Brahmamudi April 1st Episode: తండ్రిని వణికించిన యామిని.. యామినికి మస్కా కొట్టిన రాజ్, కావ్యపై రుద్రాణికి డౌట్

రాజ్ పెళ్లికి ఒప్పుకోవడంతో యామిని అతనికి థ్యాంక్స్ చెబుతుంది. ఈ మాటలన్నీ విన్న అప్పూ - కావ్యలు షాక్ అవుతారు. బావగారికి నిజం చెప్పి దక్కించుకోవాలని కావ్యతో అప్పూ అంటుంది. అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని చెబుతుంది కావ్య. ఆ యామిని ఎవరు? మా కారుకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? మీ బావగారిని స్పాట్‌ నుంచి ఎవరు తీసుకెళ్లారు? యామినికి - మా ఆయనికి సంబంధం ఏంటీ అనేది తెలుసుకోమని అప్పూకి చెబుతుంది

యామిని తండ్రి దగ్గరికి వెళ్లి నా లైఫ్‌లో యామిని కాకుండా ఎవరైనా ఉన్నారా? యామిని లాగే ఎవరైనా ఇష్టపడ్డారా? అని రాజ్ అడుగుతాడు. ఈ మాటలు విన్న వైదేహి మధ్యలో జోక్యం చేసుకుని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్ 684లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 1st 2025 Episode 684 Here is Today s full story

కావ్య, రాజ్‌లు ఛాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎలాగైనా కావ్యని కలవాలని అనుకున్న రాజ్ ఆమెకు మెసేజ్ చేస్తాడు. అది చూడగానే కావ్య చాలా సంతోషిస్తుంది. కానీ వెంటనే ఒప్పుకోకుండా ఏడిపిస్తుంది కళావతి. రాజ్‌కు కావ్య గురించి చెప్పబోయిన తండ్రిపై మండిపడుతుంది యామిని. నేను ఎలాంటి పరిస్ధితుల్లో నుంచి బయటపడ్డానో తెలిసి కూడా నా జీవితాన్ని ఏం చేద్దామని అనుకున్నావని రగిలిపోతుంది. రాజ్ బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని అంటాడు యామిని తండ్రి.

రాజ్ వచ్చి అలా బాధపడుతుంటే నాకు తప్పు చేసిన ఫీలింగ్ వచ్చిందని.. భార్యాభర్తలను విడదీయడం పాపమని అనిపించిందని అంటాడు. తనకు గతం గుర్తులేకపోయినా కావ్యని చూడగానే తెలిసిన మనిషిలా ఫీల్ అవుతున్నాడంటే తన భార్యని ఎంతలా ప్రేమించి ఉండాలి అని అంటాడు. రామ్ కళ్లలో ప్రేమని చూశావ్.. మరి నా అణువణువులోనూ రామ్ మీ పెంచుకున్న ప్రేమ నీకు కనిపించలేదా అని తండ్రిని నిలదీస్తుంది యామిని. ఇన్నేళ్లుగా తన జ్ఞాపకాలతో బతుకుతూ తను లేకపోతే జీవితమే లేదనుకుని చావడానికి కూడా సిద్ధపడ్డాను అది నీకు కనిపించలేదా అని ఫైర్ అవుతుంది.

చచ్చి నా రామ్‌కి దూరం కావడం కంటే బతికి తనను సొంతం చేసుకుని సంతోషంగా ఉండాలని నా వ్యసనం నుంచి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదా అని నిలదీస్తుంది యామిని. నా ప్రేమను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా, నా రామ్‌ని నా నుంచి దూరం చేయాలని చూసినా వాళ్లని నేను క్షమించనని కత్తి తీసుకుని తండ్రి మీదకు వెళ్తుంది యామిని. వైదేహి కంగారుపడి కూతురిని ఆపుతుంది. కంగారు పడొద్దని తండ్రిని చంపేంత శాడిస్ట్‌ని కాదని, రామ్ కనుక నాకు దక్కకపోతే నన్ను నేను చంపుకోవడానికి కూడా వెనుకాడనని అంటుంది యామిని.

