Brahmamudi April 19th Episode : యామినితో కావ్య వార్ మొదలు .. రాజ్ ముందే అపర్ణకి షాకిచ్చిన యామిని..
రాజ్- కావ్యలను చూడగానే సీతారాముల్లా ఆదర్శ దంపతుల్లా ఉన్నారని మెచ్చుకుంటాడు పూజారి. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని భార్యాభర్తలం కాదని అంటాడు కావ్య. తన తల్లి పేరు భానుమతి అని ఆమె పేరు మీద అర్చన చేయమని చెప్పడంతో అపర్ణ బాధపడుతుంది. రాజ్ గుడికి వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో యామిని టెన్షన్ పడుతుంది. లేట్ చేస్తే అల్లుడుగారు నీకు దూరమైపోతాడని , వెంటనే బయల్దేరమని కూతురికి చెబుతుంది వైదేహి.
గుడిలో పూజ చేయించిన అనంతరం అన్నదానం చేస్తారు రాజ్ - కావ్య. ఇంతలో అపర్ణ వచ్చి కూర్చోవడంతో ఆమెకు స్వయంగా వడ్డించి వివరాలు కనుక్కుంటాడు రాజ్. ఆమెను చూస్తుంటే మా అమ్మగారు గుర్తొస్తున్నారని , వాళ్ల కొడుకు లేడు కాబట్టి ఆమె చేత కేక్ కట్ చేయిద్దామని కావ్యతో చెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 19వ తేదీ ఎపిసోడ్ 700లో ఏం జరిగిందంటే?

మా అమ్మ పేరు మీద అన్నదానం చేయించానని , అలాగే కేక్ కూడా కట్ చేయించాలని అనుకుంటున్నట్లు చెబుతాడు రాజ్. మా అమ్మ ప్రాణాలతో లేదని అందుకని మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని అమ్మగా అనుకోవచ్చా అని అపర్ణని అడుగుతాడు రాజ్. అలాగే మీరు నన్ను మీ కొడుకనే అనుకోండి అని అంటాడు. మీరు కాదనరే నమ్మకంతో కేక్ కూడా తెప్పించానని... వచ్చి కేక్ కట్ చేస్తారా అని అడుగుతాడు రాజ్. ఆ మాటలతో సొంత అమ్మని అమ్మ అనుకోమని అంటున్నావ్ రాజ్ అని మనసులో బాధపడుతుంది. అనంతరం చేయి పట్టుకుని కేక్ కట్ చేయడానికి తీసుకెళ్తాడు రాజ్. ఇది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. ఇంతలో యామిని అక్కడికి వస్తుంది.
రాజ్, కావ్యలిద్దరూ అపర్ణతో కలిసి కేక్ కట్ చేయిస్తుండగా యామిని చూసి షాక్ అవుతుంది. కేక్ కట్ చేసిన తర్వాత రాజ్‌కు కేక్ తినిపిస్తుంది. దీంతో రాజ్‌కు గతం గుర్తొచ్చిందా? సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారా? అని టెన్షన్ పడుతుంది యామిని. అపర్ణకి కేక్ తినిపించబోతూ హ్యాపీ బర్త్ డే అత్తయ్య అని అంటుంది కావ్య. వెంటనే గ్రహించి హ్యాపీ బర్త్ డే ఆంటీ అని అంటుంది. ఏదో జరగబోతోందని భయపడిన యామిని అలా జరగడానికీ వీల్లేదని వెంటనే రాజ్ దగ్గరికి పరిగెడుతుంది.
యామిని వెళ్లి ఏంటిది? అని ప్రశ్నిస్తుంది. నువ్వేంటీ ఇక్కడ? నేను ఇక్కడే ఉన్నట్లు నీకు ఎవరు చెప్పారని రాజ్ ప్రశ్నిస్తాడు. ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతున్న యామినిని చూసిన కావ్య .. నేనే రమ్మని చెప్పానని కవర్ చేస్తుంది కావ్య. అసలు ఆమె మీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తాడు రాజ్. ఆమెతో తనకు పరిచయం లేదని, ఇందాక మీరు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు మీరు బిజీగా ఉండటంతో నేను ఫోన్ లిఫ్ట్ చేశానని , గుడిలో అన్నదానం చేస్తున్నట్లు చెప్పానని అందుకే వచ్చిందని అంటుంది కావ్య. మనం ఏదైనా మంచిపని చేసేటప్పుడు మనవాళ్లు మన దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని అంటుంది.
అపర్ణని చూసి ఎవరు? అని అడుగుతుంది యామిని. దాంతో మా అమ్మ అని చెబుతాడు రాజ్. ఆ మాటలతో యామిని షాక్ అవుతుంది. వాళ్ల అబ్బాయి ఇప్పుడు ఈమెతో లేడని, అందుకే ఇదంతా చేశానని చెబుతాడు. ఈ అమ్మ పుట్టినరోజు కూడా ఇవాళేనని , అందుకే కేక్ కట్ చేయించానని అంటుంది. అనంతరం యామినిని పిలిచి కేక్ తినిపించమని చెబుతుంది కావ్య. యామిని కేక్ తినిపిస్తుండగా అది చేయి జారీ ఆమె శారీ పాడవుతుంది. దాంతో అపర్ణని తీసుకుని బయటికి వెళ్తాడు రాజ్.
