Brahmamudi April 21st Episode: ఓనర్‌కి దొరికిపోయిన రాజ్, లక్కీ.. ఇందూ ఒడిలో రాజ్ రొమాన్స్
Photo Courtesy: JioHotstar
ఇందూని విడిపించడానికి కావాల్సిన డబ్బు కోసం రేఖని బంగారాన్ని తాకట్టుగా పెట్టమని చెబుతాడు చక్రీ. దాంతో రేఖ, ఐశ్వర్య, స్వాతిలు బంగారం తీసుకొచ్చి ఇస్తారు. భ్రమరాంబ మాత్రం తన దగ్గర చిన్న చైన్ మాత్రమే ఉందని, మిగిలినదంతా గిల్ట్ నగలనీ చెప్పడంతో శేషం షాక్ అవుతాడు. స్వరాజ్- లక్కీలు పీకలదాకా తిన పడుకోవడంతో ఇదే అదనుగా లోపలికి వెళ్తుంది నందూ. ఆమెను చూడగానే ఇందూ షాక్ అవుతుంది. నిన్ను నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తానని నందూ చెప్పగా.. నేను ఇప్పుడు ఆ ఇంటికి రాలేనని చెబుతుంది ఇందూ. నేను ఇక్కడ బాగానే ఉన్నాను.. కానీ నానమ్మ, తాతయ్యల గురించే బాధపడుతున్నానని చెబుతుంది ఇందూ, వాళ్లిద్దరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెబుతుంది. ఇదంతా నా కోసం ఎందుకు చేస్తున్నావని ఇందూ అడగ్గా.. నువ్వు నన్ను దేవుడిచ్చిన చెల్లెలు అనుకున్నావు కదా అంటుంది నందూ.
రేఖ వాళ్లు ఇచ్చిన బంగారానికి 50 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయని చక్రీ తేల్చి చెప్పడంతో.. అపర్ణ దగ్గరున్న నగల్ని లాక్కోవడానికి రేఖ, భ్రమరాంబలు వెళ్తారు. ఇంతలో నందూ వచ్చి ఈ ఇంట్లో ఏదో తేడాగా ఉంది, మీరే ఇందూని కిడ్నాప్ చేశారని అనడంతో అంతా షాక్ అవుతారు. ముందు సుభాష్ గారికి ఆపరేషన్ చేయించమని నందూ చెప్పడంతో దానికి భ్రమరాంబ సరేనని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 21వ తేదీ ఎపిసోడ్ 1012లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూ అడిగినట్లు కాఫీ ఇస్తాడు రాజ్. ఇంతలో తలుపులు కొడుతున్న సౌండ్ రావడంతో స్వరాజ్, లక్కీలు షాక్ అవుతారు. లక్కీ కిటికీ తీసి చూడగా.. ఈ ఇంటి ఓనర్ వచ్చాడని చెప్పడంతో ఇందూ, రాజ్ షాక్ అవుతారు. నేను వస్తున్నట్లు నీకు ఎవరు చెప్పారని లక్కీపై మండిపడతాడు ఇంటి ఓనర్. మీ కోసం ఇంటిని శుభ్రం చేస్తున్నానని చెబుతాడు లక్కీ. ఇంటి ఓనర్ వచ్చేసరికి ఇందూ, రాజ్‌లు బీరువాలో దాక్కుంటారు. వాళ్లిద్దరూ కనిపించకపోవడంతో లక్కీ ఇళ్లంతా వెతుకుతాడు. వాడు బాత్‌రూంలోకి వెళ్లగానే మనం బయటికి వెళ్దామని ఇందూతో చెబుతాడు రాజ్. ఇంతలో ఇందూ ఒడిలో పడతాడు స్వరాజ్. బీరువాలో ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా ఓనర్ బీరువా ఓపెన్ చేస్తుండగా లక్కీ వచ్చి టవల్, బట్టలు ఇస్తాడు.
ఓనర్‌కి రాజ్ కనిపించడంతో ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు అంటూ మండిపడతాడు. వీడు మనోడే.. మీకు వంట ప్రిపేర్ చేయడానికి వచ్చాడని లక్కీ చెప్పడంతో ఫుడ్ అదిరిపోవాలని రాజ్‌కి పెద్ద లిస్ట్ చెబుతాడు ఓనర్. అది వినగానే రాజ్, లక్కీలు షాక్ అవుతారు. ఫారిన్‌లో ఉండి ఉండి నా నోరు చెడిపోయింది. గంటలో అన్నీ రెడీ అయిపోవాలని డెడ్‌లైన్ పెడతాడు. ఇవన్నీ మనం ఎలా చేస్తాం.. మనకి వంట రాదు కాదు కదా అని ఆలోచిస్తుండగా ఇందూ గుర్తొస్తుంది. మీరు నాకు హెల్ప్ చేయాలని ఇద్దరూ బతిమలాడతారు. మా ఇంటి ఓనర్ చెప్పిన వంటలన్నీ చేసి పెట్టమని అడుగుతాడు లక్కీ. నా వల్ల కాదని నేను చేయనని తేల్చేస్తాడు రాజ్.
