Brahmamudi April 18th episode: కళ్యాణ్ మూడ్ పాడు చేసిన అనామిక.. ప్లాప్ అయిన రాహుల్ ప్లాన్!
ఎవరికి పుట్టిన బిడ్డనో తీసుకొచ్చిన రాజ్‌కు ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. బిడ్డ కారణంగా తన కంపెనీలో ఎండీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే బిడ్డకు తల్లి రాజ్ స్నేహితురాలు వెన్నెల అనుమానాన్ని తీర్చుకోవడానికి కావ్య సిద్దమవుతుంది. రాజ్ టెన్త్ రీ యూనియన్‌కు తన భర్తతో కలిసి కావ్య వెళ్తుంది.
అయితే ఆలస్యంగా పార్టీకి వచ్చిన వెన్నెల స్పెషల్ ఎట్రాక్షన్ కనిపిస్తుంది. అందరూ ఆమెను పలకరిస్తారు. ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు? ఏమైపోయావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అయితే తాను వెన్నెలను కాదు. నేను వెన్నెల కవలపిల్లలం. వెన్నెల 10 నెలల క్రితమే చనిపోయింది. ఆ విషయం రాజ్‌కు తెలుసు అని చెబుతుంది. అయితే తన భర్తను అనుమానించి తప్పు చేశానని కావ్య బాధపడతుంది. అయితే రాజ్ ఎందుకు అబద్దం చెప్పాడనే విషయంపై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 18వ తేదీ 387 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
శ్వేత సహాయంతో వెన్నెల ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కావ్య. రుద్రాణి కోడలి దగ్గరనుంచి ఆస్తి కొట్టేయటానికి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. రీ యూనియన్ పార్టీకి వెన్నెల వస్తుందో లేదో అని కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటారు కావ్య, శ్వేత. వెన్నెల చనిపోయిందని బాబు రాజ్ కొడుకు కాదని తెలుసుకుంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్ 387 లో ఏం జరిగిందంటే..
ఇంటికి వస్తున్న రాజ్ కావ్య తో మాట్లాడుతూ వెన్నెల ఎవరో తెలుసుకోవడానికి బాగానే ప్లాన్ చేశావు అంటాడు. కంగారుపడిన కావ్య అలాంటిదేమీ లేదు అంటుంది. నువ్వు శ్వేత తో మాట్లాడటం నేను విన్నాను అంటాడు రాజ్. అయితే ఇప్పుడు ఏమైంది మీరు కూడా బాబు నా కొడుకని అబద్ధం చెప్పలేదా.. చనిపోయిన వెన్నెల పేరు చెప్తే నేను తెలుసుకోలేనని అనుకున్నారా అంటుంది కావ్య. అయితే ఇప్పుడేమంటావు అంటాడు రాజ్.

ఈ బాబుని మీ కొడుకు అని ఎందుకు చెప్తున్నారు అసలు ఈ బాబు తల్లి ఎవరు అని అడుగుతుంది కావ్య, నేను చెప్పను అంటాడు రాజ్. మరోవైపు కళ్యాణ్ సీరియస్ గా పని చేసుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ చేత ఎలాగైనా సంతకం పెట్టించాలి అనుకొని రాహుల్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఫైల్ చూసావా అని అడుగుతాడు. చూస్తాను అని చెప్తాడు కళ్యాణ్. లేదు, రేపటి పని ఈరోజే చేయాలి ఈరోజు పని ఇప్పుడే చేయాలి అంటాడు రాహుల్. నువ్వు బాగా మారిపోయావు అంటాడు కళ్యాణ్.
సరే నువ్వు ఫైల్ చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కళ్యాణ్ ఎప్పుడు ఫైల్ మీద సంతకం చేస్తాడా అని తల్లితోపాటు పక్కనుంచి నక్కి చూస్తాడు. కళ్యాణ్ సరిగ్గా ఫైల్ తీసే సమయానికి అక్కడికి అనామిక వచ్చి రేపు మమ్మీ లంచ్ కి రమ్మంది అని చెప్తుంది. మీ ఇంటికి నువ్వు వెళ్ళు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నాకు రావడం కుదరదు అయినా నువ్వు కోరుకున్న పనే కదా నేను చేస్తున్నాను. నీ చావు నువ్వు చావు నన్ను తక్కువ చేసి మాట్లాడితే బాగోదు అని చెప్పి ఆమెని అక్కడ నుంచి పంపించేస్తాడు కళ్యాణ్.
ఫ్రస్టేషన్లో ఉన్న కళ్యాణ్ ఆ ఫైల్ మీద సంతకం పెట్టకపోవడంతో తల్లీ కొడుకులు డిసప్పాయింట్ అవుతారు. ఆ తర్వాత రాజ్ వాళ్ళు ఇంటికి వస్తారు. చిట్టి కావ్య ద్వారా బాబు రాజ్ కొడుకు కాదని తెలుసుకుంటుంది. కావ్య బ్రతుకు అన్యాయం కాలేదని ఆనందపడుతుంది. కానీ ఆ బాబు ఎవరో తెలుసుకోవాలి, ఎందుకు ఈయన బిడ్డ అని చెప్పుకుంటున్నారో తెలుసుకోవాలి అంటుంది కావ్య. ఎలా తెలుసుకుంటావు అంటుంది చిట్టి.
తెలియదు కానీ ఎలాగైనా తెలుసుకుంటాను అంటుంది కావ్య. మరుసటి రోజు పొద్దున్నే కళ్యాణ్ పని చేసుకుంటూ ఉంటాడు. రాహుల్ కళ్యాణ్తో ఫైల్ మీద సంతకం పెట్టించాలని మళ్లీ ప్రయత్నిస్తాడు. అయితే కళ్యాణ్ దగ్గరికి వెళ్లే సమయానికి అక్కడికి రాజ్ రావడం గమనించి ఆగిపోతాడు రాహుల్. పొద్దున్నే పని చేసుకుంటున్న కళ్యాణ్ ని చూసి బాధ్యత మొత్తం నీ మీద వేసేసాను నన్ను క్షమించు అంటాడు రాజ్. ముందు నీ మీద ఉన్న అపవాదులు చెరిపేసుకో అదే నాకు ఆనందం అంటాడు కళ్యాణ్. రాజ్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కావ్య వస్తుంది.

కావ్య తో మాట్లాడుతూ రాహుల్ తెచ్చిన డీల్ గురించి మాట్లాడుతాడు కళ్యాణ్. అది గమనించిన రాహుల్ ఎక్కడ తన పేరు బయట పెట్టేస్తాడో అని కంగారుగా కళ్యాణ్ దగ్గరకు వచ్చి చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది, ఆ కంపెనీ ఫ్రాడ్ కంపెనీ అంట గతంలో మన కంపెనీలో కూడా ఫ్రాడ్ చేయబోతే మనవాళ్లు గెంటేసారంట అని చెప్తాడు. పోనీలే ముందుగానే జాగ్రత్త పడ్డావు అంటాడు కళ్యాణ్.
రాహుల్ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత అతనితో జాగ్రత్త అని కళ్యాణ్ ని హెచ్చరిస్తుంది కావ్య. తర్వాత కొడుకుతో ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతుంది రుద్రాణి. జరిగిందంతా చెప్తాడు రాహుల్. మరోవైపు బాబు పాలు తాగకుండా ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో తోచక డాక్టర్ కి ఫోన్ చేస్తాడు రాజ్. ఒక టు అవర్స్ చూడండి ఇంకా ఏడుపు ఆపకపోతే ఒక టానిక్ ఇస్తాను అది పట్టండి అని చెప్తుంది డాక్టర్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