మీరు ఎంత కాదనుకున్నా తల్లీకొడుకుల బంధమే వేరని యామినితో అంటుంది కావ్య. అమ్మ అని కమ్మగా పిలిస్తే ఎవరికైనా ఆ అనురాగం, ఆప్యాయత గుర్తొస్తుందని చెబుతుంది. చెట్టు నుంచి వేరుని, తల్లి నుంచి బిడ్డని , గూటి నుంచి పక్షిని వేరు చేయడం మహాపాపం కదా అని చెబుతుంది కావ్య. ఆమె మాటలతో యామిని టెన్షన్ పడుతుంది. అయినా ఇక్కడికి మీరు ఎలా వచ్చారని యామినిని ప్రశ్నిస్తుంది కావ్య. ఇక్కడికి రమ్మంది నేనే అని చెప్పకపోయుంటే ఏం జరిగేదే ఊహించుకోండని భయపెడుతుంది.
సొంత మనుషుల కోసం ఎంత రిస్క్ అయినా చేయడంలో తప్పు లేదు కదా అని అంటుంది యామిని. మా బావ ఆరు నెలలు కోమాలో ఉన్నాడని, ఈ మధ్యే బయటికి వచ్చాడని ఇప్పుడు తన గతాన్ని గుర్తుచేస్తే తన ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారని అంటుంది యామిని. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ అందరికీ ఉంటుందని చెబుతుంది. ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోనని, నువ్వు కావాలనే డైరెక్ట్‌గా నాతో యుద్ధం చేయాలని చూస్తున్నావని నాకు తెలుసని, కానీ రాజ్ విషయంలో నేను ఆవేశపడితే నష్టం నాకేనని నాకు తెలుసని మనసులో అనుకుంటుంది యామిని.
మా ఆయనికి గతం గుర్తొచ్చే వరకు ఏమీ తెలియనట్లే నటిస్తానని కావ్య కూడా అనుకుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఈ గ్యాప్‌లో చాలా మాట్లాడుకున్నారని , బాగా ఫ్రెండ్స్ అయిపోయారని అంటాడు. ముగ్గురం కలిసి ఓ రోజు మీట్ అవుదామని చెప్పి యామినిని తీసుకుని వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఆగిపోయిన రాజ్ .. అమ్మ అంటూ అపర్ణని పిలుస్తాడు. ఆమె పాదాల మీద పడి నన్ను దీవించండి అని అంటాడు. అమ్మ కొడుకులు కలిసిపోయినట్లు పొంగిపోతున్నారు.. ఇప్పుడే ఓ ఝలక్ ఇస్తానని అనుకుంటుంది యామిని. త్వరలో పెళ్లి చేసుకుని మేమిద్దరం ఒక్కటి కాబోతున్నామని, పనిలో పని మా జంటను కూడా దీవించండని అడుగుతుంది. దాంతో ఏం చేయాలో తెలియక కావ్య వంక చూస్తుంది అపర్ణ. తప్పకుండా మీరు మా పెళ్లికి రావాలని అడుగుతుంది అపర్ణ, కావ్యలను అడుగుతుంది యామిని.
వాళ్లిద్దరూ వెళ్లిపోయాక కావ్యతో మాట్లాడుతుంది అపర్ణ. నా పుట్టినరోజు సెల్రబేషన్స్, అన్నదానం నా కొడుకు చేతుల మీదుగా జరగడం బాగుందని అంటుంది. కానీ ఆ అమ్మాయి ఎవరు? నువ్వెందుకు రమ్మన్నావని మండిపడుతుంది. ఆయనను వెతుక్కుంటూ ఆ అమ్మాయే వచ్చిందని.. నేనే రమ్మని చెప్పకపోయుంటే , యామిని మీద ఆయన కోప్పడతాడని చెబుతుంది. ఆయన అలా ఆవేశపడటం మంచిది కాదని అంటుంది. వాళ్లిద్దరి పెళ్లి జరగదు , మీరేం భయపడకండి అని అపర్ణతో చెబుతుంది కావ్య. ఆయన ఎంత దూరంలో ఉన్నా రోజూ నాతో మాట్లాడుతున్నాడు? నన్ను కలుస్తున్నారని అంటుంది. ఇలా ఎంత కాలం.. మనింట్లో వాళ్లతో మాటలు పడుతుంటావని ప్రశ్నిస్తుంది అపర్ణ.
ఆ యామిని ఎవరు? బావ అని ఎందుకు ఆయన్ని ఇంట్లో పెట్టుకుందో? ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో తెలుసుకోవాలని చెబుతుంది కావ్య. ఆయన నన్ను గుర్తుపట్టేంత వరకు నేను తొందరపడనని చెప్పడంతో కావ్యని మెచ్చుకుంటుంది అపర్ణ. ఇన్ని రోజులు నిన్ను అర్ధం చేసుకోలేదని నన్ను క్షమించమని అడుగుతుంది. రాజ్ విషయంలో నువ్వు చెప్పింది వినకుండా నా కొడుకు బతికుండగానే కర్మకాండలు చేయాలని అనుకున్నాని బాధపడుతుంది అపర్ణ.
నువ్వు నా కోడలిగా రావడం నేను చేసుకున్న పుణ్యమని అంటుంది. త్వరలోనే ఆయనని మామూలు మనిషిని చేసి తిరిగి ఇంటికి తీసుకొస్తానని చెబుతుంది కావ్య. ఇంటికి తీసుకొచ్చిన యామిని రాజ్ అన్నదానం చేయించిన విషయం అంటుంది. అమ్మకి అన్నదానం చేయిస్తుండగా అపర్ణ అనే ఆవిడ పరిచయమయ్యారని ఆమె పుట్టినరోజు కూడా ఈరోజేనని జరిగింది చెబుతాడు రాజ్. అపర్ణ ఎవరు వైదేహి అడగ్గా.. రాజ్ కన్నతల్లి అని చెబుతుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











