Brahmamudi April 18th Episode : యామినికి వైదేహి క్లాస్ .. రాజ్‌తో ఇక తాడో పేడో, అపర్ణ ఎవరో తెలుసుకున్న రాజ్

నిన్నటిదాకా బాధతో కుమిలిపోయిన అపర్ణలో ఒక్కసారిగా వచ్చిన మార్పుతో రాహుల్ - రుద్రాణిలో అనుమానం కలుగుతుంది. కావ్య పంపిన వైట్ షర్ట్ వేసుకుని కిందకి వచ్చిన రాజ్‌ని చూసి యామిని తల్లిదండ్రులు డ్రెస్ బాగుందని మెచ్చుకుంటారు. యామిని మాత్రం అస్సలు బాలేదని అనడంతో రాజ్ కౌంటరిస్తాడు. గుడికి వచ్చిన అపర్ణ.. రాజ్ ఎక్కడ? నాకు చూపిస్తానని అన్నావ్ కదా? అని కావ్యని నిలదీస్తుంది. ఇంతలో రాజ్ కారు దిగడంతో కొడుకుని చూసి అపర్ణ కన్నీరు పెడుతుంది. అతనికి ఎదురుగా వెళ్లినా రాజ్ గుర్తుపట్టడు.

ఇంతలో రాజ్‌.. అపర్ణను అమ్మ అని పిలవడంతో అతనికి గతం గుర్తొచ్చిందని కావ్య, అపర్ణ అనుకుంటారు. అయితే కర్చీఫ్ పడిపోవడంతో అది ఇవ్వడానికి రాజ్ పిలుస్తాడు. రాజ్‌ను చూస్తూ కంటతడి పెడుతున్న అపర్ణని చూసి కావ్య పక్కకి తీసుకెళ్తుంది. మీరు అంతలా ఎమోషనల్ అయితే ఆయనకు డౌట్ వస్తుందని హెచ్చరిస్తుంది. నేను ఇంక డిస్ట్రబ్ చేయను, దూరం నుంచి చూస్తానని అంటుంది. కావ్య కోసం రాజ్ ఫోన్ చేయడంతో ఆమె గుడి లోపలికి వెళ్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్ 699లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 18th 2025 Episode 699 Here is Today s full story

రాజ్ - కావ్యలు దంపతులిద్దరూ సీతారాముల్లా చూడముచ్చటగా ఉన్నారని పంతులు గారు అనడంతో అపర్ణ సంతోషిస్తుంది. పూజారి గారు మీరు పొరపాటు పడ్డారని.. ఈవిడ మా ఆవిడ కాదని , బాగా తెలిసిన వ్యక్తి అంటాడు రాజ్. ఆ మాటలతో అపర్ణ, కావ్యలు షాక్ అవుతారు. ఎవరి పేరు మీద అర్చన చేయించాలని అడగ్గా.. మా అమ్మ పేరు మీద, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు అని చెబుతాడు రాజ్. దాంతో అపర్ణ, కావ్యలు మురిసిపోతారు. మీ అమ్మగారి పేరు చెప్పండి అని పూజారి అడగ్గా రాజ్‌కు ఏమీ గుర్తుండదు. యామిని సెట్ చేసిన భానుమతి పేరు చెప్పేసరికి అపర్ణ షాక్ అవుతుంది. గోత్రం ఏంటని అడగ్గా, నా చిన్నప్పుడే మా అమ్మనాన్న చనిపోయారని అప్పటి నుంచి నాకు నా గోత్రం ఏంటో ఎవరు చెప్పలేదని అంటాడు.

మరోవైపు.. రాజ్ ఎక్కడికి వెళ్లాడో జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంటుంది యామిని. బావ శివాలయానికే వెళ్లాడని, దర్శనం ఒక్కటే అయితే రెండు నిమిషాలు చాలు , పోనీ ప్రదక్షిణ అనుకున్నా 10 నిమిషాలు.. వెళ్లి గంటపైనే అవుతోంది ఏం చేస్తున్నాడని అనుమాన పడుతుంది యామిని. భక్తి పారవశ్యంలో మునిగిపోయాడేమో అంటుంది వైదేహి. అంత భక్తితో ఉండటానికి ఆయన భక్త కన్నప్ప కాదని, రామ్‌గా మారిన రాజ్ అంటుంది యామిని. అక్కడ ఎవరైనా తనకు తెలిసినవాళ్లు ఎదురుపడ్డారేమో? లేదా తనే ఎవరినైనా కలవడానికి వెళ్లుండాలని చెబుతుంది.

