Brahmamudi April 20th Episode: ఇందూ నిర్ణయంతో నందూ షాక్.. అపర్ణ నగలపై భ్రమరాంబ కన్ను

Photo Courtesy: JioHotstar

ఇందూ కనిపించకపోవడంతో బాధపడుతున్న అపర్ణ, స్వాతిలను ఓదారుస్తుంది నందూ. ఎంత కష్టమైనా సరే అక్కని నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది. స్వరాజ్ పెట్టే భోజనం తనకు నచ్చకపోవడంతో తనే స్వయంగా వంట చేస్తుంది ఇందూ. అయితే భోజనంలో విషం కానీ మత్తు మందు కానీ కలిపి మేం నిద్రపోయాక సైలెంట్‌గా వెళ్లిపోవాలని చూస్తున్నావా అని అనుమానిస్తాడు రాజ్. దాంతో అన్ని వంటలను ముందు తను తింటుంది ఇందూ. అక్కను ఎవరు కిడ్నాప్ చేశారని ఆలోచిస్తూ ఇందూ బర్త్ డే ఫంక్షన్ వీడియోలను చూస్తుంది నందూ. అందులో ఇందూ వేసుకున్న డ్రెస్.. రాజ్ ఇంటి ముందు దండెం మీద వేలాడుతూ కనిపించడంతో కిడ్నాప్ చేసింది ఎవరో అర్ధమైపోతుంది.

వెంటనే రాజ్ ఉన్న ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూస్తుంది. అక్కడ ఇందూతో కలిసి రాజ్, లక్కీలు భోజనం చేస్తూ ఉండటంతో షాక్ అవుతుంది. ఇందూని ఎలా విడిపించి తీసుకురావాలి? కిడ్నాపర్లకు కోటి రూపాయలు ఎలా ఇవ్వాలని రేఖ ఆలోచిస్తుంది. ఇంతలో దుగ్గిరాల నిలయానికి చక్రీ వస్తాడు. మరో కోటి రూపాయలు కావాలని రేఖ అడగ్గా.. ఇస్తాను కానీ మీరు దాచిన బంగారం మొత్తం నాకు ఇవ్వాలని కండీషన్ పెడతాడు చక్రీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్ 1011లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial April 20th 2026 Episode 1011 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూ కిడ్నాప్ కావడంతో ఆమెను విడిపించడానికి కిడ్నాపర్లు అడిగిన కోటి రూపాయలు ఇవ్వమని చక్రీని అడుగుతుంది రేఖ. ఇంట్లో ఉన్న నగలు మొత్తం ఇస్తేనే మీకు కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు చక్రీ. మీరు కనుక మీ నగల్ని తాకట్టు పెడితే మీరు దివాళా తీయడానికి సిద్ధంగా ఉన్నారని మీ కంపెనీలో పుకార్లు మొదలవుతాయి. అది మీకే డేంజర్ అని చెబుతాడు చక్రీ. ఆ మాటలతో అందరూ మీ మీ నగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని రేఖ చెప్పడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. ఆ ఇందూ దగ్గర కోట్లు నొక్కేద్దామని అనుకుంటే ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది అన్నట్లుగా తయారైందని అనుకుంటుంది.

స్వరాజ్- లక్కీలు నిద్రపోవడంతో ఇదే అదనుగా లోపలికి వెళ్తుంది నందూ. వెంటనే ఇందూ దగ్గరికి వెళ్లగా నందూని చూసి షాక్ అవుతుంది. నిన్ను కూడా కిడ్నాప్ చేశారా అని అడుగుతుంది ఇందూ. నన్ను కిడ్నాప్ చేసే మనిషి ఇంకా పుట్టలేదని చెబుతుంది నందూ. తాళం వేసుంటే ఎలా వచ్చావని అడుగుతుంది ఇందూ. నిన్నెందుకు కిడ్నాప్ చేశారని నందూ అడగ్గా.. డబ్బు కోసమని ఆన్సర్ ఇస్తుంది ఇందూ. ఫస్ట్ నీకు నువ్వు కిడ్నాప్ అవ్వాలని అనుకున్నావు, మధ్యలో ఎవరో కిడ్నాప్ చేశారని స్వాతి చెప్పిందని అంటుంది నందూ.

నేను ఎవరో వీళ్లకు తెలియదు, డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ నా అనుకున్న వాళ్లు కూడా డబ్బు కోసం నన్ను వాడుకోవాలని అనుకుంటుంటే అక్కడి నుంచి తప్పించుకోవాలని అనిపించింది. చిన్నతనం నుంచి నాకు గదిలో బతకడం అలవాటైపోయిందని చెబుతుంది ఇందూ. ముందు ఇక్కడి నుంచి నిన్ను రక్షించాలని నందూ తాళం పగలగొట్టబోతుండగా వద్దని చెబుతుంది ఇందూ. నేను రానని చెబుతుంది ఇందూ. నేను మళ్లీ ఆ ఇంటికి వెళితే నేను అనుకున్నది ఏది సాధించలేను, నన్ను నమ్ముకున్నవాళ్లకు అన్యాయం చేయలేను అంటుంది ఇందూ. నువ్వు కిడ్నాప్ అయ్యావని.. ఆ రేఖ కంప్లయంట్ ఇవ్వకుండానే కేసు డీల్ చేయమని చెప్పింది, అప్పుడే నాకు సంతకం, ఆస్తి గురించి తెలిసిందని చెబుతుంది నందూ. నానమ్మ నీ కోసం కంగారు పడుతోంది..నిన్ను తీసుకొస్తానని నేను మాటిచ్చానని చెబుతుంది నందూ.

