Brahmamudi April 21st Episode : మిస్టరీ ఛేదించే పనిలో రుద్రాణి .. కావ్యపై రాజ్ ఎంక్వైరీ, యామినిలో మొదలైన భయం
మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారని మీలో మా అమ్మని చూసుకుంటున్నానని .. మీ పుట్టినరోజు కూడా ఈరోజే కావడం యాధృచ్ఛికంగా జరిగిందని అపర్ణతో అంటాడు రాజ్. మా అమ్మకి చేసినట్లుగానే భావించి మీతో కేక్ కట్ చేయిస్తానని మీకు ఇష్టమేనా అని అడుగుతాడు రాజ్. ఆ మాటలతో ఎంతో పొంగిపోయిన అపర్ణ సరేనని చెప్పడంతో ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రాజ్. కావ్య, రాజ్‌లు ఆమెతో కేక్ కట్ చేయిస్తారు.
గుడికి వెళ్లిన రాజ్ ఎంతసేపటికీ రాకపోవడంతో యామిని, వైదేహిలు టెన్షన్ పడతారు. నువ్వు మిస్ చేస్తే రాజ్ మిస్ అయిపోతాడని వైదేహి హెచ్చరించడంతో యామిని గుడికి బయల్దేరుతుంది. గుడికి వచ్చిన యామిని .. రాజ్‌తో అపర్ణ, కావ్యలను చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని యామినిని రాజ్ ప్రశ్నించగా కావ్య నేనే పిలిచానని కవర్ చేస్తుంది.
రాజ్, అపర్ణలు పక్కకి వెళ్లగానే యామిని- కావ్యలు రాజ్ విషయం గురించి ఇండైరెక్ట్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ఆశీర్వదించమని అపర్ణని యామిని అడగ్గా ఆమె షాక్ అవుతుంది. ఇంటికొచ్చిన రాజ్ మంచితనాన్ని తల్లిదండ్రుల ముందు పొగిడేస్తుంది యామిని. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 21వ తేదీ ఎపిసోడ్‌లో 37లో ఏం జరిగిందంటే?

అపర్ణ పేరు చెప్పి చాలా సంతోషిస్తున్నాడు.. ఎవరీ అపర్ణ అని వైదేహి అడగ్గా, బావ కన్నతల్లి అని అంటుంది యామిని. ఆ మాటలతో వైదేహి , రఘునాథ్ షాక్ అవుతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజని చెబుతుంది యామిని. రాజ్ గతం మరిచిపోయాడు కదా? ఆమె పుట్టినరోజుని ఎలా గుర్తుపెట్టుకున్నాడని ప్రశ్నిస్తుంది వైదేహి. బావ చెప్పినట్లుగా యాధృచ్ఛికంగా వాళ్లు కలిశారని చెబుతుంది యామిని. నిజంగానే రామ్ ఆమెను గుర్తుపట్టలేదా? అని అడుగుతుంది వైదేహి. నేను వాళ్లని ఎంత దూరం పెడదామని చూసినా వాళ్లు ఏదో ఒక రకంగా దగ్గరవుతున్నారని మండిపడుతుంది యామిని.
దూరం చేస్తే దూరమవ్వడానికి అది మామూలు ప్రేమ కాదు.. 9 నెలలు కడుపులో మోసిన కన్నప్రేమ అంటాడు రఘునాథ్. పాతికేళ్లు ఆ కొడుక్కి తన తల్లి పంచిన ప్రేమ అని చెబుతాడు. తన ఫ్యామిలీకి తనని దూరం చేస్తూ తప్పు చేస్తున్నావని మండిపడతాడు. బావని నేను పెళ్లి చేసుకుంటే ఆ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీయే అవుతుందని అంటుంది యామిని. మరి కావ్యకి అన్యాయం చేస్తావా అని ప్రశ్నిస్తాడు రఘునాథ్. ముందు ఈ ప్రేమ ప్రయాణం మొదలుపెట్టింది మేమిద్దరమని, మధ్యలో వచ్చింది కావ్యేనని అంటుంది యామిని.
దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. ఈ ఇంటి మేలు కోరేవాళ్లని మీరు శత్రువులుగా చూస్తారు కదా అని అంటుంది రుద్రాణి. ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడాలని అనుకుంటున్న నేను ఇప్పుడు పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా అని ప్రశ్నిస్తుంది. మాట దాకా ఎందుకు? అసలు మనుషులకే విలువ లేదు కదా అని అంటాడు రాహుల్. రాజ్ వస్తాడని కావ్య పిచ్చి భ్రమలో బతుకుతుందని కావ్య, అపర్ణల మానసిక స్థితిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అంటుంది రుద్రాణి.
