Brahmamudi April 20 th episode: రాజ్‌ను ఇంట్లోంచి గెంటివేతకు ప్లాన్.. పండగ చేసుకొంటున్న రుద్రాణి

రీ యూనియన్ పార్టీకి వెన్నెల వస్తుందో లేదో అని కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటారు కావ్య, శ్వేత. వెన్నెల చనిపోయిందని బాబు రాజ్ కొడుకు కాదని తెలుసుకుంటుంది కావ్య. కళ్యాణ్ చేత సంతకం పెట్టించాలన్న రాహుల్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. తల్లి స్పర్శ లేక బాబు హాస్పిటల్ పాలు అవుతాడు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్ 389 లో ఏం జరిగిందంటే..

బాబు ఎవరో చెప్పమంటే రాజ్ నిజం చెప్పడు. నీ మూర్ఖత్వంతో బాబు ప్రాణానికి ఏమీ కాకముందే నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ రాజ్ ని ఇంట్లోంచి వెళ్లిపోమంటుంది అపర్ణ. ఇంట్లో వాళ్ళందరూ అపర్ణని మందలిస్తారు. కానీ అపర్ణ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు, ఆ బాబు కి ఏమైనా అయితే మన పరిస్థితి ఏంటి అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. అప్పుడు స్వప్న మాట్లాడుతూ ఈ ఇల్లు రాహుల్ లాంటి వాళ్ళని కూడా క్షమించింది అలాంటిది రాజ్ ని క్షమించదా, ఇప్పటికిప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్తాడు.

Brahmamudi serial April 20th Episode of 389 Rudrani dancing with joy

కనీసం అతనికి ఆలోచించుకోవటానికి టైం ఇవ్వాలి కదా అంటుంది. అపర్ణ వారం రోజులు టైం ఇస్తుంది. ఈ లోపు బాబు తల్లిని బయటపెట్టాలి లేదంటే వీడు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాలి అని చెప్తుంది. ఆ తర్వాత దేవుడి పటం ముందు ఆనందంతో గంతులు వేస్తుంది రుద్రాణి. ఏం జరిగింది అంటాడు రాహుల్. దేవుడు రాక్షసులకు కూడా వరాలిస్తాడని తెలుసు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను, నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది.

త్వరలోనే రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అప్పుడు కళ్యాణ్ ని కాళ్ళ కింద పెట్టి సింహాసనాన్ని నువ్వే అధిష్టించవచ్చు అని రుద్రాణి అంటుంది.. అలాగే ఆస్తి పేపర్లు ఏం చేశావు అని కొడుకుని అడుగుతుంది. నా దగ్గరే ఉన్నాయి సాయంత్రం సేటు వస్తాడు అప్పుడు స్వప్న తీసుకున్నట్లుగా అప్పు తీసుకుంటాను, ఆ విషయం ఇంట్లో చెప్పి స్వప్నను కూడా ఇంట్లోంచి బయటికి గెంటించేస్తాను అంటాడు రాహుల్. దసరా దీపావళి కలిసి ఒకేసారి చేసుకున్నట్లుగా ఉంది అని ఆనందపడుతుంది రుద్రాణి.

మరోవైపు చిట్టి, కావ్య ఇద్దరూ అపర్ణ దగ్గరకి వస్తారు. నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమైనా బాగుందా నీ కొడుకుని వదిలేసి నువ్వు ఉండగలవా అని అడుగుతుంది చిట్టి. ఉండలేను కానీ ఏం చేస్తాము తల్లిగా ఇది నా అస్తిత్వానికి పరీక్ష. వాడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు అంటే నేను తల్లిగా ఓడిపోయినట్లే అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం లాగా తయారయింది పరిస్థితి అని బాధపడుతుంది చిట్టి.

మరోవైపు దొంగ చాటుగా తన కొడుకుని తండ్రి సుభాష్ తీసుకుని వెళ్లడం చూస్తాడు రాజ్. తండ్రిని ఫాలో అవుతూ వెళ్తాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లడం కావ్య చూస్తుంది. కావ్య కూడా వాళ్ళిద్దర్నీ ఫాలో అవుతూ వెళుతుంది. సుభాష్ కార్ కి అడ్డుగా వచ్చిన రాజ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. ఈ బాబుని నీకు దూరంగా, ఈ వంశానికి దూరంగా యే అనాధాశ్రమంలోనూ అని మాట్లాడుతూ ఉండగా అలా అనకండి డాడీ ఈ బిడ్డ కోసం నేను నా భార్య నమ్మకాన్ని పోగొట్టుకున్నాను.

తల్లి ప్రేమను పోగొట్టుకున్నాను అయినా కూడా గుండెల మీద పెట్టి పెంచుకుంటున్నాను అంటాడు రాజ్. కానీ నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవడం నేను భరించలేను నేనే నిజం చెప్పేస్తాను అంటాడు సుభాష్. ఆ మాటలు వింటున్న కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మావయ్య గారికి అంతా తెలుసా అని అనుకుంటుంది.

మీరు నిజం ఎవరికీ చెప్పనని మాట ఇచ్చారు అని చెప్పి బాబుని తండ్రి కారులోంచి తీసుకొని వచ్చి తన కార్లో ఇంటికి వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు సేటు దగ్గరికి వెళ్లిన రాహుల్ కోటి రూపాయలు అప్పు ఇచ్చి, కోటి పాతిక లక్షలు తీసుకున్నట్టు నోట్లో రాసుకొని ఇంటికి వచ్చి గొడవ చేసి డబ్బులు పట్టుకొని వెళ్ళమంటాడు. ఒకవేళ మీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అని అనుమానం గా అడుగుతాడు సేటు. అప్పుడు ఎలాగో ఆస్తి నీ చేతిలోనే ఉంది కదా అంటాడు రాహుల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X