Brahmamudi April 18th Episode: ఇందూ జాడ కనిపెట్టిన నందూ.. రేఖ నగలన్నీ లాగేసిన చక్రీ

Photo Courtesy: JioHotstar

ఇందూని వెతుకుతూ వెంకీని వెంట పెట్టుకుని నందూ వస్తుండటంతో స్వరాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఇంతలో ఫోన్ రావడంతో లక్కీ పక్కకి వెళ్లిపోతాడు. స్వరాజ్- లక్కీలను గుర్తుపట్టిన నందూ.. వారికి ఇందూ ఫోటో చూపించి ఈ అమ్మాయి కిడ్నాప్ అయ్యిందని, ఆచూకీ తెలిస్తే చెప్పమని వెళ్లిపోతూ దండెం మీద ఆరేసిన ఇందూ బట్టల్ని చూస్తుంది. రోజా ఎక్కడుందో తెలియడంతో నందూని వెంట పెట్టుకుని వెళ్తాడు వెంకీ. అక్కడ మరో అబ్బాయితో రోజా క్లోజ్‌గా ఉండటంతో వారిద్దరి మాటల్ని వింటారు వెంకీ- నందూ. వెంకీ ఒక ఫెస్ట్ ఫెలో .. వాడిని వాడుకుని వదిలేస్తానని రోజా చెప్పడంతో వెంకీ గుండె ముక్కలై.. సీరియస్‌గా వెళ్లి రోజాతో గొడవ పడతాడు.

తనను ఎవరో కిడ్నాప్ చేశారో? ఎక్కడున్నానో స్వాతికి చెప్పాలని రాజ్ ఫోన్ తీసుకుని మాట్లాడుతుండగా లక్కీ, స్వరాజ్‌లు చూసి ఫోన్ లాక్కుంటారు. నేను ఎక్కడున్నది మా వాళ్లకి చెప్పాలని, లేదంటే కంగారు పడతారని ఇందూ బతిమలాడుతున్నా స్వరాజ్ పట్టించుకోడు. నిన్ను ఫ్రీగానే ఉంచుతున్నాం, మా డబ్బులు రాగానే వదిలేస్తామని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఇందూ ఎక్కడుందో తెలియక స్వాతి, అపర్ణలు ఏడుస్తూ ఉండగా.. అక్కడ ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్ 1010లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 18th 2026 Episode 1010 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూ కోసం బాధపడుతున్న అపర్ణ, స్వాతిలను ఓదారుస్తుంది నందూ. ఆ రేఖ మా పతనాన్ని కోరుకుంటూ, ఆస్తిని లాక్కోవాలని చూస్తుంటే మాతో ఏ బంధం లేని నువ్వు ఇంత సాహసం చేస్తున్నావని చెబుతుంది అపర్ణ. అక్క నన్ను చెల్లెలిలా హత్తుకుంది, అలాంటప్పుడు నేను పరాయి దానిని ఎలా అవుతానని చెబుతుంది. ఒక్క అవకాశం దొరికినా చాలు.. అక్కడ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది నందూ. నేరం చేసిన వాళ్లు ఎంత తెలివైన వాళ్లయినా సరే.. ఎక్కడో ఒకచోట చిన్న తప్పు చేసే ఉంటారు. అక్కని ఎత్తుకెళ్లిన వాళ్లు కూడా తప్పుకుండా ఏదో ఒక తప్పు చేసే ఉంటారని చెబుతుంది నందూ.