అపర్ణని కూడా కావ్య తనలాగే పిచ్చిదాన్ని చేసిందని అంటుంది రుద్రాణి. ఏం మాయ చేస్తే నీకేంటీ? అపర్ణని తిరిగి మామూలు మనిషిని చేసింది కదా అని దుగ్గిరాల ఫ్యామిలీ చీవాట్లు పెడుతుంది. వదినలో సడెన్‌గా ఇంత మార్పేంటీ? కొడుకును దూరం చేసుకున్న ఏ తల్లి కూడా ఇంత వేగంగా కోలుకోలేదని అంటుంది రుద్రాణి. ఇంతలో అపర్ణ వచ్చి అందరికీ ప్రసాదం పెడుతుంది.. సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. గుడిలో అన్నదానం ఎలా జరిగిందని ఇందిర అడగ్గా.. చాలా బాగా జరిగిందని అపర్ణ చెబుతుంది. ఇన్నిరోజులు కావ్య ఒక్కటే పిచ్చిగా ప్రవర్తిస్తుంది అనుకుంటే ఇప్పుడు తనకి నువ్వు కూడా తోడయ్యావని మండిపడుంది రుద్రాణి.
ఇన్ని రోజులు నేను కూడా రాజ్ లేడనే అనుకున్నానని.. కావ్య మాటలు నమ్మకుండా పిచ్చిదానిలా ప్రవర్తించానని, కానీ ఎప్పుడైతే గుడిలో దైవాన్ని దర్శించుకున్నానో అప్పుడే నమ్మకం వచ్చిందని చెబుతుంది అపర్ణ. నా రాజ్ ఖచ్చితంగా తిరిగొస్తాడని నాకు నమ్మకం కుదిందని, నన్ను నమ్మండని అంటుంది . ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మనం బాధపడాల్సిన అవసరం లేదని ఈ ఇంట్లో అంతా శుభాలే జరుగుతాయని అంటుంది. ఆ మాటలతో సుభాస్ షాక్ అవుతాడు. మీ అత్తయ్య చెప్పేది నిజమేనా అని కావ్యని ప్రశ్నిస్తాడు. రాజ్ తిరిగి వస్తాడని అంత నమ్మకంగా చెబుతోందని అడుగుతాడు.
నేను ఎప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు చెబుతున్నానని.. ఆయన ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తాడని చెబుతుంది కావ్య. ఆయన తిరిగి వచ్చిన రోజున మీకు నమ్మకం కుదురుతుందని అంటుంది. కావ్య నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవ్వరూ ఏమీ మాట్లాడరేంటీ అని అడుగుతుంది రుద్రాణి. కొద్దిరోజుల్లో రాజ్ వస్తాడని చెబుతుంది కదా? అని అంటాడు ప్రకాశం. అది నిజం కావాలని కోరుకుందదామని చెబుతాడు. కావ్యని కొన్నిరోజులు ఏమీ అడగొద్దని, ఇంట్లో మనశాంతిని దూరం చేయొద్దని రుద్రాణికి చీవాట్లు పెడతాడు సుభాష్. రాజ్ తిరిగి రావాలని తన పిన్నిగా నేను కూడా కోరుకుంటున్నానని అంటుంది ధాన్యలక్ష్మీ.
అపర్ణ అత్తయ్యలో ఇంత మార్పు ఏంటీ? అని రుద్రాణిని అడుగుతాడు రాహుల్. అదే నాకూ అర్ధం కావడం లేదని.. వదిన ఇంత స్ట్రాంగ్‌గా చెబుతుందంటే , గుడిలో ఏదో జరిగిందని రాజ్ నిజంగా బ్రతికే ఉన్నాడా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. మనం సాక్ష్యాలు చూశాం కానీ రాజ్ శవాన్ని చూడలేదు కదా అని అంటుంది. దీని వెనకున్న నిజాన్ని కనుక్కోవాలని అనుకుంటుంది రుద్రాణి.
కావ్యని ఎన్నిసార్లు అడిగినా తమ బంధం గురించి చెప్పకపోవడంతో రాజ్ ఆలోచిస్తుంటాడు. కళావతి పంపిన గిఫ్ట్‌లో ఏదో ఒక క్లూ ఉండే ఉంటుందని అనుకుని ఆ షర్ట్ ఓపెన్ చేసి చూస్తాడు రాజ్. దాని మీద పంపించిన వాళ్ల అడ్రస్ లేకపోవడంతో కొరియర్ ఆఫీస్‌కి ఫోన్ చేసి కనుక్కుంటాడు. మీకు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆ కొరియర్ పంపించారని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో రాజ్ ఫోటో చూసుకుంటూ మురిసిపోతుంది అపర్ణ. అది చూసిన కావ్య చాలా సంతోషిస్తుంది.
అసలు రాజ్‌ను ఎలా తిరిగి ఇంటికి తీసుకొస్తావని అడుగుతుంది అపర్ణ. ఆ యామిని ఏమైనా చేస్తుందేమోనని భయపడుతుంది అపర్ణ. అంత ఛాన్స్ నేను ఇవ్వనని అంటుంది. ఆ షర్ట్‌పై ఆర్ అనే అక్షరం ఉంది కదా దాని గురించే ఆలోచిస్తాడని చెబుతుంది కావ్య. అందరూ భోజనానికి వెళ్తుండగా రుద్రాణి ఆపుతుంది. ఇంతలో కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు వచ్చి రాజ్‌ను స్మరించుకుంటామని చెబుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











