Brahmamudi April 22 th episode: నా పరిస్థితి ఏంటీ.. భర్త రాజ్‌ను నిలదీసిన కావ్య.. కోడలి గెలుపు కోసం సుభాష్!

వెన్నెల చనిపోయిందని బాబు రాజ్ కొడుకు కాదని తెలుసుకుంటుంది కావ్య. కళ్యాణ్ చేత సంతకం పెట్టించాలన్న రాహుల్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. తల్లి స్పర్శ లేక బాబు హాస్పిటల్ పాలు అవుతాడు. రాజ్ ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ఆర్డర్ వేస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్ 390 లో ఏం జరిగిందంటే..

ఆస్తి పత్రాలు సేటు దగ్గర తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకుంటాడు రాహుల్. సేటు భయపడుతూ ఉంటే కొత్తగా భయపడుతున్నావు ఏంటి ఇలాంటివి మనం ఎన్ని చేయలేదు అంటాడు. నిజమే కానీ ఇంట్లో వాళ్ళని ఎప్పుడూ మోసం చేయలేదు కదా అందుకే టెన్షన్ గా ఉంది, నాలుగు రోజులలో ఎట్టి పరిస్థితులలోనూ నా డబ్బు నాకు కావాలి అంటాడు సేటు. వడ్డీ పాతిక లక్షలతో సహా వస్తుంది, నీకేమి కంగారు అక్కర్లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్.

Brahmamudi serial April 20th Episode of 390 Here is full story about Raj and Kavya

మరోవైపు ఆలోచనలో ఉన్న కావ్య మామ గారికి అన్ని నిజాలు తెలిసినప్పుడు ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నా కూడా ఎందుకు ఊరుకున్నారు అనుకుంటుంది. మామగారి నుంచి నిజం తెలుసుకోవడం కోసం సుభాష్ దగ్గరికి వెళ్తుంది. నిజం చెప్పమని నిలదీస్తుంది. నాకు ఏమీ తెలియదు అంటాడు సుభాష్. మీకు అన్నీ తెలిసనే విషయం నాకు తెలుసు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను అంటూ జరిగిందంతా చెప్తుంది కావ్య. నిజం చెప్పమంటూ తన తలపై ఒట్టు పెట్టుకుంటుంది.

నిజం చెప్పొద్దు అని రాజ్ ఒట్టు వేయించుకున్నాడు, చెప్పమని నువ్వు ఒట్టు వేయించుకుంటున్నావు నేను ఏ ఒట్టుకి విలువ ఇవ్వాలి అంటాడు సుభాష్. అయితే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అంటుంది కావ్య. అలా జరగకముందే అపర్ణ మనసు మారాలని కోరుకుంటున్నాను అంటాడు సుభాష్. నీ భర్త మీద మీ అభిప్రాయం ఏమిటి అని కావ్య అని అడుగుతాడు సుభాష్. ఎందుకు అంటుంది కావ్య.

ఒక భర్త ఒక పిల్లాడిని తెచ్చి వేరే స్త్రీతో కన్నాను అంటే ఏ భార్య ఊరుకోదు అత్తింటిని బజారుకు లాగుతుంది కానీ నువ్వు అలా చేయలేదు అంటాడు సుభాష్. స్వయంగా ఆయనే తప్పు చేశారు అని చెప్పినా కూడా నాకు ఎందుకో నమ్మకం కలగడం లేదు అంటుంది కావ్య. ఈ పోరాటంలో నువ్వే గెలవాలని కోరుకుంటున్నాను అంటాడు సుభాష్. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి భర్తని ఏం నిర్ణయించుకున్నారు అని అడుగుతుంది.

దేని గురించి అంటాడు రాజ్. ఇంట్లోంచి వెళ్ళిపోవటం గురించి అంటుంది కావ్య. తెలియదు అని సమాధానం చెప్తాడు రాజ్. మరి నన్నేం చేయాలనుకుంటున్నారు, పోనీ నన్నేం చేయమంటారో చెప్పండి. మీరేం బ్రహ్మచారి కాదు కదా కమండలం పట్టుకొని ఇంట్లోంచి వెళ్లిపోవడానికి మీకు ఒక భార్య ఉంది దానికి కూడు గూడు ఉండాలనే ఆలోచన లేదా అని అడుగుతుంది. మీది కానీ మీ బిడ్డని మీ బిడ్డని ఎందుకు చెప్తున్నారు అంటూ నిలదీస్తుంది.

ఆ బాబు నా బిడ్డే, అందుకే వాడి కోసం ఆస్తులు, అంతస్తులు, బంధాలు కూడా వదులుకోవాలని అనుకుంటున్నాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు కోటి రూపాయలు చూసుకొని ఆనందపడుతూ ఉంటారు రాహుల్, రుద్రాణి. అంతలోనే అక్కడికి లిప్స్టిక్ వెతుక్కుంటూ వస్తుంది స్వప్న. కంగారు పడుతూ నవ్వుతున్న తల్లి కొడుకుల్ని చూసి మళ్ళీ ఏం వెదవ వేషాలు వేశారు అని అడుగుతుంది.

Brahmamudi serial April 20th Episode of 390 Here is full story about Raj and Kavya

నవ్వితే నవ్వాము అంటావ్, నవ్వకపోతే నవ్వలేదు అంటావు అందుకే నవ్వుతున్నాము అంటారు తల్లి కొడుకులు. దొంగలు ఎలా ఉన్నా దొంగలు లాగే కనిపిస్తారు అంటూ తన లిప్స్టిక్ తను వెతుక్కుంటూ ఉంటే తెగ కంగారు పడిపోతారు తల్లి కొడుకులు. మొత్తానికి స్వప్నకి లిప్స్టిక్ దొరికితే అది తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాస్త ఆగితే దొరికిపోయే వాళ్ళం అంటూ రిలాక్స్ ఫీల్ అవుతారు తల్లి కొడుకులు.

మరోవైపు ఇంటికి పంతులుగారు వస్తారు. ఏమిటి విశేషం అని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. మీ చేతుల మీదుగా జరగాల్సిన పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను అంటారు పూజారి. అందరూ కంగారు పడిపోతారు. వివరంగా చెప్పండి అంటాడు రాజ్. ప్రతి సంవత్సరం మీ చేతుల మీదుగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాల గురించి మాట్లాడదామని వచ్చాను అంటాడు పూజారి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X