మా వాడు రేసుగుర్రంలో హీరోయిన్ టైప్.. ఎమోషన్స్ అన్ని లోపలే దాచుకుంటాడని అంటాడు లక్కీ. వంట చేయకపోతే వాడికి అనుమానం వస్తుంది.. మీరే హెల్ప్ చేయాలని చెబుతాడు. ఈ రెండ్రోజులు నన్ను టార్చర్ చేశారు. పాపం కదా అని వంట చేసి పెడితే దానిలో విషం కలిపానని అవమానించారు అని మండిపడుతుంది ఇందూ. పాత గొడవలన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు టార్చర్ చేయొద్దని అడుగుతాడు లక్కీ. అయినా నీలో ఉన్న ఆతృత, ఆరాటం భయం మీవాడిలో కనిపించడం లేని అంటుంది ఇందూ.
ఆ ఫోజులు వద్దు.. మేడం గారిని రిక్వెస్ట్ చేయమని రాజ్‌ని బతిమలాడతాడు లక్కీ. అయినప్పటికీ రాజ్ మండిపడతాడు. దాంతో రాజ్ బతిమలాడుతున్నట్లుగా నటిస్తాడు. ప్లీజ్ ఇందూ గారు మీరు కోయమంటే కోస్తాం, కడగమంటే కడుగుతామని అంటాడు రాజ్. వండిపెడితే చాలా? అది అంత ఈజీ అనుకున్నారా? వండటం అంత ఈజీ అయితే మీరే వండుకోవచ్చు కదా అని ఫైర్ అవుతుంది ఇందూ. వండిపెట్టడానికి మేం ఇంటి మనిషినా? వంట మనిషినా అని అడుగుతుంది. వంట మనిషి అయితే ఆర్డర్ వేస్తాం కానీ, ఇలా బతిమలాడం.. మా మనిషి అనుకునే అడుగుతున్నాం, హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతాడు రాజ్.
మీరు వండితే తింటున్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది? ఇప్పుడు కూడా ఆ ఓనర్ గండం నుంచి బయటపడేయమని అడుగుతాడు రాజ్. ఇన్నిరోజులు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాం కదా మాకు హెల్ప్ చేయమని బతిమలాడతాడు లక్కీ. ఆ ఓనర్ చెప్పిన లిస్ట్ చూస్తే మీరే మా మీద జాలిపడతారని అంటాడు రాజ్. ఇన్ని ఐటెమ్స్ చేస్తే నాకేంటీ లాభమని ఇందూ అడగ్గా.. మీ కోసం ఏమైనా చేస్తామని చెబుతాడు రాజ్. అయితే నాకు గోలీసోడా కావాలని ఇందూ అడుగుతాడు. చిన్నప్పుడు మా నానమ్మ ఒకసారి తాగించింది. ఇప్పుడు నాకు తాగాలని అనిపిస్తోందని అంటుంది ఇందూ. ఇంత రాత్రిపూట గోలీసోడా ఎక్కడ దొరుకుతుందని అడుగుతాడు ఇందూ. అయినాసరే సిటీ మొత్తం వెతికి నీకోసం గోలీసోడా తీసుకొస్తానని చెబుతాడు రాజ్. ప్రామీస్ చేయమని ఇందూ అడగ్గానే ప్రామీస్ చేస్తాడు రాజ్.
ఇంటి ఓనర్‌కి లక్కీ మందు పోస్తూ ఉంటాడు. మందు చాలా స్ట్రాంగ్‌గా ఉందని ఓనర్ అడగ్గా.. ఇది ఇండియన్ బ్రాండ్ కదా అలాగే ఉంటుందని చెప్పి ఎక్కువగా మందు పోస్తాడు లక్కీ. నేను ఒక్కో రౌండ్ తాగేసరికి, ఒక్కో ఫుడ్ నా టేబుల్ మీదకి రావాలని ఆర్డర్స్ వేస్తాడు ఓనర్. మీరు తాగుతూ ఉండండి.. నేను వెళ్లి హెల్ప్ చేస్తానని వెళ్లిపోతాడు లక్కీ. రాజ్, లక్కీలు సాయం చేస్తుండగా ఇందూ వంట చేస్తుంది. ఫుడ్ రాకపోవడంతో వంటగదిలోకి వెళ్లి చూస్తాడు ఓనర్. అక్కడ వంట చేస్తున్న ఇందూని చూడగానే ఎవరు నువ్వు అని అడుగుతాడు ఓనర్. దాంతో రాజ్ వెనక దాక్కుంటుంది ఇందూ. నువ్వేం మాట్లాడొద్దు.. నువ్వు పేదాలు కదిలించు, నేను మాట్లాడతానని లక్కీ సైగలు చేస్తాడు. దాంతో లక్కీ వాయిస్ ఇస్తుండగా ఇందూ పేదాలు కదిలిస్తుంది. నీ గొంతు అబ్బాయిలా ఉంది, కానీ గెటప్ చూస్తే అమ్మాయిలా ఉందని ఓనర్‌కి డౌట్ వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications