెప్పారు అంటుంది. ఆ బిడ్డ వల్ల భార్యని కుటుంబాన్ని దూరం చేసుకోవలసిన పరిస్థితి వచ్చినా కూడా రాజ్ ఎందుకు అంత పెద్ద అబద్ధం చెప్పాడు అంటుంది శ్వేత. అదే తెలుసుకోవాలి అంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X