వెంటనే మణికట్టును కట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే తన చేతిలోని కత్తిని లాక్కుని నా కూతురి కంటే ఏది ఎక్కువ కాదని తేల్చి చెబుతాడు యామిని తండ్రి. నా కూతురు ప్రేమ కన్నా, తన జీవితం కన్నా తనకు ఏది ఎక్కువ కాదని అంటాడు. ఎవరు ఎలా బాధపడినా? రామ్‌తో నీ పెళ్లి జరిగిలా నేను చేస్తానని మాట ఇస్తాడు. చేస్తున్నది తప్పని తెలిసినా కూతురి ప్రాణం కోసం చేయకతప్పడం లేదని వైదేహితో అంటాడు యామిని తండ్రి. అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని, ఏదో పెద్ద త్యాగం చేసినట్లు, కూతురి కోసమే కదా చేస్తున్నారని అంటుంది వైదేహి. మనకి మన కూతురు కావాలి? తన సంతోషం కావాలి? అది మాత్రం ఆలోచిస్తే చాలాని చెబుతుంది.

రాజ్, కావ్యలు నిద్రపోకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడుతుండగా.. కావ్య అందంగా అలంకరించుకుని బయటికొస్తుంది. ఆమెను చూడగానే అంతా షాక్ అవుతారు. మీ కోడలు హీరోయిన్ రేంజ్‌లో రెడీ అయ్యిందని సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఏదైనా పార్టీకి వెళ్తున్నావా? లేదా ఫంక్షన్‌కు వెళ్తున్నావా అని ఇందిర అడగ్గా.. ఆఫీస్‌కి వెళ్తున్నానని చెబుతుంది కావ్య. మొగుడు బతికున్నప్పుడు ముష్టి చీరలు కట్టి.. ఇప్పుడేమో మోడ్రన్‌గా తయారైందని అంటుంది రుద్రాణి. ఈ ఇంట్లో నిన్ను అడిగేవాళ్లు ఎవరున్నారు? అంతా నీ ఇష్టా రాజ్యమే కదా అని అంటుంది.

అయినా నాకెందుకు ? అడగాల్సిన నీ అత్త మామలే నోరు మూసుకుని కూర్చొన్నారని అంటుంది. నేను ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని చెబుతుంది కావ్య. ఆ కారణం ఏంటో మాకు కూడా చెప్పు అంతేకానీ.. బిగ్‌బాస్‌కి వెళ్లిన కంటెస్టెంట్‌లాగా నువ్వు ఏం చెబితే అది వినాలి, చివరిలో వచ్చి ఓ షాకిస్తావని సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఆస్తి నీ పేరు మీద రాసినప్పుడు నాకు తెలియదు, దానిని మీరు తాకట్టు పెట్టినప్పుడు కూడా మాకు తెలియదు .. కానీ చివరిలో వచ్చి అంతా లోక కళ్యాణం కోసమే అన్నట్లుగా బిల్డప్ ఇస్తావ్ అంటుంది.

ఈ ఇంట్లో ఎవరికి సమాధానం చెప్పినా, చెప్పకపోయినా మీకు చెప్పాలని అపర్ణతో అంటుంది కావ్య. ఆయన వచ్చే వరకు బాధ్యతలు తీసుకోవాలని అనుకుంటున్నానని.. అందుకే ఆఫీస్ పనులు తిరిగి మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి ఇక్కడే ఆగిపోతానని అంటుంది కావ్య. మా అందరికీ కావాల్సింది కూడా అదేనని.. నువ్వు ఆఫీస్‌కి వెళ్తానంటే ఎందుకు అడ్డుపడతామని ప్రశ్నిస్తుంది ఇందిర. కావ్యని చూస్తే నీకు ఏమీ అనుమానం రావడం లేదా అని రాహుల్‌ని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నిన్నటి వరకు రాజ్ ఎక్కడున్నా తీసుకొస్తానని మాత్రమే చెప్పిన కావ్య.. కానీ ఇంతలా రెడీ అయ్యిందని దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది అంటుంది.

మొగుడు కనిపించడం లేదంటే ఆఫీస్‌కి వెళ్లే రకం కాదని చెబుతుంది. ఒకవేళ రాజ్‌ను కలవడానికి వెళ్తుందేమోనని డౌట్ పడుతుంది రుద్రాణి. దాని వెనుకే వెళ్లి ఈరోజు తను ఆడుతున్న నాటకానికి తెరదించుదామని అంటుంది. కావ్యని కలిశాక తను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటాడు రాజ్. రాజ్ బయటికి వెళ్తుండగా యామిని తండ్రి, వైదేహి పిలుస్తారు. నిన్నటి నుంచి అమ్మానాన్న గుర్తొచ్చారని.. నేను వెళ్లి వాళ్ల సమాధుల దగ్గర కాసేపు గడిపేసి వస్తానని అంటాడు రాజ్. రామ్‌కి సడెన్‌గా అమ్మానాన్న గుర్తు రావడం ఏంటని వైదేహికి డౌట్ వస్తుంది. కావ్య కారుని రుద్రాణి - రాహుల్ ఫాలో అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X