ఆ మాటలతో వైదేహి షాక్ అవుతుంది. నీ ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లో డ్రెస్ బుక్ చేయడం ఏంటీ? ట్రెడిషనల్‌గా రెడీ అయి గుడికి వెళ్లడం ఏంటీ? నువ్వూ ఒకసారి గుడికి వెళ్లడమే మంచిందని అంటుంది వైదేహి. నేను అలాగే అనుకుంటున్నానని.. కానీ తను నా మీద సీరియస్ అవుతున్నాడని, నేను అతని వెంట పడుతున్నట్లు ఫీల్ అవుతున్నాడని చెబుతుంది. ఇప్పుడు గొడవ చేస్తాడని వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని, ఇన్నిరోజులు నువ్వు పడిన కష్టమంతా వేస్ట్ అవుతుందని అంటుంది వైదేహి. రాజ్ మళ్లీ మిస్ అయ్యాడని నువ్వు డిప్రెషన్‌లోకి వెళితే.. ఆ బాధలు పడే ఓపిక మాకు లేదని చెబుతుంది. తిడితే తర్వాత సర్ది చెప్పుకోవచ్చు.. కానీ అతను మళ్లీ నీ చేయి దాటిపోకుండా చూసుకోమని అంటుంది.

పూజ పూర్తి కావడం రాజ్ - కావ్యలు అన్నదానం జరిపిస్తుంటారు. మధ్యలో అపర్ణ వచ్చి కూర్చోవడంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఇందాక మెట్ల మీద పడిపోతుంటే పట్టుకుంది మిమ్మల్నే కాదా అంటాడు. సమయానికి దేవుడిలా వచ్చి కాపాడావు అంటుంది అపర్ణ. మిమ్మల్ని చూస్తే ఆకలితోనే , అన్నం కోసం ఎదురుచూస్తున్న మనిషిలా అనిపించడం లేదని.. మీరే పదిమందికి అన్నం పెట్టేవారిలా కనిపిస్తున్నారని అంటాడు రాజ్. మీరు ఇలా అన్నదానంలో కూర్చోవడం ఆశ్చర్యంగా ఉందని చెబుతాడు. నాకు చాలా ఆనందంగా ఉందని, నువ్విలా అన్నదానం చేయడం చూసి నాకు కూడా తినాలనిపించి వచ్చేశానని అంటుంది అపర్ణ. ఈరోజు నా పుట్టినరోజని చెప్పడంతో ఆమెకు విషెస్ చెబుతాడు రాజ్.

ప్రతి ఏడాది నా పేరు మీద నా కొడుకు అన్నదానం చేయించేవాడని, కానీ తను ఇప్పుడు నా దగ్గర లేడని అందుకే ఒంటరిగా వచ్చానని అంటుంది అపర్ణ. అందరికీ ఆ దేవుడే బంధువని అలాంటప్పుడు ఎవ్వరూ ఒంటరి కాదని చెబుతాడు. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్లాడని రాజ్ ప్రశ్నించగా.. దగ్గరలోనే ఉన్నాడని చెబుతుంది అపర్ణ. ఆ దేవుడు మీ అబ్బాయిని మీతో కలుపుతాడని అంటాడు రాజ్. తర్వాత తల్లికి భోజనం వడ్డిస్తాడు .

ఇంతలో రాజ్.. కావ్యతో మాట్లాడుతూ అపర్ణ వైపు చూపిస్తాడు. అక్కడ భోజనం చేస్తున్న ఆమెను చూస్తుంటే నాకు చిన్నప్పుడు దూరమైన మా అమ్మే గుర్తొస్తుందని చెబుతాడు. ఆవిడ కొడుకు కూడా ఆవిడకు దూరంగా ఉంటున్నాడని అంటాడు. ఈరోజు ఆవిడ పుట్టినరోజుని, ప్రతి ఏడాది ఆమె కొడుకే దగ్గరుండి అన్నదానం చేయించేవాడని చెబుతాడు రాజ్. ఆమె కొడుకుని తీసుకొచ్చి అన్నదానం చేయిస్తారా? అని అడుగుతుంది కావ్య. అతని స్థానంలో మనం ఉండి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక కేక్ కట్ చేయిస్తే బాగుంటుందని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య చాలా సంతోషిస్తుంది.

అన్నదానం చేసినందుకు భక్తులు రాజ్‌ని , కావ్యని ప్రశంసించడంతో అంతా పొగుడుతారు. నేను ఎన్ని రకాలుగా మాట్లాడినా మనకు గతంలో పరిచయం ఉందా? లేదా? అన్న విషయం మాత్రం మీరు చెప్పడం లేదని అంటాడు రాజ్. మన సంగతి తర్వాత ముందు ఆవిడతో కేక్ కట్ చేయించమని అడుగుతుంది రాజ్. నేను ఆమెను తీసుకొని వస్తానని అపర్ణ దగ్గరికి వెళ్తాడు. మా అమ్మది, మీది ఒకేరోజు పుట్టినరోజు కావడం ఆశ్చర్యంగా ఉందని.. మా అమ్మ పేరుతో అన్నదానం చేశానని మీతో కేక్ కట్ చేయిస్తానని అంటాడు రాజ్. నేను మిమ్మల్ని మా అమ్మ అనుకుంటానని, మీరు కూడా నన్ను మీ కొడుకనే అనుకోండని చెబుతాడు. వచ్చి కేక్ కట్ చేస్తారా? అని ప్రశ్నిస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X