Brahmamudi April 19th episode: రాజ్ ని నిజం చెప్పమంటూ నిలదీసిన కుటుంబం.. అపర్ణ షాకింగ్ నిర్ణయం?
రుద్రాణి కోడలి దగ్గరనుంచి ఆస్తి కొట్టేయటానికి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. రీ యూనియన్ పార్టీకి వెన్నెల వస్తుందో లేదో అని కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటారు కావ్య, శ్వేత. వెన్నెల చనిపోయిందని బాబు రాజ్ కొడుకు కాదని తెలుసుకుంటుంది కావ్య. కళ్యాణ్ చేత సంతకం పెట్టించాలన్న రాహుల్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 19వ తేదీ ఎపిసోడ్ 388 లో ఏం జరిగిందంటే..
కుటుంబ సభ్యులందరూ హాల్లో కూర్చుంటే అత్తలు కోడళ్ళు టీ పెట్టుకునే విషయంలో గొడవ పడుతూ ఉంటారు. ఇంతలోనే పైనుంచి బాబు ఏడుపు వినిపిస్తుంది. మీరందరూ పిల్లల్ని కన్నా తల్లులే కదా ఏమైందో ఒకసారి చూడొచ్చు కదా అంటుంది స్వప్న. నీకు అంత ప్రేమ కారిపోతే నువ్వు వెళ్లి చూడొచ్చు కదా, వరుసకి పెద్దమ్మ వే అవుతావు కదా అంటుంది రుద్రాణి. నేను తల్లిని కాబోతున్నాను కానీ ఇంకా తల్లిని కాలేదు అయినా పిల్లాడి విషయంలో మీ పట్టింపులు ఏంటి అంటుంది స్వప్న. వీళ్ళెవరు కదిలే లాగా లేరు నువ్వే వెళ్లి ఏమైందో చూడు అనే చిట్టి తో చెప్తాడు సీతారామయ్య.

చిట్టి అక్కడ నుంచి వెళ్లబోతుంటే మీరు ఆగండి అమ్మమ్మ గారు నేను వెళ్తాను అంటుంది స్వప్న. అంతలోనే గుడి నుంచి వస్తుంది కావ్య. జరిగిందంతా స్వప్న కావ్యకి చెప్తుంది. స్వప్న కంగారుగా మేడ మీదకి వెళ్లి చేతిలో ఉన్న బాబుని తీసుకుంటుంది,బాబుకి జ్వరంగా ఉందని గ్రహిస్తుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం అంటుంది. బాబుని ఎత్తుకొని హాస్పిటల్ కి బయలుదేరుతారు కావ్య దంపతులు. హాస్పిటల్ కి వెళ్తున్న వారికి తోడుగా సుభాష్ కూడా వెళ్తాడు. బాబుకి ఏమీ కాకూడదు అని దండం పెట్టుకుంటుంది చిట్టి.
ఆ తర్వాత బాబుకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అన్ని రిపోర్టులు నార్మల్గానే ఉన్నాయి కానీ బాబు ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కావటం లేదు, బాబుకి తల్లిపాలు ఇస్తున్నారా అని అడుగుతుంది. లేదు నేను బాబుకి కన్నతల్లిని కాదు అంటుంది కావ్య. తల్లి ఏమైంది అని అడుగుతుంది డాక్టర్. కొన్ని కారణాల వలన బిడ్డకి దూరంగా ఉండవలసి వచ్చింది అని చెప్తాడు సుభాష్. ఇప్పుడు నాకు సమస్య అర్థమైంది బాబుకి కావలసింది తల్లి స్పర్శ, అందుకోసమే పిల్లాడు బెంగ పెట్టుకుంటున్నాడు అని చెప్తుంది డాక్టర్.

అదే సమయంలో ఇంటిదగ్గర రుద్రాణి బాబు విషయంలో కుటుంబ సభ్యులందరినీ భయపెడుతూ ఉంటుంది. కీడెంచి మేలెంచాలని అన్నారు కదా ఇప్పుడు బాబుకి ఏమైనా అయిందంటే మన పరిస్థితి ఏమిటి? ఆ తల్లికి విషయం తెలిసి ఇక్కడికి వచ్చి మన అందరి మీద కేసు పెడితే అందరం జైల్లో ఉండవలసిన వస్తుంది అప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అడుగుతుంది. ధాన్యలక్ష్మి కూడా రుద్రాణికి వంత పాడుతుంది.
బాబుకి బాగా అయితే అంతే చాలు ఇంటికి వచ్చిన వెంటనే బాబుని తల్లికి అప్పగించమని రాజ్ కి చెప్పాలి అంటుంది. అంతలోనే కావ్య వాళ్ళు ఇంటికి వస్తారు, ఏం జరిగింది అని అడుగుతుంది అపర్ణ . కావ్య జరిగిందంతా చెప్తుంది. కుటుంబ సభ్యులందరూ రాజ్ ని నిలదీస్తారు, తల్లి ఎవరో చెప్పమంటూ అడుగుతారు. కావ్య కూడా మీరు నిజం చెప్పకుండా బాబుని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా నిజం చెప్పండి అని అడుగుతుంది.

సీతారామయ్య కూడా అసలు నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉంటావని అనుకోలేదు నిజం చెప్పు అని అడుగుతాడు.అయితే రాజ్ మాత్రం క్షమించండి నేనేమీ చెప్పలేను అంటాడు. కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఇలాంటి పరిస్థితులలో నేను నిర్ణయం తీసుకోక తప్పదు అంటుంది అపర్ణ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