రేఖ ఆంటీకి ఆస్తి వెళ్లనివ్వనని నేను కూడా నానమ్మకి మాటిచ్చాను. తన కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఆ విషయంలో క్లారిటీ వచ్చే వరకు నేను తిరిగి ఇంటికి రాలేనని చెబుతుంది ఇందూ. వీళ్లతో నిన్ను వదిలేసి వెళ్లలేనని అంటుంది నందూ. వీళ్లు చూడటానికి వెధవల్లాగే ఉన్నా.. నన్ను బాగానే చూసుకుంటున్నారు. కానీ నానమ్మ, తాతయ్యల గురించేనని చెబుతుంది ఇందూ. వాళ్లిద్దరినీ నేను సేఫ్‌గా చూసుకుంటానని అంటుంది నందూ. కానీ నువ్వు మా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావని ఇందూ అడగ్గా.. నువ్వు నా అక్కవి కదా? ఆ మాత్రం చేయనా? అని నందూ అనడంతో ఇందూ షాక్ అవుతుంది. నేను దేవుడిచ్చిన చెల్లిని అన్నావు కదా అందుకే ఇదంతా చేస్తున్నానని అంటుంది నందూ.

చక్రీకి తన దగ్గరున్న నగలు మొత్తం తెచ్చిస్తారు రేఖ, ఐశ్వర్య. కానీ భ్రమరాంబ మాత్రం చిన్న చైన్ తీసుకొచ్చి ఇవ్వడంతో శేషం షాక్ అవుతాడు. మరి నీ ఒంటి మీదున్న నగల సంగతి ఏంటీ? అని శేషం అడగ్గా.. అవన్నీ గిల్టు నగలని చెబుతుంది భ్రమరాంబ. నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు.. నా నగలు ఉన్నాయి కదా అని స్వాతి మొత్తం తెచ్చేస్తుంది. అది చూసి భ్రమరాంబ షాక్ అవుతుంది. మీ దగ్గర ఎలాంటి నగలు లేవా? అని చక్రీ అడగ్గా.. ఇంకొకరు మిగిలిపోయారని అపర్ణ దగ్గరికి వెళ్తుంది రేఖ. మీరు దాచుకున్న నగల్ని ఇవ్వమని అడగటంతో రేఖ, సుభాష్ షాక్ అవుతారు. నా దగ్గరున్న నగలన్నీ నువ్వే లాక్కున్నావు.. ఇంకా ఏం మిగిలి ఉన్నాయని ప్రశ్నిస్తుంది అపర్ణ.

ఇంతలో భ్రమరాంబ వచ్చి నీ చేతికి ఉన్న గాజుల్ని ఇవ్వమని బెదిరిస్తుంది. ఇవి మా అత్తగారు నాకు ఇచ్చిన నగలు.. ఇందుకు మాత్రమే ఇస్తానని చెబుతుంది అపర్ణ. అడగాల్సిన అవసరం లేదు.. లాక్కోవడమేనని భ్రమరాంబ వెళ్లగా నందూ వచ్చి సీరియస్‌గా చూస్తుంది. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.. నీ పని నువ్వు చేసుకోమ్మని బెదిరిస్తుంది భ్రమరాంబ. అసలు ఈ కిడ్నాప్ మీరే ఎందుకు చేయించి ఉండకూడదని అంటుంది నందూ. మా మీద ఇలాంటి నిందలు వేస్తే బాగోదని వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఇందూ అక్క సేఫ్‌గానే ఉందని నందూ చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు సంతోషిస్తారు.

నగలన్నీ తీసుకున్న చక్రీ 50 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని చెబుతాడు. మిగిలిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తామని భూషణ్ అడుగుతాడు. ఇంతలో నందూ వచ్చి అంతపెద్ద స్వరాజ్ కంపెనీని నడిపిస్తున్న మీకు డబ్బులకు లోటు ఏంటీ అని ప్రశ్నిస్తుంది. ఎంత పెద్ద కంపెనీ అయినా లిక్విడ్ క్యాష్ ఉండదని అంటుంది రేఖ. అయితే కొన్నేళ్లుగా బెడ్ మీద పడుకున్న తాతగారికి ఆపరేషన్ ఎందుకు చేయించలేదని నందూ అడగటంతో అంతా షాక్ అవుతారు.

ఆస్తి కోసం ఇందూ గారిని మీరంతా కార్నర్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ముందు తాతయ్య గారికి ఆపరేషన్ చేయించండి, లేదంటే మీ మీద ఎఫ్ఐఆర్ రాయిస్తానని నందూ వార్నింగ్ ఇవ్వడంతో రేఖ, భ్రమరాంబ షాక్ అవుతారు. ఆపరేషన్ చేయిస్తానని ఒప్పుకుంది నువ్వే కాబట్టి.. నువ్వే నీ నగలమ్మి ఆపరేష్ చేయించాలని శేషం అనడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. నిద్రలేచిన ఇందూ.. నాకు కాఫీ కావాలని రాజ్‌ని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X