ఇందూకి భోజనం తీసుకొచ్చి ఇస్తాడు స్వరాజ్. మీరు తీసుకొచ్చిన దానిని కూడా భోజనం అంటారా? ఇందాక తెచ్చిన దానిలో అన్నం ఉడకలేదు, పప్పుని తుప్పు పట్టించారు, రసం పేరుతో నీళ్లు పోశారని చెబుతుంది. ఇందూ మాటలకు లక్కీ కూడా సపోర్ట్ చేస్తాడు. బిర్యానీ కోసం డ్రామాలు ఆడుతున్నావా అని మండిపడతాడు స్వరాజ్. నాకు బిర్యానీ కూడా వద్దు.. నాకు ఇంటి ఫుడ్ కావాలని అంటుంది ఇందూ. అయితే తినకు మానేయమని రాజ్ వెళ్లిపోతుండగా.. నాకు ఏదైనా జరిగితే మీకు డబ్బులు కాదు కదా, కనీసం చిల్లర కూడా రాదని ఇందూ హెచ్చరించడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. దాంతో ఇందూతోనే వండించాలని ప్లాన్ చేసిన స్వరాజ్- లక్కీలు ఆమెను కట్టేసి వంట గదిలో కావాల్సినవి అన్నీ తీసుకొస్తారు. నువ్వు ఎలా చేయాలో చెప్పు.. నేను చేస్తానని అంటాడు స్వరాజ్.

నన్ను వదిలేస్తే ఆ వంట నేనే చేస్తానని అంటుంది ఇందూ. తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా అని స్వరాజ్ అడగ్గా.. కావాలంటే మెయిన్ డోర్‌కి లాక్ చేయమని చెబుతుంది ఇందూ. మీ వంట చూసి భయం వేసింది అందుకే నా వంట నేనే చేసుకుంటానని అంటుంది. దాంతో ఇందూకి కట్లు విప్పుతాడు స్వరాజ్. పారిపోతున్నట్లుగా ఇందూ నాటకం వేయడంతో స్వరాజ్, లక్కీలు కంగారుగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తారు. దీనిని ఎవడు చేసుకుంటాడో కానీ వాడి జీవితం నాశనమే అంటాడు స్వరాజ్. నాకెందుకో ఆ బాధితుడివి నువ్వే అనిపిస్తుందని అంటాడు లక్కీ. పోలీసుల ముందు ఇందూయే నీ పెళ్లామని చెప్పాను కదా? ఆ టైంలో దేవుడు నా నోటితో ఎందుకు అనిపించాడో చెబుతాడు లక్కీ. మెడ మీద కత్తి పెట్టి తాళి కట్టమంటే చచ్చిపోతానేమో కానీ తన మెడలో మాత్రం తాళి కట్టనని అంటాడు స్వరాజ్.

ఇందూని ఎవరు కిడ్నాప్ చేశారు? అనేది ఆలోచిస్తూ ఉంటుంది నందూ. ఆ వెంటనే ఇందూ బర్త్ డే ఫంక్షన్ వీడియోనిచూస్తుంది. ఆ క్రమంలో ఇందూ వేసుకున్న డ్రెస్.. స్వరాజ్ ఇంట్లో దండెం మీద ఆరేసి ఉండటంతో నందూకి మొత్తం తెలిసిపోతుంది. వెంటనే అక్కడికి బయల్దేరుతుంది. స్వరాజ్- లక్కీల కోసం భోజనం తయారు చేస్తుంది ఇందూ. ఆ వంటల వాసన చూసిన లక్కీ ఆమెను మెచ్చుకుంటాడు. ఇన్ని రోజులు నా వంటలకి పేరు పెట్టేవాళ్లే కానీ, నువ్వే నన్ను ఫస్ట్ టైం మెచ్చుకుంటున్నావని అంటుంది ఇందూ. ఇన్ని వంటలు తినాలంటే అదృష్టం ఉండాలని చెబుతాడు లక్కీ. అదృష్టం తర్వాత ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా అని అంటాడు స్వరాజ్. ఆ మాటలతో ఇందూ, లక్కీలు షాక్ అవుతారు.

మనం తినే అన్నంలో ఏ విషమో, మత్తు మందో కలిపి మనిద్దరం తిని పడిపోతే మేడం గారు తప్పించుకోవచ్చని ప్లాన్ వేసిందని అంటాడు స్వరాజ్. ఆ మాటలతో ఇందూ సీరియస్ అవుతుంది. తప్పించుకోవడానికి తినే అన్నంలో విషం కలిపేంత దుర్మార్గురాలిని కాదని అంటుంది. ముందు నువ్వు తింటేనే మేం తింటామని స్వరాజ్ చెబుతాడు. దాంతో వంటలన్నీ ఇందూతో తినిపిస్తాడు స్వరాజ్. మనుషుల్ని మోసం చేయడానికి నేను మీలాంటి దానిని కాదని అంటుంది ఇందూ. దాంతో లక్కీ, స్వరాజ్‌లు భోజనం చేస్తారు. ఇంతలో అక్కని వెతుక్కుంటూ నందూ ఆ ఇంటిలోకి వస్తుంది. వారంతా కలిసి భోజనం చేస్తుండటంతో షాక్ అవుతుంది నందూ.

ఇందూ గురించి రేఖ ఆలోచిస్తుండగా.. భ్రమరాంబ వచ్చి మంచి వంట మనిషిని చూడమని చెబుతుంది. ఈ పోలీసులకు వంట చేయలేకపోతున్నానని అంటుంది. పోలీసులను నమ్ముకుని ప్రయోజనం లేదు మీరే ఏదో ఒకటి చేయాలని రేఖకి చెబుతుంది ఐశ్వర్య. ఇందూని విడిపిస్తేనే కదా మనకి డబ్బులొచ్చేది అని అంటుంది. మనల్ని నమ్మి అంత డబ్బులు ఎవరిస్తారు అని శేషం చెబుతుండగా చక్రీ అప్పుడే ఇంటికొస్తాడు. అతనిని చూసి అంతా షాక్ అవుతారు. ఇందూ కిడ్నాప్ అయ్యింది, మీకు ఇప్పట్లో డబ్బు రాదు.. నా డబ్బు నాకు కావాల్సిందేనని చెబుతాడు చక్రీ. నీ మీద నమ్మకం పూర్తిగా పోయిందని రేఖతో చెబుతాడు.

డబ్బు విషయం పక్కనపెట్టు, మా ముందున్న ప్రాబ్లమ్ ఏంటో నీకు బాగా తెలుసు. నువ్వు గొడవ చేసినా సరే ఇప్పటికిప్పుడు, నీ అప్పు మొత్తం తీర్చడం కుదరదు. నేను మాట తప్పాను కాబట్టి, నా మీద కేసు వేసి నన్ను కోర్టుకు లాగొచ్చు. దాని వల్ల నీ టైంతో పాటు నా టైం కూడా వేస్ట్ చేసినట్లే అంటుంది రేఖ. నేను చెప్పినట్లు చేస్తే వారం రోజుల్లో నీ డబ్బులు నీకు వస్తాయి. ఇందూని కిడ్నాప్ చేసినవాళ్లు కోటిరూపాయలు డిమాండ్ చేస్తున్నారు, ఆ డబ్బు కనుక నేను వాళ్లకి ఇచ్చేస్తే.. ఇందూ తిరిగొచ్చేస్తుంది. ఒక్కసారి తను సంతకం పెట్టిందంటే నేను ఏం చేయగలనో నీకు తెలుసని అంటుంది రేఖ. నువ్వు ఆడిస్తున్నట్లు ఆడే బొమ్మలా కనిపిస్తున్నానా? నిన్ను నమ్మి కోటి రూపాయలు ఎలా ఇస్తానని అడుగుతాడు చక్రీ. నువ్వు ఇస్తావు.. నాకు తెలుసు అంటుంది రేఖ. ఈసారి మాత్రం నేను ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా లేను.. ఇప్పటి వరకు మీరు దాచుకున్న నగలు నా ముందు పెడితే కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు చక్రీ. ఆ మాటలతో రేఖ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X